రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
జన్ ఔషధి కేంద్రాలలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.484 కోట్ల రికార్డు అమ్మకాలు
Posted On:
14 JAN 2021 3:27PM by PIB Hyderabad
నాణ్యమైన జనరిక్ .షధాలను విక్రయించే
దేశంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 7064 ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలలో (పీఎమ్‌బీజేకే) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-2021లో జనవరి 12వ తేదీ వరకు) రికార్డు స్థాయిలో రూ.484 కోట్ల అమ్మకాలు జరిగాయి. భారతీయ జన్ ఔషధి కేంద్రాలలో (పీఎమ్‌బీజేకే) నాణ్యమైన జనరిక్ మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలతో పోలిస్తే ఇది 60% అధికం. జన్ ఔషధి కేంద్రాల్లో మందుల కొనుగోలు ద్వారా దేశ పౌరులకు దాదాపు రూ.3000 కోట్ల మేర సొమ్ము పొదుపు చేయడానికి దోహదం చేసింది. కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ ఈ రోజు ఈ విషయాన్ని కర్ణాటకలోని వెల్లడించారు. గతే ఏడాది (2019-2020 ఆర్థిక సంవత్సరంలో) భారత ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాలకు రూ.35.51 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. ఫలితంగా దేశ పౌరులకు దాదాపు రూ.2600 కోట్ల మేర పొదుపు జరిగింది. ఫలితంగా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి పౌరులకు రూ.74 మేర పొదుపు చేకూరింది. జన్ ఔషధి కేంద్రాల వల్ల
పౌరులకు గుణకార ప్రభావం కలిగిందని శ్రీ గౌడ అన్నారు. మన దేశ వ్యాప్తంగా మహిళల సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా జన్ ఔషధి “సువిధా” శానిటరీ ప్యాడ్‌లను ఒక్క రూపాయికి ఒక్కటి చొప్పున అమ్ముతున్నట్లు మంత్రి ప్రకటించారు. జన్ ఔషధి “సువిధా” శానిటరీ ప్యాడ్ల కోసం ప్రభుత్వం గత డిసెంబరు (డిసెంబర్ 2020లో) రూ.3.6 కోట్ల అర్డర్‌ను చేసింది. 30 కోట్ల జన్ ఔషధి “సువిధా” శానిటరీ ప్యాడ్లకు టెండర్ ఖరారు చేయబడింది. కర్ణాటక గురించి ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీ గౌడ మాట్లాడుతూ, ప్రస్తుతం కర్ణాటకలోని 788 ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలు పౌరులకు సరసమైన ధరలకు మేటి-నాణ్యమైన జనరిక్ ఔషధాల్ని అందిస్తూ వారికి సేవలు అందిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 800 పీఎమ్‌బీజేకేలను ప్రారంభించాలనే లక్ష్యాన్ని సాధించడం కర్ణాటక లక్ష్యం.
హెల్త్‌కేర్ రంగంలో విస్తృత ఔషధాలతో ప్రత్యేక పురోగతి సాధించిన కర్ణాటకలోని పీఎంబీజేపీ కేంద్రాల ద్వారా 2021 మార్చి నాటికి రూ.125 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు.
*****
(Release ID: 1688659)
Visitor Counter : 277
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam