మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
దేశంలో ఏవియన్ ఇన్ఫ్లూయెన్జా పరిస్థితి
Posted On:
11 JAN 2021 3:11PM by PIB Hyderabad
దేశంలో 10 రాష్ట్రాలలో ఏవియన్ ఇన్ఫ్లూయెన్జా 11 జనవరి 2021 వరకు ఉన్నట్టు ధ్రువీకృతమైంది. రాజస్థాన్‌లోని టోంక్, కరౌలీ, భిల్వారా జిల్లాలలోను, గుజరాత్‌లోని వల్సాద్, వడోదర, సూరత్ జిల్లాలలో గోవులు, వలస/ అడవి పక్షులు మరణించినట్టు ఐసిఎఆర్- నిషాద్‌లు ధృవీకరించాయి. అంతేకాకుండా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, కోట్‌ద్వార్ జిల్లాలలో గోవులు మరణించినట్టు రూఢీగా తెలిసింది. ఇక ఢిల్లీలో గోవులు, బాతులు సంజయ్ లేక్ ప్రాంతంలోనూ, న్యూఢిల్లీలోనూ మరణించినట్టు నమోదైంది.
అదనంఆచ పర్భానీ జిల్లాలో పెంపుడు కోళ్ళ ఫారంలలో ఏవియన్ ఇన్ఫ్లూయెన్జా వ్యాపించగా, మహారాష్ట్రలోని ముంబై, థానే, దాపోలీ, బీడడ్‌లలో గోవులకు ఇది సంక్రమించినట్టు ఎఐ స్పష్టం చేసింది.
ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించి, నిరోధించేందుకు హర్యానాలో వ్యాధి సోకిన పక్షులను ఏరివేస్తున్నారు. ఈ వ్యాధి కేంద్రకృతమైన ప్రాంతాలను పర్యవేక్షించేందుకు, సాంక్రమిక వ్యాధుల దర్యాప్తును హిమాచల్ ప్రదేశ్‌లోని పంచకులలో 11 జనవరి, 2021న అక్కడ పర్యటిస్తున్న బృందం నిర్వహిస్తోంది.
ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చి, తప్పుడు సమాచారం వ్యాపించకుండా నిరోధించవలసిందిగా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నీటి వనరులున్న చోట, సజీవ పక్షుల మార్కెట్లు, జూలు, పౌల్ట్రీ ఫాంలు తదితర ప్రాంతాలలో పర్యవేక్షణను పెంచవలసిందిగా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరడం జరిగింది. దానితో పాటుగా, కళేబరాలను తగినవిధంగా విసర్జించడం, పౌల్ట్రీ ఫాంలలో జీవ-పరిరక్షణను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అంతేకాక, ఏరివేత కార్యకలాపాలకు అవసరమైన పిపిఇ కిట్లను, ఉపకరణాలను తగినంత స్టాక్‌ను నిర్వహించుకోవాలని తెలిపింది. ఈ వ్యాధి స్థాయిని సన్నిహితంగా పర్యవేక్షించేందుకు, ఆ వ్యాధి మనుషులకు సోకే అవకాశాలను నిరోధించేందుకు ఆరోగ్య అధికారలతో ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తూ, సమన్వయాన్ని కలిగి ఉండవలసిందిగా రాష్ట్ర పశు సంవర్థక శాఖలను డిఎహెచ్‌డి కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1687678)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam