ప్రధాన మంత్రి కార్యాలయం
దేశం గురు గోవింద్ సింహ్ జీ ఆదర్శాల ద్వారా ప్రేరణ ను పొంది పురోగమిస్తోంది: ప‌్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
20 JAN 2021 3:29PM by PIB Hyderabad
గురు గోవింద్ సింహ్ జీ ‘ప్రకాశ్ పర్వ్’ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు. ఈ శుభ సందర్భం లో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్’ లో భాగం గా ఉత్తర్ ప్రదేశ్ లో 6 లక్షల మంది లబ్ధిదారుల కు ఆర్థిక సహాయాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేసిన తరువాత ఆయన ఆ కార్యక్రమం లో ప్రసంగిస్తూ, ప్రజలకు ప్రకాశ్ పర్వ్ తాలూకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ప్రకాశ్ పర్వ్’ సందర్భం లో లబ్ధిదారులకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గురు సాహిబ్ తన పట్ల ఎంతో కృప ను వర్షించారని, ఆయన కు సేవ చేసేందుకు తగినంత అవకాశాన్ని కూడా ఇచ్చారని తాను భావిస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు. సత్యం, సేవ ల మార్గాన్ని అనుసరిస్తూనే, సవాళ్ళ ను స్వీకరించడం లో గురు సాహబ్ జీవితం, గురు సాహబ్ సందేశం మనకు ప్రేరణ ను ఇస్తున్నాయన్నారు. సత్యం, సేవల భావన నుంచే ఈ స్థాయి బలం, సాహసాలు అంకురిస్తాయని, గురు గోవింద్ సింహ్ జీ చూపిన ఈ మార్గం లో దేశం ముందుకు సాగిపోతోందని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1690476)
Visitor Counter : 137
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam