ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి లో భాగంగా అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి కిస్తీ ని విడుదల చేసిన ప్రధాన మంత్రి


పశ్చిమ బంగాల్ రైతులు ఈ ప్రయోజనాన్ని అందుకోలేకపోయినందుకు ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు

9 కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి ని పొందుతాయి;  డిబిటి ద్వారా 18000 కోట్ల రూపాయలనుజమ చేయడం జరిగింది

రైతులకు ఉత్పాదక వ్యయాన్ని తగ్గించి, వారు ఒక న్యాయమైన ధర ను పొందేటట్టుగా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది : ప్రధాన మంత్రి

ప్రపంచ వ్యావసాయక విపణుల లో ‘బ్రాండ్ ఇండియా’ ను స్థాపించే కాలం వచ్చేసింది : ప్రధాన మంత్రి

Posted On: 25 DEC 2020 2:14PM by PIB Hyderabad

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి లో భాగంగా అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి కిస్తీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న ఒక బటన్ ను నొక్కినంతనే 18000 కోట్ల రూపాయలను దేశం లో 9 కోట్ల కు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల లోకి  జమ చేయడం జరిగిందని తెలిపారు.  ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి, 1 లక్ష 10 వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్ము రైతుల ఖాతాలలోకి చేరుకొందని ఆయన వివరించారు.

పశ్చిమ బంగాల్ లో 70 లక్షల కు పైగా రైతు లు ఈ ప్రయోజనాన్ని అందుకోలేకపోయినందుకు ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు.  బంగాల్ కు చెందిన 23 లక్షల కు పైగా రైతు లు ఈ పథకం తాలూకు ప్రయోజనం అందుకోవడానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పెట్టుకొన్నారని ఆయన తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరణ ప్రక్రియ ను ఎంతో కాలం గా ఆపివేసిందన్నారు.  పశ్చిమ బంగాల్ లో రైతుల హితాన్ని గురించి నోరెత్తని పార్టీ లు, దిల్లీ కి వచ్చి రైతుల ను గురించి మాట్లాడుతున్నాయి అని ఆయన అన్నారు.  ఈ పార్టీ లు ఇప్పుడు ఎపిఎమ్ సి- మండీల ను గురించి పట్టించుకోవడం లేదు, కానీ ఈ పార్టీలు మాత్రం కేరళ లో ఎపిఎమ్ సి- మండీలు ఏవీ లేవు అనే సంగతి ని పదే పదే మరచిపోతున్నాయి, మరి వీరు కేరళ లో ఎన్నడూ ఆందోళన చేయరు అని ఆయన అన్నారు.

రైతుల ఉత్పాదక వ్యయం (ఇన్ పుట్ కాస్ట్) ను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం కృషి చేసింని ప్రధాన మంత్రి అన్నారు.  ‘భూ మి స్వస్థత కార్డు’, ‘యూరియా కు వేప పూత ఏర్పాటు’, ‘సోలర్ పంపు ల పంపిణీ పథకం’ ల వంటి ప్రభుత్వం చేపట్టిన రైతు ప్రధానమైన కార్యక్రమాలను గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమాలు రైతుల ఇన్ పుట్ కాస్ట్ ను తగ్గించడం లో సహాయకారి గా నిలచాయి అని తెలియజేశారు.  రైతులకు ఒక ఉత్తమమైన పంట బీమా రక్షణ దక్కేటట్టు చూడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అని కూడా ఆయన అన్నారు.  ప్రస్తుతం, కోట్లాది రైతులు పిఎమ్ పంట బీమా పథకం తాలూకు ప్రయోజనాన్ని అందుకొంటున్నారు అని ఆయన చెప్పారు.

రైతులు వారి పంట కు ఒక న్యాయమైన ధర ను పొందేటట్టు చూడాలని ప్రభుత్వం ప్రయత్నించింది అని ప్రధాన మంత్రి అన్నారు.  చాలా కాలం నుంచి ఉన్న స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫారసు ల ప్రకారం, రైతు ల కోసం ఉత్పత్తి వ్యయాని కి ఒకటిన్నర రెట్ల ఖర్చు ను ఎమ్ఎస్ పి గా ప్రభుత్వం ఖరారు చేసింది అని ఆయన చెప్పారు.  ఎమ్ఎస్ పి అందుబాటులో ఉన్న పంటల సంఖ్య ను పెంచడమైందని కూడా ఆయన తెలిపారు.

రైతులు వారి పంటలను అమ్మడానికి కొత్త బజారులను తెరవాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రభుత్వం దేశంలోఒక వేయి కి పైగా వ్యావసాయక మండీల ను ఆన్ లైన్ మాధ్యమం ద్వారా జోడించింది అని ఆయన అన్నారు.  వీటిలో, 1 లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందన్నారు.  చిన్న రైతుల సమూహాలను ఏర్పాటు చేసే దిశ లో ప్రభుత్వం కృషి చేసిందని, తద్ద్వారా వారు వారి ప్రాంతంలో ఒక సామూహిక శక్తి గా పనిచేయడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.  ప్రస్తుతం, దేశం లో 10,000 కు పైగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్ (ఎఫ్ పిఒ ) లను ఏర్పాటు  చేసేందుకు ఒక ప్రచార ఉద్యమం నడుస్తోంది, వాటికి ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతోంది అని ఆయన వివరించారు.

ప్రస్తుతం, రైతు లు ఒక పక్కా ఇంటిని, టాయిలెట్ ను, శుద్ధమైన తాగునీటి ని గొట్టం ద్వారా అందుకొంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  వారు ఉచిత విద్యుత్తు కనెక్షన్ ద్వారా, ఉచిత గ్యాస్ కనెక్షన్ ద్వారా పెద్ద ప్రయోజనాన్ని పొందారన్నారు.  ‘ఆయుష్మాన్ భారత్ పథకం’ లో భాగంగా 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందడమనేది రైతుల జీవితాల లో ఒక పెద్ద ఆందోళన ను తగ్గించివేసింది అని ఆయన అన్నారు.

ఈ వ్యావసాయక సంస్కరణ ల ద్వారా రైతుల కోసం ఉత్తమమైన ఐచ్ఛికాల ను అందజేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ చట్టాలు వచ్చిన తరువాత రైతు లు వారి పండించిన ఉత్పత్తి ని వారు కోరుకొన్న ఎవరికి అయినా అమ్ముకోవచ్చని ఆయన అన్నారు.  నూతన వచ్చిన తరువాత, రైతు లు వారి ఉత్పత్తి ని ఎమ్ఎస్ పి కి గాని, లేదా మార్కెట్ లో విక్రయించడం గాని, లేదా ఎగుమతి చేయడం గాని, లేదా వ్యాపారికి అమ్ముకోవడం గాని, లేదా మరో రాష్ట్రం లో విక్రయించడం గాని, లేదా ఎఫ్ పిఒ ద్వారా అమ్మడం గాని చేయవచ్చని, లేదంటే బిస్కట్ లు, చిప్స్, జామ్, ఇతర వినియోగదారు ఉత్పత్తుల వేల్యూ చైన్ లో భాగం కావచ్చని ఆయన వివరించారు.

ఇతర రంగాలలో పెట్టుబడి, నూతన ఆవిష్కరణ మెరుగై, ఆదాయం వృద్ధి చెంది, ఆ రంగం లో ‘బ్రాండ్ ఇండియా’ నంటూ స్థాపించడం జరిగందని ప్రధాన మంత్రి అన్నారు.  ఇక ‘బ్రాండ్ ఇండియా’, సమానమైనటువంటి కీర్తి- ప్రతిష్ఠల తో ప్రపంచం లోని వ్యావసాయక విపణుల లో తన ను తాను నిరూపించుకోవలసిన తరుణం ఇదే అని ఆయన అన్నారు.
 
వ్యవసాయ సంస్కరణలను స్వాగతించి, వాటికి సంపూర్ణ సమర్థన ను అందించిన దేశవ్యాప్త రైతులందరికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు పలికి, వారిని తాను ముంచబోనని హామీ ఇచ్చారు.  ప్రధానం గా గ్రామీణ ప్రాంతాల కు చెందిన ప్రజలు, అసమ్, రాజస్థాన్, జమ్ము- కశ్మీర్ లలో ఇటీవల జరిగిన ఎన్నికలలో పాలుపంచుకొని, ఒక రకం గా, రైతుల ను తప్పుదోవ పట్టించిన పార్టీలన్నిటిని తిరస్కరించారు అని ఆయన అన్నారు.



 

***



(Release ID: 1683603) Visitor Counter : 253