ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

2.89 లక్షలకు తగ్గిన కోవిడ్ కేసులు, మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నది 3% లోపే

26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్సలో ఉన్నది 10 వేలలోపే

ప్రతి పదిలక్షల్లో పరీక్షలు 23 రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే అధికం

16 రాష్ట్రాల్లో వారం వారం పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే తక్కువ

Posted On: 23 DEC 2020 10:45AM by PIB Hyderabad

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుదల బాటలోనే కొనసాగిగుతోంది. ప్రస్తుతం దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య నేడు 2,89,240 కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసులలో ఇంకా చికిత్సలో ఉన్నవారి వాటా మరింత తగ్గి 2.86% కి తగ్గింది. జాతీయ స్థాయిలో కనబడుతున్న ధోరణికి అనుగుణంగా 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్నవారు 10 వేల లోపే ఉన్నారు.   

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015GF1.jpg

రోజూ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో నికరంగా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.  గత 24 గంటలలో 23,950 మందికి పాజిటివ్ అని నిర్థారణ జరగగా, దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య గత 24 గంటలలో  26,895గా నమోదైంది.  మొత్తంగా గత 24 గంటల్లో నికరంగా 3,278 కేసులు బైటపడినట్టయింది

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FVAU.jpg

దేశంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం కోవిడ్ పరీక్షలు దాదాపు 16.5 కోట్లకు చేరువగా 16,42,68,721 అయ్యాయి. రోజుకు పది లక్షలకంటే ఎక్కువ పరీక్షలు చేయాలన్న నిబంధనకు కట్టుబడి గత 24 గంటల్లో 10,98,164 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పుడు దేశంలో పరీక్షలు జరపగలిగే సామర్థ్యం రోజుకు 15 లక్షలు అయింది.   

భారతదేశంలో కోవిడ్ నిర్థారణ పరీక్షల మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 2276 లాబ్ లు దేశవ్యాప్తంగా ఉన్నాయి.  సగటున రోజుకు 10 లక్షలకు పైగా పరీక్షలు జరపగలిగే సామర్థ్యం రావటంతో పాజిటివ్ శాతం స్థిరంగా తక్కువ స్థాయిలోనే  ఉండేట్టు చేయగలిగారు. దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో 1,19,035 మందికి పరీక్షలు జరిగాయి. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన పరీక్షలు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GRE3.jpg

16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వారపు సగటి పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ACU4.jpg

15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LICE.jpg

పరీక్షల మౌలిక సదుపాయాలు పెరగటంతో జాతీయ సగటు కంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాలలో కూడా కొత్త కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0069LGU.jpg

ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నావారు 9,663,382 కి చేరుకోగా, కోలుకున్న శాతం కూడా పెరుగుతూ ప్రస్తుతం . 95.69% అయింది.  కొత్తగా కోలుకున్నవారిలో 75.87% మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 5,057 మంది కోలుకోగా, ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర (4,122 మంది) పశ్చిమ బెంగాల్ (2,270 మంది) ఉన్నాయి.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007JJAX.jpg

కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 77.34% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కేరలో అత్యధి కంగా  6,049 కొత్త కెసులు నమొదు చేసుకోగా 3,106 కొత్త కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008SM80.jpg

గడిచిన 24  గంటలలో 333 మంది మరణించారు. వారిలో 75.38% మంది పది రాష్ట్రాలకు చెందినవారే కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 75, పశ్చిమ బెంగాల్ లో 38, కేరళలో 27 మరణాలు నమోదయ్యాయి.  

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0091QZL.jpg

***

 


(Release ID: 1683046) Visitor Counter : 158