సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వినూత్న, పర్యావరణ అనుకూల, విషరహిత వాల్ పెయింట్‌ను రేపు విడుదల చేయనున్నగడ్కరీ

Posted On: 11 JAN 2021 11:44AM by PIB Hyderabad

ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్( కెవిఐసి )అభివృద్ధి చేసిన వినూత్నమైన కొత్త పెయింట్‌ను కేంద్ర రహదారి రవాణా మరియు .జాతీయ రహదారులు, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మంగళవారం( జనవరి 12 )తన నివాసంలో విడుదల చేయనున్నారు.ఖాదీ ప్రకృతి కృతిఅని నామకరణం చేసిన ఈ పెయింట్‌ను పర్యావరణ హిత, విష రహితంగా తొలిసారిగా రూపొందించారు. ఇది ఫంగల్ వ్యతిరేక, బాక్టీరియా వ్యాప్తి నిరోధక లక్షణాలను కలిగి వున్నతొలి ఉత్పత్తి. ఆవు పేడను ప్రధాన ముడి పదార్థంగా తయారయ్యే తక్కువ ఖర్చుతో వాసన లేకుండా ఉత్పత్తి అవుతుంది. ఈ పెయింట్ ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధ్రువీకరించింది.

ఖాదీ ప్రకృతి పెయింట్ రెండు రూపాల్లో - డిస్టెంపర్ పెయింట్ మరియు ప్లాస్టిక్ ఎమల్షన్ పెయింట్ గా లభిస్తుంది. రైతుల ఆదాయాన్ని ఎక్కువ చేయాలన్న ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఖాదీ ప్రకృతి పెయింట్ కు రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్టుకు కెవిఐసి ఛైర్మన్ 2020 మార్చి నెలలో శ్రీకారం చుట్టారు. తరువాత దీనిని కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్, జైపూర్ (కెవిఐసి యూనిట్) అభివృద్ధి చేసింది.

 

సీసం, పాదరసం, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం మరియు ఇతర భారీ లోహాలు ఈ పెయింట్ లో వుండవు. సాంకేతిక బదిలీ ద్వారా ఇది స్థానిక ఉత్పత్తి రంగానికి చేయూత ఇస్తూ స్థిరమైన స్థానిక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఈ సాంకేతికత పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు ముడి పదార్థంగా ఆవు పేడ ను ఉపయోగించడం వల్ల రైతులకు మరియు గోశాలలకు అదనపు ఆదాయం లభించేలా దోహదపడుతుంది. ఇది రైతులకు / గోశాలలకు ప్రతి ఆవుకి సంవత్సరానికి 30,000 రూపాయల (సుమారు) అదనపు ఆదాయాన్ని ఇస్తుందని అంచనా. ఆవు పేడను ఉపయోగించడం వల్ల పర్యావరణం కాలుష్యం తగ్గడంతో పాటు కాల్వలలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండవు.

 

ఖాదీ ప్రకృతి డిస్టెంపర్ మరియు ఎమల్షన్పెయింటులు 3 ప్రసిద్ధ జాతీయ ప్రయోగశాలలలో పరీక్షించబడ్డాయి

*నేషనల్ టెస్ట్ హౌస్, ముంబై

 

*శ్రీ రామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, న్యూ ఢిల్లీ

  • నేషనల్ టెస్ట్ హౌస్, ఘజియాబాద్

ఖాదీ ప్రకృతి ఎమల్షన్ పెయింట్ BIS 15489: 2013 ప్రమాణాలకు ,ఖాదీ ప్రకృతి డిస్టెంపర్ పెయింట్ BIS 428: 2013 ప్రమాణాలకు లోబడి ఉత్పత్తి అవుతాయి.


(Release ID: 1687650) Visitor Counter : 269