సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు/ సైట్‌ల సందర్శకుల సంఖ్యపై ఉన్న పరిమితిని ఎత్తివేసిన ఏఎస్ఐ
సౌండ్ అండ్ లైట్ షోలు తిరిగి పునరుద్ధరణకు సమ్మతి
Posted On:
20 DEC 2020 1:18PM by PIB Hyderabad
సాంస్కృతిక శాఖ పరిధిలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన పరిధిలో ఉన్న కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు / పర్యటక ప్రదేశాలలో సందర్శకుల సంఖ్యపై విధించిన పరిమితిని తొలగించింది. ఈ నెల 18న (18 తేదీ డిసెంబర్ 2020న) ప్రాంతీయ డైరెక్టర్లు మరియు సూపరింటెండింగ్ పురావస్తు శాస్త్రవేత్తలకు కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు / పర్యటక ప్రదేశాలకు సంబంధించి జారీ చేసిన నవీకరించబడిన ఎస్ఓపీల ఆధారంగా ఆర్కియాల జికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఈ సమాచారాన్ని తెలియజేసింది. సందర్శకుల సంఖ్యను సంబంధిత సూపరింటెండింగ్ పురావస్తు శాస్త్రవేత్త/ ఎస్‌ఐ (ఐ/సీ) జిల్లా విపత్తు నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ అంగీకారంతో నిర్ణయించవచ్చు. క్యూఆర్ కోడ్, నెట్‌వర్క్‌లో సమస్యలు ఉన్న చోట భౌతిక టిక్కెట్ల అమ్మకం తిరిగి ప్రారంభించవచ్చని ఎస్ఓపీ పేర్కొంది. సౌండ్ మరియు లైట్ షో తిరిగి ప్రారంభించవచ్చని వివరించింది. పై పేర్కొన్న ఈ మార్పులు తప్ప 2.7.2020 (6.7.2020 నుంచి అమలులోకి వచ్చిన) ఎస్ఓపీలో పేర్కొన్న ఇతర అన్ని నిబంధనలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథంగా అమలులో ఉంటాయి. కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు. పర్యటక ప్రదేశాలలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రాష్ట్రం మరియు / లేదా జిల్లా పరిపాలన విభాగాలు జారీ చేసే కోవిడ్ సంబంధిత ప్రోటోకాల్‌నకు కట్టుబడి ఉండాలని ఈ సమాచారంలో తెలియ జేశారు.
***
(Release ID: 1682208)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam