భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

విజ్ఞానశాస్త్ర ప‌ర‌మైన‌, సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారానికి గాను భార‌త‌దేశానికి, యుఎఇ కి మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 13 JAN 2021 1:03PM by PIB Hyderabad

విజ్ఞానశాస్త్ర ప‌ర‌మైన‌, సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారం అంశం లో యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన నేశ‌న‌ల్ సెంట‌ర్ ఆఫ్ మీటియరాల‌జి (ఎన్‌సిఎమ్‌) కు, భార‌త‌దేశానికి చెందిన పృథ్వి శాస్త్రాల మంత్రిత్వ శాఖ‌ (ఎమ్ఒఇఎస్ ) కు మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రానికి (ఎమ్ఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు లో జ్ఞానాన్ని, సమాచారాన్ని, వాతావరణ విజ్ఞానానికి, భూకంప విజ్ఞానానికి, స‌ముద్ర విజ్ఞానానికి సంబంధించిన ఉత్పాదనలను.. అంటే, రేడార్‌, ఉప‌గ్ర‌హ‌ం, అల‌ల మాప‌క సాధనాలు, సైజ్ మిక్ స్టేశన్స్, వాతావ‌ర‌ణ విజ్ఞాన కేంద్రాల వంటి వాటిని ఒక ప‌క్షానికి మ‌రొక ప‌క్షం ఇచ్చి పుచ్చుకొనే ప్రతిపాదనలు ఉన్నాయి.

  1. శాస్త్రవేత్త‌ల‌, ప‌రిశోధ‌క విద్యార్థుల‌, స్పెష‌లిస్టులకు ఉద్దేశించిన అనుసంధానం, శిక్షణ, సలహాలు-సంప్రదింపుల వంటి వాటి కోసం ఉభయ దేశాల మధ్య యాత్ర లు, అనుభ‌వాన్ని పరస్పరం ఇచ్చి, పుచ్చుకోవడం, జల వాయు సంబంధి సమాచారం పై ప్రధానం గా దృష్టి పెట్టే సేవ లు, ఉష్ణ మండల తుపానుల గురించిన ముందు జాగ్రత్తలకు సంబంధించిన ఉపగ్రహ సమాచార రాశి ని ఉపయోగించుకోవడం లో ఆదాన- ప్రదానం. 

  2. సమాన హితం ముడిప‌డ్డ కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన విజ్ఞాన‌శాస్త్ర ప‌ర‌మైన‌, సాంకేతిక‌ప‌ర‌మైన స‌మాచారాన్ని ఒక ప‌క్షానికి మ‌రొక ప‌క్షం వెల్లడి చేసుకోవ‌డం.

  3. ఉభ‌య దేశాల‌ లో విజ్ఞానశాస్త్ర ప‌ర‌మైన చ‌ర్చాస‌భ‌ లు, సాంకేతిక ప‌ర‌మైన చ‌ర్చాస‌భ‌ లు/కార్య‌శాల‌ లు / స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌డం, ఎమ్ఒయు లో పేర్కొన్న మేర‌కు స‌హ‌కరించుకొనే రంగాల‌లో ప్రస్తుతం ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల పై శిక్షణ పాఠ్యక్రమాన్ని నిర్వహించడం.

  4. రెండు ప‌క్షాలు ప‌ర‌స్ప‌రం సమ్మతిని వ్య‌క్తం చేసే మేర‌కు ఇత‌ర రంగాల‌ లో స‌హ‌క‌రించుకోవ‌డం.

  5.  ఇరు పక్షాల సమ్మతి తో సాగర జ‌లాల‌పై సముద్ర విజ్ఞానశాస్త్ర ప‌ర‌మైన ప‌ర్యవేక్ష్ణ నెట్ వ‌ర్క్ ను స్థాపించడం.

  6. భార‌త‌దేశం లో కోస్తా తీర ప్రాంతాల పై, యుఎఇ లో ఈశాన్య ప్రాంతాలపై ప్ర‌భావాన్ని చూపేట‌టువంటి ఓమాన్ సముద్రం, అరేబియా స‌ముద్రం ల‌లో తలెత్తే సునామీలను గురించి మ‌రింత ఎక్కువ విశ్వ‌స‌నీయ‌మైన, తీవ్ర ముంద‌స్తు అంచ‌నాల‌ను వెల్ల‌డించ‌డానికి సునామీ న‌మూనాల విషయంలో ప‌రిశోధ‌న‌ల‌ ను చేప‌ట్టే విశిష్ట సామర్థ్యాన్ని నిర్మించుకోవడం లో స‌హ‌క‌రించుకోవ‌డం.

  7. సునామీ ముంద‌స్తు హెచ్చరిక కేంద్రాల (టిఇడ‌బ్ల్యుసి) లో, సునామీ పూర్వ అంచ‌నా కార్య‌ాల‌ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ముందస్తు అంచనా సంబంధి సాఫ్ట్ వేర్ ను నెలకొల్పడం కోసం స‌హ‌కరించుకోవడం.

  8. అరేబియా సముద్రంలో, ఓమాన్ సముద్రంలో సునామీ వంటి స్థితి ని ఉత్పన్నం చేయడం లో సహాయక భూకంప సంబంధి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భార‌త‌దేశం లోని ద‌క్షిణ‌, ప‌శ్చిమ ప్రాంతాల‌ లోను, యుఎఇ లోని ఉత్త‌ర ప్రాంతంలోను ఏర్పాటైన కొన్ని సైజ్ మిక్ స్టేశన్ ల నుంచి అందే వాస్తవిక సమాచారాన్ని ఒక ప‌క్షానికి మ‌రొక ప‌క్షం వెల్ల‌డి చేసుకోవ‌డం.

  9. భూకంపాల అధ్య‌య‌న శాస్త్ర రంగంలో స‌హ‌క‌రించుకోవ‌డం. దీనిలో అరేబియా స‌ముద్రం, ఓమాన్ సముద్రం ల‌లో సునామీ అల‌ల కు తావు ఇచ్చేట‌టువంటి భూకంపాల‌కు సంబంధించిన కార్యకలాపాల అధ్య‌య‌నం కూడా ఒక భాగం గా ఉంటుంది.

  10. జ్ఞానాన్ని ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకోవ‌డం ద్వారా ఇసుక తుపానుల‌ ను, ధూళి తుపానుల‌ ను గురించి ముంద‌స్తుగా హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంలో స‌హ‌క‌రించుకోవ‌డం.

పూర్వరంగం

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో వాతావ‌ర‌ణ ఆధారిత రంగాల సామ‌ర్ధ్యాన్ని పెంపొందింప చేయ‌డం లో వాతావ‌ర‌ణ సంబంధ సేవ‌లు కీల‌క‌మైన పాత్ర‌ ను పోషిస్తాయి. అంతేకాదు, వ్య‌వ‌సాయం, ర‌వాణా, జ‌లం వంటి వాతావ‌ర‌ణ ఆధారితమైన ఆర్థిక రంగాల‌లో ఏర్ప‌డే రిస్కు ను నిర్వ‌హించ‌డం లో కూడా ఈ విధ‌మైన సేవ‌లు వాటి వంతు పాత్ర‌ ను పోషిస్తాయి. ముంద‌స్తు హెచ్చ‌రిక వ్య‌వ‌స్థ‌ల‌ లో, వాతావ‌ర‌ణ ప‌ర‌మైన సేవలు మ‌రియు ముంద‌స్తు అంచ‌నా సేవ‌ల ఆధునీక‌ర‌ణ లో దేశాలు పెట్టుబ‌డి పెడుతూ ఉన్న క్ర‌మంలో వాటి మ‌ధ్య ప్రాంతీయ, అంత‌ర్జాతీయ స‌హ‌కారానికి రంగాన్ని సిద్ధం చేయ‌డం ద్వారా ప్ర‌తిఘాతుక‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు వీలు ఉటుంది. వాతావ‌ర‌ణానికి ఉన్న‌టువంటి ప‌రిణామక్ర‌మ భ‌రిత‌ స్వ‌భావం కార‌ణంగా ప్రాంతీయ స‌హ‌కారం వ‌ల్ల త‌ర‌చుగా మార్పుల‌కు లోన‌య్యే వాతావ‌ర‌ణ న‌మూనాల‌ను గురించి అర్థం చేసుకోవ‌డం లో మెరుగుద‌ల ఒనగూరడంతో పాటు సమర్ధమైన ప్ర‌తిస్పంద‌నపూర్వ‌క‌ వ్యూహాల‌ను రూపొందించుకోవ‌డం, పెట్టుబ‌డి వ్య‌యాల‌ను త‌గ్గించుకోవ‌డం, ఆయా ప్రాంతాల‌కు త‌గిన‌టువంటి సాంకేతిక‌ప‌ర‌మైన నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను వృద్ధి చేయ‌డం, వాతావ‌ర‌ణ సంబంధిత సేవ‌ల ఆధునీక‌ర‌ణ‌, స్థిర‌త్వం ల ప‌రంగా ఎదుర‌య్యే స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించ‌డం అనేవి సాధ్య‌ప‌డుతాయి.

బ‌హుళ‌ విధ అపాయాల‌ను గురించి ముందుగానే హెచ్చ‌రించే వ్య‌వ‌స్థ‌ కు సంబంధించిన, శీతోష్ణ‌స్థితి లో త‌లెత్తే మార్పుల ప‌ట్ల ప్ర‌తిఘాతుక‌త్వం సంబంధిత కార్య‌క‌లాపాల విష‌యంలో యుఎఇ కి చెందిన ఎన్‌సిఎమ్‌, భార‌త ప్ర‌భుత్వం ఎంఒఇఎస్ ల స‌హ‌కార‌ భ‌రిత భాగ‌స్వామ్యం ఆయా ప్రాంతాల‌ లో ఆర్థిక వృద్ధి కి గ‌ణ‌నీయమైన తోడ్ప‌ాటును అందించగలుగుతుంది.

భార‌త ప్ర‌భుత్వ పృధ్వీ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ను యుఎఇ ప్ర‌తినిధి వ‌ర్గం కింద‌టి ఏడాది న‌వంబ‌ర్ 8న సంద‌ర్శించినప్పుడు, యుఎఇ లో ఎన్‌సిఎమ్ మ‌రియు భార‌త‌దేశం లో సంబంధిత సంస్థ‌లు అమలుచేస్తున్న విజ్ఞాన‌శాస్త్ర ప‌ర‌మైన కార్య‌క‌లాపాలు చ‌ర్చ‌ కు వ‌చ్చాయి. ప‌రిశోధ‌న‌ అవసరమైన అనేక సమాన రంగాల‌ను ఈ సంద‌ర్భం లో గుర్తించ‌డ‌మైంది. భారతదేశం లోని కోస్తా తీర ప్రాంతాలలో, యుఎఇ లోని ఈశాన్య ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న అరేబియా సముద్రంలోను, ఓమాన్ సముద్రంలోను ఉత్పన్నమవుతున్న సునామీ ల తాలూకు వేగ‌వంత‌మైన‌టువంటి మ‌రియు అధిక విశ్వ‌స‌నీయ‌త క‌లిగినటువంటి ముందస్తు అంచ‌నాల‌ విషయంలో విజ్ఞానశాస్త్ర ప‌ర‌మైన, సాంకేతిక ప‌ర‌మైన స‌మ‌న్వ‌యాన్ని ఏర్ప‌ర‌చుకోవ‌డం ప‌ట్ల ఇరుపక్షాలు  ఆస‌క్తి ని వ్య‌క్తం చేశాయి.

 

 

***



(Release ID: 1688279) Visitor Counter : 144