ప్రధాన మంత్రి కార్యాలయం
అసోచాం వ్యవస్థాపక వారం 2020 సందర్భంగా కీలకోపన్యాసం చేసిన ప్రధానమంత్రి
ఎంటర్‌ప్రైజర్లు, సంపద సృష్టికర్తల దేశం - ప్రధాని
ఇండియా ఎందుకు అనే తీరు నుంచి ఇండియా ఎందుకు కాకూడదు అన్న సెంటిమెంట్ ఏర్పడింది
పరిశోధన అభివృద్ధి లో మరిన్ని పెట్టుబడులకు పిలుపు
Posted On:
19 DEC 2020 1:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, అసోచామ్ వ్యవస్థాపక వారం 2020 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి అసోచాం ఎంటర్ ప్రైజ్ ఆఫ్ ద సెంచరీ అవార్డును శ్రీ రతన్ టాటా కు అందజేశారు. రతన్ టాటా దీనిని టాటా గ్రూప్ తరఫున అందుకున్నారు.
అసోచాం వ్యవస్థాపక వారం సమావేశానికి హాజరైన బిజినెస్ కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జాతి నిర్మాణంలో వారి పాత్రను ప్రధానమంత్రి కొనియాడారు. ప్రస్తుతం పరిశ్రవమ ఆకాశమంత ఎత్తుకు ఎదిగే అవకాశాలు పుష్కలంగా
ఉన్నాయని అన్నారు.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. స్వావలంబిత భారత్ కోసం పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం దేశ వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలు కోట్లాదిమంది యువతకు అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం సమర్ధమైన స్నేహపూర్వకమైన వాతావరణాన్నికల్పించే కృషిని కొనసాగిస్తోందని అన్నారు. ఆయా సంస్థల నుంచి అందే ఫలితాలు చిట్టచివరి వ్యక్తికి కూడ అందే విధంగా ఉండాలని, పరిశ్రమలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని, అలాగే మహిళలు,యువత నైపుణ్యాలతో మరింత సమ్మిళితత్వానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వీటి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా అందేటట్టు ఉండాలన్నారు. అందుకు అవసరమైన ప్రపంచ శ్రేణి పద్ధతులను కార్పొరేట్ పాలన, లాభాల పంపిణి వంటి వాటి విషయంలో వీలైనంత త్వరగా అనుసరించాలని ప్రధానమంత్రి అన్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలోనూ , ఒక వైపు ప్రపంచం మొత్తం పెట్టుబడుల విషయంలో ఎంతో ఇబ్బందులు పడుతుంటే, రికార్డు స్థాయిలో ఎఫ్.డి.ఐలు, పిఎఫ్ ఐ పెట్టుబడులు ఇండియాకు తరలి వచ్చాయని ఆయన అన్నారు. ప్రపంచం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను విశ్వసిస్తున్నదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పై పెరిగిన విశ్వాసానికి తోడు పరిశ్రమ వర్గాలు దేశీయంగా పెట్టుబడనులను గణనీయంగా పెంచాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
భారతీయ పరిశ్రమలు అమెరికాతో పోలిస్తే పరిశోధన అభివృద్ధిపై తక్కువ పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన అన్నారు. అమెరికాలో 70 శాతం పెట్టుబడులు పరిశొధన అభివృద్ధిలో ప్రైవేటు రంగం నుంచే ఉన్నాయని అయన అన్నారు. వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం, ఇంధనం, నిర్మాణ రంగంగం,ఫార్మా, రవాణా రంగాలలో పెట్టుబడిని పెంచాలని ప్రత్యేకించి పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అన్ని కంపెనీలూ కొంత మొత్తాన్ని పరిశోధన అభివృద్ధికి కేటాయించాలని ఆయన కోరారు.
ప్రపంచం శరవేగంతో నాలుగవ పారిశ్రామిక విప్లవం దిశగా పయనిస్తోందని, నూతన సాంకేతిక పరిజ్ఞానం రూపంలో సవాళ్లు రానున్నాయని, ఇందుకు పరిష్కారాలు కూడా ఎన్నో వస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకుని కార్యాచరణ చేపట్టడానికి ఇది సమయమని ఆయన అన్నారు. వ్యాపార రంగ నాయకులు ప్రతి సంవత్సం కలుసుకుని , ప్రతి లక్ష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ దేశనిర్మాణమనే విశాల లక్ష్యానికి పాటుపడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. రాగల 27 సంవత్సరాలలో అంటే స్వతంత్ర భారతావని శతాబ్దికి చేరుకునే నాటికి ఇండియా అంతర్జాతీయ పాత్ర నిర్ధారణ కావడమే కాక, భారతీయుల కలలను, వారి అంకిత భావాన్ని పరీక్షిస్తుందని ఆయన అన్నారు. భారతీయ పరిశ్రమ రంగం సమర్ధత, అంకిత భావం , సాహసాన్ని ప్రపంచానికి చూపాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు. స్వావలంబన సాధించడమే కాక, మనం ఎంత త్వరగా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్నది కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు.
భారత దేశ విజయానికి సంబంధించి ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి సానుకూలత లేదని ప్రధానమంత్రి అన్నారు. ఈ సానుకూలత130 కోట్ల భారతీయుల తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండియా ముందుకు సాగడానికి కొత్త అవకాశలను చూస్తున్నదని, కొత్త శక్తితో ముందుకు వెళుతున్నదని అన్నారు. దేశంలో సంస్కరణలు పరిశ్రమ సెంటిమెంట్‌లో మార్పు తీసుకువచ్చిందని, పెట్టుబడులకు ఇండియా ఎందుకు అనే ప్రశ్ననుంచి ఇండియా ఎందుకు వద్దు అనే విధంగా ప్రభావితం చేశాయన్నారు.
నవభారతం తన బలంపై ఆధారపడడమే కాక, తన వనరులపైన ఆధారపడి,ఆత్మనిర్భర భారత్‌నుముందుకు తీసుకువెళుతున్నదని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో ముందుకు పోతున్నట్టుప్రధానమంత్రి చెప్పారు. ఇండియాలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు సంస్కరణలను నిరంతరాయంగా ముందుకు తీసుకుపోతున్నట్టు చెప్పారు.
స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లేందుకు మనం మిషన్ మోడ్ లో పనిచేస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలో మనం భౌగోళిక రాజకీయ పరిణామాలకు సత్వరం స్పందించాల్సి ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సరఫరా చెయిన్‌లో సత్వరం ఏర్పడే డిమాండ్‌ను తీర్చేందుకు ఇండియా ఒక సమర్ధయంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిశ్రమ సంస్థలైన అసోచామ్ వంటి సంస్థలతో విదేశీ వ్యవహారాలు, వ్యాపార వాణిజ్య మంత్రిత్వశాఖలత మధ్యమరింత మెరుగైన సమన్వయం సాధించాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ స్థాయి పరివర్తన విషయంలోసత్వర స్పందనకు ఎలాంటి మెరుగైన యంత్రాంగం ఉండాలన్న దానిపై పరిశ్రమ వర్గాలు సూచనలు,ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలన్నారు.
ఇండియా తన అవసరాలను తీర్చుకుంటూ ప్రపంచానికి సహాయ పడగలదని అన్నారు. కరోనా వంటి సమయంలో కూడా ప్రపంచ ఫార్మసీ అవసరాలు తీర్చే బాధ్యతను చేపట్టిందని,ప్రపంచవ్యాప్తంగా అవసరమైన ఆవశ్యక మందులను ఇండియా సరఫరా చేసిందన్నారు. ఇక వాక్సిన్‌ల విషయంలో కూడా ఇండియా తన అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ఎన్నో ఇతర దేశాల అంచనాలను నెరవేర్చనున్నదని ఆయన చెప్పారు. గ్రామీణహస్తకళాకారుల ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లవలసిందిగా , వారికి అంతర్జాతీయ వేదికను కల్పించాల్సిందిగా ఆయన అసోచాం సభ్యులను కోరారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్యగల విభజనను తొలగించగలదని అన్నారు. మన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించేందుకు ,మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు , మెరుగైన మార్కెట్‌లకు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో, వ్యవసాయసంస్థలతో, పరిశ్రమ అసోసియేషన్లతో కలసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇది మన మొత్తం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను నూతన శిఖరాలకు తీసుకువెళుతుందని అన్నారు.
21 వ శతాబ్దం ప్రారంభంలో అటల్‌జీ ఇండియాను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇవాళ, దేశంలో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటి కల్పించే కృషిలో ఉన్నామన్నారు.దీనివల్ల గ్ఆరమీణ రైతు అంతర్జాతీయ గ్లోబల్ మార్కెట్ తో అనుసంధానం కావడానికి అవకాశంఉంటుందన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఫండింగ్ తో ముడిపడిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల ను బలోపేతం చేయడం, బాండ్ మార్కెట్‌ల సామర్ధ్యంపెంపు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఫండింగ్ వంటి అంశాలు లేదా ఆ దిశగా ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. అలాగే,సావరిన్ వెల్త్ ఫండ్‌లు,పెన్షన్ ఫండ్‌లు ఆర్.ఇ.ఐటిలు, ఐఎన్‌విఐట్ లను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. మౌలిక సదుపాయాల సంబంధిత ఆస్తులను మానిటైజ్ చేయడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం తగినసదుపాయాలు కల్పించగలదని,తగిన వాతావరణాన్నిఏర్పరచగలదని,ప్రోత్సాహకాలు , మార్పు కు దోహదపడే విధానాలు చేపట్టగలదని అన్నారు. అయితే పరిశ్రమ భాగస్వాములు,ఈ మద్దతు ను విజయంగా మలచగలరని ప్రధానమంత్రి అన్నారు. స్వావలంబిత భారతదేశ స్వప్నం సాకారమయ్యేందుకు అవసరమైన మార్పులను తీసుకువచ్చేందుకు, నిబంధనలు , రెగ్యులేషన్లు తెచ్చేందుకు దేశం ఆలోచిస్తోందని,ఇందుకు దేశం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
****
(Release ID: 1682079)
Visitor Counter : 283
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam