వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతీయ పరిశ్రమల్లో నాణ్యత , ఉత్పాదకతను ప్రోత్సహించడానికి “ఉద్యోగ్ మంథన్” పేరుతో వెబ్నార్ల సిరీస్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.

Posted On: 05 JAN 2021 10:26AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖ.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్, , ఇండస్ట్రీ బాడీల సహకారంతో భారతీయ పరిశ్రమల్లో నాణ్యత , ఉత్పాదకతను ప్రోత్సహించడానికి మంథన్ పేరుతో మారథాన్లు నిర్వహిస్తున్నది. ప్రతి సెక్టార్ కోసం ఒక ఉద్యోగ్ మంథన్ను ఏర్పాటు చేస్తుంది. ఇవి 2021 జనవరి 4 నుండి మార్చి 2, 2021 వరకు జరుగుతాయి. భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి  పియూష్ గోయల్ 2021 జనవరి 6 న జరిగే మంథన్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 45 సెషన్లతో కూడిన వెబ్‌నార్ సిరీస్... తయారీ , సేవల్లో వివిధ ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి వెబ్‌నార్లో రెండు గంటలపాటు ఒక నిర్దిష్ట రంగంలోని రంగాల , పరిశ్రమ నిపుణుల చర్చల కార్యక్రమాలు ఉంటాయి. పరిశ్రమ, పరీక్ష లు, ప్రామాణీకరణ సంస్థల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు. సెషన్లపై ఆసక్తి ఉన్న వారందరి కోసం చర్చలు యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

ఉద్యోగ్ మంథన్ సవాళ్లను, అవకాశాలను గుర్తిస్తుంది; పరిష్కారాలు , ఉత్తమ పద్ధతులపై దృష్టి పెడుతుంది. పరిశ్రమలు , రంగాలు... నాణ్యతను , ఉత్పాదకతను పెంచడానికి ' స్థానికంగా తయారీని' ప్రోత్సహించడానికి , 'ఆత్మీనిర్భర్ భారత్' దృష్టిని సాకారం చేయడానికి అవసరమైన విషయాలను నేర్చుకుంటాయి. కంపెనీలు నాణ్యత , ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని,  ఈ అంశాలపై చర్చ కోసం సెషన్లను ఏర్పాటు చేయాలని మంత్రి పీయుష్ గోయల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తద్వారా దేశానికి అధిక నాణ్యత, సమర్థవంతమైన తయారీదారుగా, వ్యాణిజ్యరాజ్యంగా , సర్వీసు ప్రొవైడర్గా గుర్తింపు లభిస్తుందని వివరించారు

***


(Release ID: 1686709) Visitor Counter : 222