సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, ఖాదీ చేతివృత్తులు, గిరిజన జనాభాను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కెవిఐసి..గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రేపు రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

Posted On: 18 JAN 2021 9:37AM by PIB Hyderabad

ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రేపు అంటే మంగళవారం (జనవరి 19) రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. వాటిలో ఒక ఎంఓయు గిరిజన విద్యార్థుల కోసం ఖాదీ ఫాబ్రిక్ కొనుగోలుకు సంబంధించి కాగా, మరొక ఎంఓయు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కెవిఐసితో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎమ్‌ఇజిపి) కోసం అమలు చేసే ఏజెన్సీగా భాగస్వామ్యం కలిగి ఉంది.


గౌరవనీయ ఎంఎస్‌ఎంఇ  మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మరియు గౌరవనీయ గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోబడతాయి. గౌరవనీయ ప్రధానమంత్రి "ఆత్మనిర్భర్ భారత్" పిలుపు మేరకు ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఖాదీ చేతివృత్తులవారితో పాటు దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉన్న గిరిజనులకు ఉపాధిని సృష్టించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.


మొదటి అవగాహన ఒప్పందంలో భాగంగా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020-21లో రూ .1477 కోట్ల విలువైన 6 లక్షల మీటర్ల ఖాదీ బట్టను  మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఏకలవ్య  పాఠశాలల్లోని విద్యార్థుల కోసం కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏకలవ్య పాఠశాలల సంఖ్యను పెంచుతుంది; ఖాదీ ఫాబ్రిక్ కొనుగోలు పరిమాణం కూడా దామాషా ప్రకారం పెరుగుతుంది.


రెండవ అవగాహన ఒప్పందం ప్రకారం, భారతదేశంలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధి వ్యవహారాలు చూసే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌టిఎఫ్‌డిసి) పిఎమ్‌ఇజిపి పథకాన్ని అమలు చేయడానికి భాగస్వామిగా వ్యవహరించనుంది. ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని రంగాలలో షెడ్యూల్డ్ గిరిజన ఔత్సాహిక వ్యాపార సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఎన్‌ఎస్‌టిఎఫ్‌డిసి రాయితీ రుణ పథకాలను అందిస్తుంది. తద్వారా ఈ ఎంఒయు గిరిజనులకు వివిధ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఎన్‌ఎస్‌టిఎఫ్‌డిసి, కెవిఐసిల భాగస్వామ్యం ఎస్టీలలో పిఎమ్‌ఇజిపి పథకం పరిధిని పెంచుతుంది.


 

****(Release ID: 1689639) Visitor Counter : 21