ప్రధాన మంత్రి కార్యాలయం

ప‌శ్చిమ బంగాల్ లో జ‌ల్‌పాయీగుడీ లోని ధూప్‌ గుడీ లో రోడ్డు ప్ర‌మాదం కారణం గా ప్రాణ‌ న‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి;  పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి అనుగ్రహపూర్వక రాశి చెల్లింపు ఉంటుందని ఆయ‌న ప్ర‌క‌టించారు

Posted On: 20 JAN 2021 11:18AM by PIB Hyderabad

ప‌శ్చిమ బంగాల్ లో జ‌ల్‌పాయీగుడీ లో గ‌ల‌ ధూప్‌గుడీ లో ఒక రోడ్డు ప్ర‌మాదం కార‌ణం గా ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్య‌క్తం చేశారు.  ‘ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి అనుగ్రహపూర్వక రాశి చెల్లింపు ఉంటుందని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ప్ర‌ధాన మంత్రి అనేక ట్వీట్ ల‌లో ‘‘జ‌ల్‌పాయీగుడీ (ప‌శ్చిమ బంగాల్) లోని ధూప్‌గుడీ లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం ఎంతో బాధాక‌రం గా ఉంది.  ఈ దుఃఖ ఘ‌డియ‌ లో, ఆప్తుల‌ను కోల్పోయిన కుటుంబాల‌ శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  గాయ‌ప‌డ్డ‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.  

ప‌శ్చిమ బంగాల్ లో ప్ర‌మాదం కార‌ణం గా ప్రాణాల‌ను కోల్పోయిన వారి ద‌గ్గ‌రి సంబంధీకుల‌కు తలా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతు న అనుగ్ర‌హ పూర్వ‌క రాశి ని పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి చెల్లించడం జ‌రుగుతుంది.  ఈ ప్రమాద ఘ‌ట‌న‌ లో గాయ‌ప‌డ్డ‌ వారికి ఒక్కొక్క‌రికి 50,000 రూపాయ‌లు వంతున ఇవ్వ‌డం జ‌రుగుతుంది’’ అని పేర్కొన్నారు.


- PMO India
@PMOIndia
The road accident in Dhupguri in Jalpaiguri (West Bengal) is extremely anguishing. In this time of sadness, prayers with the bereaved families. May the injured recover soon: PM @narendramodi

-PMO India
@PMOIndia
From the PMNRF, Ex-gratia of Rs. 2 lakh each would be given to the next of kin of those who have lost their lives due to the accident in West Bengal. Rs. 50,000 each would be given to those injured.



 

***
 



(Release ID: 1690291) Visitor Counter : 113