ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో కొత్త కేసుల్లో భారీ తగ్గుదల; గత 24 గంటల్లో 16,311 కొత్త కేసులు

229 రోజుల తరువాత మరణాలు 170 లోపు

Posted On: 11 JAN 2021 11:02AM by PIB Hyderabad

భారతదేశంలో రోజువారీ కొత్త కొవిడ్ కేసులు తగ్గుదల బాటలో సాగుతున్నాయి. గడిచిన 24 గంటలలో 16,311 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశంలో రోజువారీ మరణాలు కూడా భారీగానే తగ్గుతూ వస్తున్నాయి. 229 రోజుల తరువాత మొదటి సారిగా 170 లోపు మరణాలు నమోదయ్యాయు. కొత్త కేసులు తగ్గుతూ రావటం, కోలుకుంటున్నవారి శాతం పెరుగుతూ రావటం వలన దేశంలో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుతోంది.

భారత్ లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 2.25 లక్షల లోపుకు తగ్గి  2,22,526కు చేరింది.  ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో కేవలం 2.13% మాత్రమే. గత 24 గంటలలో  16,959 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనివలన చికిత్సపొందుతున్నవారిలో నికర తగ్గుదల  809 కనబడింది.

 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 10,092,909 గా నమోదైంది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ వస్తోంది. ఇది 99 లక్షలకు చేరువవుతూ 98,70,383 కు చేరింది కోలుకున్నవారి శాతం ఈ రోజుకు 96.43% అయింది.  ఇది ప్రపంచంలోనే అత్యధికం కావటం విశేషం. కొత్తగా కోలుకున్నవారిలో  78.56% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే.  కేరళలో అత్యధికంగా 4,659 మంది కోలుకోగా, ఆ తరువాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2,302  మంది, చత్తీస్ గడ్ లో 962  మంది కోలుకున్నారు.

కొత్తగా కోవిడ్ గా నిర్థారణ అయిన కేసులలో 80.25% కేవలం 9 రాష్ట్రాలకు చెందినవి కాగా అందులో కేరళలో 4,545 కేసులు, ఆ తరువాత మహారాష్ట్రలో 3,558 కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటలలో 161 మంది కోవిడ్ బాధితులు మరణించగా, అందులో 69.57% మరణాలు కేవలం ఆరు రాష్టాలలోనే నమోదయ్యాయి. మహారాష్టలో అత్యధికంగా 34 మరణాలు నమోదు కాగా కేరళలో 23 మంది, పశ్చిమ బెంగాల్ లో 19 మంది చనిపోయారు.  

 

 

****



(Release ID: 1687614) Visitor Counter : 112