ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పోలియో జాతీయ రోగ నిరోధకత దినోత్సవం (పల్స్‌ పోలియో) ఈనెల 31కి మార్పు

प्रविष्टि तिथि: 14 JAN 2021 12:10PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, కరోనా టీకా కార్యక్రమాన్ని ఈనెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, "జాతీయ రోగ నిరోధకత దినోత్సవం" లేదా "పోలియో ఆదివారం" కార్యక్రమాన్ని ఈనెల 31కి వాయిదా వేసింది.

    ఈనెల 30న ఉదయం 11.45 గం.కు, రాష్ట్రపతి భవన్‌లో కొందరు చిన్నారులకు పోలియో టీకా వేయడం ద్వారా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

    కొవిడ్‌ నిర్వహణ & టీకా సేవలు, కొవిడేతర అత్యవసర ఆరోగ్య సేవల కార్యక్రమాలు ఒకదానిపై మరొకటి ప్రతికూల ప్రభావం చూపకుండా, ఆరోగ్య శాఖ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

***


(रिलीज़ आईडी: 1688541) आगंतुक पटल : 287
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Tamil , Malayalam