ప్రధాన మంత్రి కార్యాలయం

ఐఐఎస్ఎఫ్ 2020 లో ప్రారంభోన్యాసమివ్వనున్న ప్రధాన మంత్రి


Posted On: 20 DEC 2020 6:38PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 22 న సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2020 లో  ప్రారంభోపన్యాసమివ్వనున్నారు.  ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ కూడా పాల్గొంటారు.

ఐఐఎస్ఎఫ్ ను గురించి

సమాజం లో విజ్ఞానశాస్త్రాభిరుచి ని ప్రోత్సహించడానికి విజ్ఞానశాస్త్రం & సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, పృథ్వి విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ లు విజ్ఞాన భారతి తో కలసి ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) భావన కు రూపు దిద్దాయి.  2015 వ సంవత్సరం లో ప్రారంభించిన ఐఐఎస్ఎఫ్ విజ్ఞానశాస్త్రాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించే ఒక ఉత్సవం గా పేరు తెచ్చుకొంది.  ప్రజలను విజ్ఞానశాస్త్రం తో జోడించడం, విజ్ఞానశాస్త్రం తాలూకు సంతోషాన్ని వేడుక గా జరపడం తో పాటు జీవితాలను మెరుగుపరచడానికి తగిన పరిష్కారాలను విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, గణిత శాస్త్రం (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్.. ఎస్ టిఇఎమ్) ఏ విధం గా అందించగలుగుతాయో నిరూపించడం కూడా ఈ ఉత్సవం ఉద్దేశ్యం గా ఉంది.  విజ్ఞానశాస్త్ర పరమైన జ్ఞానం పై,  సృజ‌నాత్మకత పై, గాఢ ఆలోచనల పై, సమస్యలకు పరిష్కారం కనుగొనడం పై, జట్టు స్ఫూర్తి పై ప్రత్యేక శ్రద్ధ ను వహిస్తూ యువతీయువకులలో 21 వ శతాబ్ది నైపుణ్యాల ను వికసింపచేయడం లో సహాయకారిగా ఉండడంఐఐఎస్ఎఫ్ 2020 లక్ష్యం గా ఉంది.  విజ్ఞానశాస్త్ర సంబంధి రంగాల లో అధ్యయనం, కృషి చేసేటట్లుగా విద్యార్థులను ప్రోత్సహించడం దీని దీర్ఘకాలిక లక్ష్యం గా ఉంది.
 


 

***



(Release ID: 1682292) Visitor Counter : 183