ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 1 వ తేదీన జిహెచ్‌టిసి- ఇండియా ప్రాజెక్టుల క్రింద లైట్‌హౌస్ ప్రాజెక్టులకు శంకు స్థాపన చేయనున్న ప్రధానమంత్రి.
పిఎంఎవై( అర్బన్ ) ఎ.ఎస్.హెచ్.ఎ- ఇండియా అవార్డులను ప్రధానం చేయనున్న ప్రధానమంత్రి
Posted On:
30 DEC 2020 7:42PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ,2021 జనవరి 1 వ తేదీ ఉదయం 11 గంటలకు గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా ( జిహెచ్‌టిసి- ఇండియా) కింద దేశ వ్యాప్తంగా ఆరు నగరాలలో లైట్‌హౌస్ ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి చౌక, సుస్థిర గృహ నిర్మాణ కార్యక్రమాలైన అఫార్డబుల్ సస్టయినబుల్ హౌసింగ్ యాక్సిలరేటర్స్ - ఇండియా (ఎ.ఎస్.హెచ్.ఎ- ఇండియా) కింద విజేతలను ప్రకటించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ( పిఎంఎవై- యు) మిషన్ కింద వార్షిక అవార్డులను ప్రధానమంత్రి ప్రకటించనున్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి, వినూత్న నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి నవరితి హ్( న్యూ అఫార్డబుల్ వాలిడేటె డ్ రిసెర్చ్ ఇన్నొవేషన్ టెక్నాలజీస్ ఫర్ ఇండియన్ హౌసింగ్ ) సర్టిఫికేట్‌కోర్సును ప్రారంభించనున్నారు. అలాగే వినూత్న గృహ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి జి.హెచ్.టి.సి ఇండియా గుర్తించిన 54 వినూత్న గృహ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాలను విడుదల చేయనున్నారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి , త్రిపుర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
లైట్ హౌస్ ప్రాజెక్టులు.....
లైట్‌హౌస్‌ప్రాజెక్టులు (ఎల్.హెచ్.పిలు) నిర్మాణ రంగంలో కొత్త తరం ప్రత్యామ్నాయ గ్లోబల్ టెక్నాలజీలు మెటీరియల్స్‌లో అత్యుత్తమమైన వాటిని దేశంలో మొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నాయి. వీటిని జిహెచ్‌టిసి - ఇండియా కింద నిర్మించనున్నారు. ఇది గృహనిర్మాణ రంగంలో సమగ్ర రూపంలో వినూత్న సాంకేతికపరిజ్ఞానం అమలుకు వీలు కల్పిస్తుంది.ఎల్.హెచ్‌పిలు ఇండోర్ (మధ్యప్రదేశ్), రాజ్‌కోట్( గుజరాత్) చెన్నై (తమిళనాడు),రాంచి (జార్ఖండ్), అగర్తల (త్రిపుర), లక్నో ( ఉత్తరప్రదేశ్) లలో నిర్మించనున్నారు. ఇందులో ఒక్కో ప్రాంతలో వెయ్యి గృహాలు నిర్మిస్తారు. ఆయా ప్రాంతాలలో అనుబంధ మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తారు. ఈ గృహాలను శరవేగంతో 12 నెలల్లో నిర్మిస్తారు. వీటిని మామూలు సంప్రదాయక నిర్మాణాలైన ఇటుక, సిమెంట్‌తో నిర్మించినపుడు పట్టే సమయం కంటే తక్కువ సమయానికి నిర్మిస్తారు. ఇవి మరింత చవకగా , సుస్థిరంగా, అత్యున్నత నాణ్యతతో మన్నికగా ఉండనున్నాయి.
ఈ ఎల్‌హెచ్‌పిలు పలు టెక్నాలజీలను ప్రదర్శించనున్నాయి.ఇండోర్ లో ప్రీ ఫాబ్రికేటెడ్ శాండ్‌విచ్ ప్యానల్ సిస్టమ్ . రాజ్‌కోట్‌లో టన్నెల్ ఫామ్ వర్క్ ఎల్‌హెచ్‌పిలో మోనోలితిక్ కాంక్రీట్ , చెన్నైలో ప్రీకాస్ట్‌కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ సిస్టమ్, రాంచి ఎల్ హెచ్ పిలో 3 డి వాల్యుమెట్రిక్ ప్రీ కాస్ట్ కాంక్రీట్ నిర్మాణం ఉన్నాయి. అలాగే, స్ట్రక్చరల్ స్టీల్ ఫ్రేమ్ లైట్‌గేజ్ స్టీల్ ఇన్ ఫిల్ పానళ్లు అగర్తలలో,పివిసి స్టే ఇన్ ప్లేస్ ఫామ్‌వర్క్ సిస్టమ్‌లక్నో వద్ద ఉపయోగించనున్నారు. ఎల్‌హెచ్‌పి లు ఈ రంగానికి సాంకేతిక పరిజ్ఞాన బదలీ లేబరెటరీలుగా పనిచేయనున్నాయి. ఇందులో ప్లానింగ్, డిజైన్,పరికరాల ఉత్పత్తి, నిర్మాణ పద్ధతులు, ఫాకల్టీకి, ఐఐటి,ఎన్.ఐటి, ఇతర ఇంజినీరింగ్ కాలేజిలు, ప్లానింగ్ ఆర్కిటెక్చరల్ కాలేజీలు,బిల్డర్లు, ప్రభుత్వ,ప్రైవేటు రంగాల ప్రొఫెషనల్స్‌కు, ఇతర స్టేక్‌హోల్డర్లకు టెస్టింగ్ లేబరెటరీలు గాపనికి వస్తాయి.
ఎ ఎస్ హెచ్ ఎ- ఇండియా
అఫార్డబుల్ సస్టెయినబుల్ హౌసింగ్ యాక్సిలరేటర్స్ - ఇండియా ( ఎ.ఎస్.హెచ్.ఎ- ఇండియా) దేశీయంగా పరిశోధన, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ను ప్రమోట్ చేసేందుకు.ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్ మద్దతును భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానానికి నిర్దేశించినది. ఎఎస్‌హెచ్ఎ - ఇండియా చొరవ కింద ఐదు ఆషా ఇండదియా సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. యాక్సిలరేషన్ మద్దతు కింద టెక్నాలజీ విజేతలను ప్రధానమంత్రి ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం కింద గుర్తించిన టెక్నాలజీలు, ప్రాసెస్‌లు, మెటీరియళ్లు యువ సృజనాత్మక మెదళ్లకు. స్టార్టప్‌లకు ,ఆవిష్కర్తలు, ఎంటర్‌ప్రెన్యుయర్ల మెదళ్లకు మంచి పదునుపెట్టనున్నాయి.
పిఎంఎవై-యు మిషన్
ప్రధానమంత్రి ఆవాస్‌యోజన- అర్బన్ (పిఎంఎవై-యు) మిషన్ ను 2022 నాటికి అందరికీ గృహనిర్మాణ లక్ష్యంతో రూపొందించారు. రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థలు, లబ్ధిదారుల అద్భుత పాత్రను గుర్తించేందుకు హౌసింగ్, అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పి.ఎంఎవై అర్బన్ అమలులో ప్రతిభ కనబరచిన వారికి కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక అవార్డులను ప్రవేశ పెట్టింది. ఈ ఈవెంట్ సందర్భంగా పిఎంఎవై (అర్బన్) 2019 అవార్డు విజేతలను సత్కరించనున్నారు.
***
(Release ID: 1684957)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam