ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

పారాదీప్ నౌకాశ్ర‌యం లో కేప్‌ ఆకార నౌక‌ ల రాక‌ పోక‌ ల కోసం పబ్లిక్, ప్రైవేటు భాగ‌స్వామ్యం (పిపిపి) ప‌ద్ధ‌తి లో నిర్మాణం, నిర్వ‌హ‌ణ, బ‌దిలీ (బిఒటి) ప్రాతిప‌దిక‌ న వెస్ట‌ర్న్ డాక్ అభివృద్ధి స‌హా, ఇనర్ హార్బ‌ర్ తో ముడిపడ్డ స‌దుపాయాల‌ను ప‌టిష్టం చేయ‌డానికి, ఉన్న‌తీక‌రించ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 30 DEC 2020 3:51PM by PIB Hyderabad

‘పారాదీప్ నౌకాశ్ర‌యం లో కేప్‌ ఆకారం కలిగిన నౌక‌ ల రాక‌ పోక‌ ల కోసం పబ్లిక్-ప్రైవేటు భాగ‌స్వామ్యం (పిపిపి) ప‌ద్ధ‌తి లో ‘నిర్మాణం, నిర్వ‌హ‌ణ, బ‌దిలీ’ (బిఒటి) ప్రాతిప‌దిక‌ న వెస్ట‌ర్న్ డాక్ అభివృద్ధి స‌హా, ఇనర్ హార్బ‌ర్ తో ముడిపడ్డ స‌దుపాయాల‌ను ప‌టిష్టం చేయ‌డానికి,  ఉన్న‌తీక‌రించే ప్రాజెక్టు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం ఆమోదం తెలిపింది.
 
ఆర్థిక ప్ర‌భావం:

ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం 3,004.63 కోట్ల రూపాయ‌లుగా ఉంది.  దీనిలో రాయితీ ని పొందే ఎంపిక చేసిన కంపెనీల ద్వారా వరుస గా 2,040 కోట్ల రూపాయలు మరియు 352.13 కోట్ల రూపాయల ఖర్చు తో కొత్త‌ వెస్ట‌ర్న్ డాక్ ను  అభివృద్ధిప‌ర‌చ‌డం, కేపిటల్ డ్రెడ్జింగ్‌ పనులు  భాగంగా ఉన్నాయి.  ఇక కామ‌న్ స‌పోర్టింగ్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌రు ను అందుబాటు లోకి తీసుకు వచ్చే దిశ లో 612.50 కోట్ల రూపాయల పెట్టుబ‌డి ని పారాదీప్ పోర్టు పెడుతుంది.

విస్తృత వివరాలు:

ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు లో బిఒటి ఆధారితంగా రాయితీ పొందే ఎంపిక చేసిన కంపెనీల ద్వారా కేప్ ఆకార నౌకల రాకపోకల సదుపాయం కోసం 25 ఎమ్‌టిపిఎ  (మిలియన్ టన్ పర్ ఏనమ్) తుది సామర్థ్యాన్ని కలిగివుండే వెస్ట‌ర్న్ డాక్ బేసిన్ ను రెండు దశల లో నిర్మించాలన్నది ప్రణాళిక గా ఉంది.  ప్రతి ఒక్క దశ ను 12.50 ఎమ్‌టిపిఎ సామర్థ్యం తో ఉండేట‌ట్లుగా నిర్మించడం జరుగుతుంది.

రాయితీ అవధి రాయితీ ని ఇచ్చిన తేదీ నాటి నుంచి 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది.  కేప్ ఆకార నౌక‌ల రాక‌పోక‌ల‌ను సుగమం చేయడం కోసం బ్రేక్ వాట‌ర్ ఎక్స్‌టెన్శన్, త‌దితర సహాయక సౌకర్యాలు సహా ఈ ప్రాజెక్టు కు సంబంధించిన కామన్ స‌పోర్టింగ్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌రు ను అందించే పనిని రాయితీని ఇచ్చే ప్రాధికరణ సంస్థ అయినటువంటి పారాదీప్ పోర్ట్ ట్ర‌స్టు తానే స‌మ‌కూర్చుతుంది.

అమ‌లు వ్యూహం - ల‌క్ష్యాలు:

ఈ ప్రాజెక్టు ను రాయితీని పొందే ఎంపిక చేసిన కంపెనీల ద్వారా బిఒటి ప్రాతిప‌దిక‌ న అభివృద్ధి చేయడం జరుగుతుంది.  పోర్టు ఈ ప్రాజెక్టు కోసం  కామ‌న్ స‌పోర్టింగ్ ప్రాజెక్టు ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌రు ను  స‌మ‌కూర్చుతుంది.

ప్ర‌భావం:

ప్రారంభం అయిన తరువాత, ఈ ప్రాజెక్టు బొగ్గు, సున్నపురాయి దిగుమతులకు అదనంగా పారాదీప్  నౌకాశ్ర‌యం చుట్టుపక్కల ప్రాంతాల‌లో పెద్ద సంఖ్య‌ లో నెలకొన్న ఉక్కు త‌యారీ ప్లాంటులకు అవ‌స‌ర‌మ‌య్యే గ్రాన్యులేటెడ్ శ్లాగ్, ఉక్కు తో తయారైన ఉత్పత్తుల ఎగుమతి సంబంధిత అవసరాలను పూర్తి చేస్తుంది. ఈ ప్రాజెక్టు (i) నౌకాశ్ర‌యం లో ర‌ద్దీ ని కుదించివేయ‌డంలో కూడా స‌హ‌క‌రిస్తుంది,  (ii) సముద్ర మార్గ సరుకు రవాణా ను తగ్గించి బొగ్గు దిగుమ‌తుల‌ను చౌక‌ గా మార్చివేస్తుంది,  (iii)  నౌకాశ్ర‌యం ప‌రిస‌ర ప్రాంతాల‌లో పారిశ్రామిక ప్ర‌ధాన‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు ద‌న్నుగా నిల‌చి, ఉద్యోగ అవ‌కాశాల క‌ల్ప‌న‌ కు దోహదపడుతుంది.

పూర్వరంగం:

పారాదీప్ పోర్ట్ ట్ర‌స్ట్ (పిపిటి) భారత ప్రభుత్వ ఆధీనంలోని ఒక ప్రముఖ నౌకాశ్రయం గా ఉంది. దీనిని మేజ‌ర్ పోర్ట్ ట్ర‌స్ట్ యాక్ట్‌, 1963 ప్ర‌కారం నిర్వహించడం జరుగుతోంది. దీనిని 1966వ సంవత్సరంలో ఇనుప ఖ‌నిజం ఎగుమ‌తి కి గాను ఉద్దేశించిన ఒకే స‌ర‌కు నౌకాశ్ర‌యం (మోనో కమోడిటీ పోర్ట్) గా ప్రారంభించడం జరిగింది.  గ‌త 54 సంవ‌త్స‌రాల‌లో, ఈ నౌకాశ్ర‌యం తనను తాను రూపాంతరం చెందుతూ విభిన్న రకాల దిగుమతి, ఎగుమతుల సామానులు (ఎగ్జిమ్ కార్గో)ను సంబాళించడానికి అనువైందిగా ఎదిగింది.  ఆ సామానులలో ఇనుప ఖ‌నిజం, క్రోమ్ ఖనిజం, అల్యూమినియం క‌డ్డీలు, బొగ్గు, పిఒఎల్, ఎరువుల ముడి ప‌దార్థాలు, సున్న‌పురాయి, క్లింకర్, ఫినిష్డ్ స్టీల్ ఉత్ప‌త్తులు, కంటైన‌ర్ లు, వ‌గైరా ఉన్నాయి.  

మ‌రీ ముఖ్యంగా, ఈ నౌకాశ్రయం చుట్టుపక్కల స్టీల్ ప్లాంటులు ఏర్పాటైన కారణంగా కోకింగ్ కోల్ దిగుమ‌తి తో పాటు, ఫినిష్డ్ స్టీల్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తి తాలూకు డిమాండు పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ ఓడరేవు ప్రాంతం చుట్టుపక్కల అవసరాలను తీర్చడం కోసం దీని సామర్థ్యాన్ని ఉన్నతీకరించవలసి వచ్చింది.



 

***
 



(Release ID: 1684895) Visitor Counter : 157