నీతి ఆయోగ్
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 రెండవ ఎడిషన్‌ను ప్రారంభించనున్న నీతి ఆయోగ్
Posted On:
19 JAN 2021 10:27AM by PIB Hyderabad
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020కి చెందిన రెండవ ఎడిషన్‌ను జనవరి 20 న నీతి ఆయోగ్ వర్చువల్ ఈవెంట్‌లో విడుదల చేస్తుంది. ఈ సూచికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె సరస్వత్, సిఇఒ అమితాబ్ కాంత్ సమక్షంలో విడుదల చేయనున్నారు.
ఇండెక్స్ రెండవ ఎడిషన్‌లో మొదటిది అక్టోబర్ 2019 లో ప్రారంభించబడింది. దేశాన్ని ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం నిరంతర నిబద్ధతను చూపుతోంది.
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 దేశంలోని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయా ప్రభుత్వాల నూతన ఆవిష్కరణలు, పనితీరు ఆధారంగా ర్యాంక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అలాగే వారి బలాలు మరియు బలహీనతలను గుర్తించడం ద్వారా వారి ఆవిష్కరణ విధానాలను మెరుగుపరచడానికి వారిని శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ర్యాంకింగ్ పద్దతి కొత్త ఆవిష్కరణలలో జాతీయ నాయకుల నుండి పాఠాలు నేర్చుకోగలిగే విధంగా రూపొందించబడింది. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారితీస్తుందని..తద్వారా పోటీ సమైక్య వాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆశిద్దాం.
పనితీరును సమర్థవంతంగా పోల్చడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను 17 ‘ప్రధాన రాష్ట్రాలు’, 10 ‘ఈశాన్య మరియు కొండ రాష్ట్రాలు’, మరియు 9 ‘నగర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు’గా విభజించారు. ఫలితం మరియు పాలన అనే రెండు విస్తృత విభాగాలలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 సర్కిల్‌లో 36 సూచికలు ఉన్నాయి. వీటిలో హార్డ్ డేటా (32 సూచికలు) మరియు నాలుగు మిశ్రమ సూచికలు ఉన్నాయి.
గత ఏడాది పద్దతికి మరిన్ని కొలమానాలను ప్రవేశపెట్టడం ద్వారా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 భారతీయ ఆవిష్కరణల వ్యవస్థ యొక్క సమగ్ర దృక్పథాన్ని అందిస్తుంది. ఆవిష్కరణను కొలవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడే విధానాలను (పరిశోధన మరియు అభివృద్ధికి ఖర్చు చేసిన స్థూల జాతీయోత్పత్తి శాతం వంటివి) చేర్చడానికి ఫ్రేమ్‌వర్క్ నవీకరించబడింది. అదే సమయంలో భారతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకమైన విధానాలు కూడా ఉన్నాయి.
ఈ ఇండెక్స్ ప్రస్తుత ట్రెండ్స్‌ను ఆవిష్కరిస్తుంది. అలాగే దేశం, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఆవిష్కరణలకు కారణమయ్యే వివిధ అంశాల యొక్క వివరణాత్మక విశ్లేషణలను అందిస్తుంది. ఈ విశ్లేషణలు విధాన రూపకర్తలకు జాతీయ మరియు ఉప జాతీయ స్థాయిలో ఉత్ప్రేరకాలను మరియు ఆవిష్కరణ యొక్క నిరోధకాలను గుర్తించడంలో సహాయపడతాయని భావిస్తారు.
ఈ ఈవెంట్ https://www.youtube.com/watch?v=i7AD_1uc0Is&feature=youtu.be లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
******
(Release ID: 1689976)
Visitor Counter : 225
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam