రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

వాహనంలో డ్రైవర్‌ పక్క సీటుకు కూడా ఎయిర్‌బ్యాగు తప్పనిసరి చేసే ప్రతిపాదిత నిబంధనపై సూచనలు, సలహాలకు ఆహ్వానం

Posted On: 29 DEC 2020 2:29PM by PIB Hyderabad

ప్రయాణీకుల భద్రతను మరింత పెంచే చర్యల్లో భాగంగా, వాహనం ముందు భాగంలో డ్రైవర్‌ పక్కనున్న సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర రహదారి రవాణా&హైవేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కొత్తగా తయారయ్యే వాహనాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి, ఇప్పటికే ఉన్న వాహనాల్లో అదే ఏడాది జూన్‌ 1 నుంచి దీని అమలుకు యోచిస్తోంది. ఈ మేరకు, జీఎస్‌ఆర్‌ 797(ఇ) ముసాయిదా ప్రకటనను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది.

    ఈ ప్రతిపాదనపై సూచనలు, సలహాలను మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. comments-morth[at]gov[dot]in కు, ముసాయిదా ప్రకటన నుంచి 30 రోజుల్లోగా సూచనలు, సలహాలను పంపవచ్చు.

***(Release ID: 1684522) Visitor Counter : 59