ప్రధాన మంత్రి కార్యాలయం

సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం

Posted On: 21 JAN 2021 8:10PM by PIB Hyderabad

   పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ట్వట్టర్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియాలో దురదృష్టవశాత్తూ చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. ఈ విషాద సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సంతాపం తెలుపుతున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడినవారు సత్వరం కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

***


(Release ID: 1691067) Visitor Counter : 109