రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అటల్ టన్నెల్‌పై వెబ్‌నార్‌ను ప్రారంభించిన రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్‌సింగ్; ఇటువంటి గొప్ప నిర్మాణాలను నిర్మించడానికి జాతీయ స్పూర్తి, ఆత్మగౌరవం చాలా ముఖ్యమని వెల్లడి.

Posted On: 11 JAN 2021 4:18PM by PIB Hyderabad

ఐఐటిలు, ఎన్‌ఐటిలు మరియు ఇతర సాంకేతిక సంస్థల ప్రయోజనం కోసం..ఈ సొరంగం నిర్మాణంలో ఎదురైన అనుభవాలను పంచుకునేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనవరి 11న అటల్ టన్నెల్‌పై వెబ్‌నార్‌ను నిర్వహించింది.

కోవిడ్ -19 పరిమితుల మధ్య అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించినందుకు బీఆర్‌వో ఇంజనీర్లను రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. సెరినల్లా అనే ఫాల్ట్ జోన్ యొక్క ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఇది విదేశీ ఇంజనీర్లకు కూడా తీవ్రమైన సవాలుగా మారిందన్నారు. కానీ మన ఇంజనీర్లు సెరినల్లా సవాలును అధిగమించడంలో విజయవంతమయ్యారు" అని రక్షణ మంత్రి అన్నారు. అటల్ టన్నెల్ వంటి గొప్ప నిర్మాణాన్ని నిర్మించడానికి ఇటుకలు మరియు మోర్టార్ మాత్రమే కాదు.. జాతీ గౌరవం, మరియు ప్రతిష్టకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పారు. భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల గత విజయాలను రక్షణమంత్రి గుర్తుచేసుకున్నారు. వారు తమ నైపుణ్యాన్ని,శక్తిని ఎల్లప్పుడూ చూపించారని చెప్పారు.

కొవిడ్‌-19 సవాళ్లను అధిగమించడానికి ఆత్మనిర్భర్‌ భారత్ అభియాన్ గురించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.." మన దేశీయ అవసరాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సరఫరా చేసేందుకు పిపిఇ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు మొదలైనవి ఉత్పత్తి చేయడానికి మన వనరులను త్వరగా సమీకరించగలిగాము". అని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, బీఆర్‌వో తన శ్రామికసామర్ధ్యంలో 67% ఉత్తర సరిహద్దుల్లో మోహరించిందని ఆయన అన్నారు. 2020లో కొవిడ్-19 పరిమితుల మధ్య  బీఆర్‌వో యొక్క ప్రయత్నాలను మరియు సాధించిన విజయాలను ప్రశంసించారు.బీఆర్‌వో బడ్జెట్‌లో కోత లేదని రక్షణమంత్రి స్పష్టం చేశారు.

సముద్రమట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ప్రపంచంలో అతిపెద్ద సొరంగం (9.020 కి.మీ) నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలు మరియు సవాళ్లను జాబితా చేసే కాంపెడియం పత్రాలను రక్షణ మంత్రి విడుదల చేసింది.

రోహ్తాంగ్‌లోని అటల్ టన్నెల్‌ను 2020 అక్టోబర్ 3 న ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ..ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లోని విద్యార్థులు, నిపుణుల ప్రయోజనాల కోసం ఇలాంటి సంకలనాన్ని తీసుకురావాలని సూచించారు.

ఈ వెబ్‌నార్ అధ్యాపక సభ్యులు మరియు ఔత్సాహిక విద్యార్థుల జ్ఞానాన్ని పెంచుతుంది. ముఖ్యంగా సొరంగం నిర్మాణంలో భవిష్యత్ సవాళ్లను పరిష్కరించడంలో ఫైనల్‌ టెర్మ్‌ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌నార్‌లో 1,000 మందికి పైగా పాల్గొన్నారు.

ప్రారంభ సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరావణే, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, డిజి బిఆర్ఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి కూడా హాజరయ్యారు.

***



(Release ID: 1687756) Visitor Counter : 207