హోం మంత్రిత్వ శాఖ
స్వర్గీయ వాజపేయికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన హోంశాఖ మంత్రి అమిత్ షా
"అటల్ జి యొక్క ఆలోచనలు మరియు దేశ పురోగతిపై ఆయనకున్న అంకితభావం ఎల్లప్పుడూ దేశానికి సేవ చేయడానికి మాకు బలాన్ని ఇస్తాయి"
"అభివృద్ధి యుగం, పేదల సంక్షేమం మరియు భారతదేశంలో సుపరిపాలన మరియు దేశానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి వాజపేయి"
" పనిలో అంకితభావం దేశ సేవ అటల్ జి యొక్క నిబద్ధత ఎల్లప్పుడూ మాకు ప్రేరణగా ఉంటుంది".... అమిత్ షా
Posted On:
25 DEC 2020 12:24PM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలో వాజపేయి స్మారక స్థలి వద్ద ఈరోజు అమిత్ షా పాల్గొని నివాళులు అర్పించారు. " జన్మదినం సందర్భంగా దార్శనికుడు వాజపేయి ని స్మరించి ఆయనకు పుష్పాంజలి సమర్పించాను. అటల్ జి ఆలోచనలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి మాకు దేశం కోసం అంకితభావంతో పనిచేదానికి స్ఫూర్తిని ఇస్తాయి" అని షా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
" దేశంలో అభివృద్ధి శకం, సుపరిపాలన వాజపేయి తో ప్రారంభం అయ్యాయి. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వాజపేయి దేశానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ అటల్ స్ఫూర్తిగా దేశాభివృద్ధికి పనిచేస్తాము' అని షా పేర్కొన్నారు.
***
(Release ID: 1683602)
Visitor Counter : 164
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam