రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎయిరో ఇండియా-21 ప్రణాళికలను సమీక్షించిన రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌

ఎయిర్‌ షోకు ఎ అండ్ డి బిజినెస్ వరల్డ్‌కు ఆహ్వానం

Posted On: 23 DEC 2020 2:53PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ రోజు ఏరో ఇండియా -21 ప్రణాళికను సమీక్షించారు. ప్రస్తుత అంతర్జాతీయ ఎగ్జిబిషన్ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం  ఉందని,  బిజినెస్ ఫోకస్ ఎగ్జిబిషన్‌గా ప్రణాళిక చేయబడిందని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ విభాగం తెలిపింది. సాధారణంగా ఎయిర్ డిస్ప్లే యొక్క విజువల్స్‌తో  జనం ఆకర్షితులవుతారు. అయితే  ఈ సంవత్సరంలో వర్చువల్ విధానంలో జరిగే ప్రపంచ  ఎ అండ్ డి వ్యాపారాల మధ్య సురక్షితమైన విధానంలో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేలా చేయనుంది.

500కు పైగా రిజిస్టర్డ్ ఎగ్జిబిటర్లు  స్టాల్ నిర్వహణకు భారీ ఆసక్తి కనబరిచారు. కొవిడ్-19 వల్ల ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రి ఈ కార్యక్రమాన్ని కేవలం వ్యాపార దినాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఫిబ్రవరి 03,2021 నుంచి ఫిబ్రవరి 05,2021 వరకూ మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. లాక్‌డౌన్ పరిమితులు, ప్రయాణ ఆంక్షల కారణంగా ఈ ఏడాది 2020 ఏరోస్పేస్ మరియు రక్షణ పరిశ్రమకు చెందిన లావాదేవీలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయి.

తమ అధిపతులు మరియు సీనియర్  నిర్ణయాధికారుల రాకను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 2020 అక్టోబర్ ప్రారంభంలో న్యూ  ఢిల్లీలోని విదేశీ మిషన్ల సీనియర్ ప్రతినిధులకు ఏరో ఇండియా -21 గురించి ముందుగానే వివరించబడింది. అనంతరం అధికారిక ఆహ్వానాలు అందించబడ్డాయి. ఏరో ఇండియా -21 భారతదేశపు ఏరోస్పేస్ మరియు రక్షణ ఉత్పాదక సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని వాగ్దానం చేసింది. అలాగే రక్షణలో వరుస విధాన కార్యక్రమాల కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని వాగ్దానం చేసింది. ఆటోమేటిక్ విధానంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను  74 శాతానికి పెంచడం, డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ -2020, సవరించిన ఆఫ్‌సెట్ మార్గదర్శకాలు సహ అభివృద్ధి మరియు సహ ఉత్పత్తి కోసం భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, మహమ్మారి కాలంలో రక్షణ ఉత్పత్తి మరియు ఎగుమతి ప్రమోషన్ పాలసీ 2020 (డిపిఈపిపి 2020) ను రూపొందించారు.

ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీరంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో  ఒకటిగా ఉంచాలన్న సంకల్పాన్ని ఈ సందర్భంగా రక్షణమంత్రి పునరుద్ఘాటించారు. అలాగే నాయకులలో నాయకుడిగా ఉండాలనే భారత సంకల్పానికి  ఏరో ఇండియా -21 ప్రతీక అని వివరించారు. శ్రీ రాజ్ నాథ్ సింగ్ వివరిస్తూ "ఆత్మనిర్భర్‌ భారత్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారని మరియు భారతదేశం యొక్క ఏరోస్పేస్ మరియు రక్షణ రంగం అభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. భారతదేశంలో భారతదేశం కోసం తయారు చేసిన రక్షణ పరికరాల కోసం భారతదేశంలో పరిశ్రమలను స్థాపించడానికి స్నేహపూర్వక దేశాలతో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని నిరంతరం అన్వేషిస్తోంది." అని వివరించారు.

ఈ ప్రదర్శనకు సంబంధించిన కార్యక్రమాలను  సమన్వయం చేసుకోవడంతో పాటు వ్యూహాత్మక మరియు వ్యాపార కోణాల్లో ఏరో ఇండియా -21 లో పాల్గొనడానికి ఇతర దేశాల నాయకులను మరియు పరిశ్రమల సారధులను ఆకట్టుకోవాలని ముఖ్య అధికారులను రక్షణ మంత్రి కోరారు. భారతదేశంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కోవిడ్ అనంతర ప్రపంచంలో ఏరో ఇండియా -21 నాయకత్వం వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని మన బలాన్ని మరింత పెంచుతుందని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

***


(Release ID: 1683191) Visitor Counter : 221