యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
'ఫిట్ ఇండియా సైక్లోథాన్'కు ప్రజల నుంచి భారీ స్పందన; మొదటి వారంలో పాల్గొన్న దాదాపు 13 లక్షల మంది
ఈనెల 31 వరకు కొనసాగనున్న సైక్లోథాన్; ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని పాల్గొనే అవకాశం
Posted On:
20 DEC 2020 10:59AM by PIB Hyderabad
రెండో దఫా 'ఫిట్ ఇండియా సైక్లోథాన్'కు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రారంభించారు. ఈ నెల 7న ప్రారంభమైన సైక్లోథాన్‌లో దేశవ్యాప్తంగా ఔత్సాహికులు పాల్గొంటున్నారు. ఈనెల 15వ తేదీ వరకు, 12,69,695 మంది పాల్గొని, 57,51,874 కి.మీ. సైక్లింగ్ పూర్తి చేశారు. వీరిలో 3,11,458 మంది "నెహ్రూ యువ కేంద్ర సంఘటన్" నుంచి, 4,14,354 మంది "నేషనల్ సర్వీస్ స్కీమ్" నుంచి పాల్గొన్నగా, మిగిలిన 5,43,883 మంది ఇతర ఔత్సాహికులు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. సాధారణ ప్రజలేగాక, తాము సైకిల్ తొక్కుతున్న చిత్రాలు, దృశ్యాలను ప్రముఖులు కూడా తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు.
ఈ నెల 31వ తేదీ వరకు సైక్లోథాన్ కొనసాగుతుంది. https://fitindia.gov.in/fit-india-cyclothon-2020/ లింక్ ద్వారా ప్రజలు ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని సైక్లోథాన్‌లో పాల్గొనవచ్చు. ప్రతిరోజూ తమకు నచ్చినంత దూరం సైకిల్ తొక్కవచ్చు. సైకిల్ తొక్కుతున్న చిత్రాలు, వీడియోలను @FitIndiaOff ట్యాగ్, #FitIndiaCyclothon, #NewIndiaFitIndia హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలి.
సైక్లోథాన్‌లో పాల్గొనేలా ప్రజలను ఉత్సాహపరిచేలా, "శారీరక దారుఢ్యం కోసం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు సైకిల్ తొక్కడం ఉత్తమ మార్గం. ఈనెల 7-31 తేదీల మధ్య జరుగుతున్న రెండో దఫా సైక్లోథాన్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాల్గొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రధాని పిలుపునిచ్చిన 'ఫిట్‌నెస్ కా డోస్ ఆధా గంటా రోజ్' NewIndiaFitIndia #FitIndiaMovement లో భాగస్వాములమవుదాం" అంటూ ట్వీట్ చేశారు.
ఫిట్ ఇండియా సైక్లోథాన్ తొలి దఫా కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరిలో, పనాజీలో శ్రీ కిరెన్ రిజిజు ప్రారంభించారు. ప్రజలు ఇంటి బయటి కార్యక్రమాలకు అలవాటు పడడానికి, దేశవ్యాప్తంగా సైకిల్ సంస్కృతి పెంచే లక్ష్యంతో దీనిని చేపట్టారు. తొలి దఫాలో దేశవ్యాప్తంగా 35 లక్షల మంది పాల్గొన్నారు.
*****
(Release ID: 1682142)
Visitor Counter : 241
Read this release in:
Assamese
,
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Kannada
,
Malayalam