ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్య ప్రదేశ్ లో జరిగిన కిసాన్ సమ్మేళన్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఎమ్ఎస్‌పి , కాంట్రాక్టు వ్యవసాయం లపై ఆందోళనలను తీర్చడంతో పాటు అసత్య ప్రచారం విషయం లో జాగ్రత్త గా ఉండాలని ఆయన చెప్పారు
Posted On:
18 DEC 2020 5:26PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ వ్యాప్తం గా నిర్వహించిన కిసాన్ సమ్మేళన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఆయన శీతలీకరణ నిలవ సంబంధిత మౌలిక సదుపాయాల నిర్మాణానికి, మరికొన్ని ఇతర సౌకర్యాలకు శంకుస్థాపన చేయడం తో పాటు కొన్నిటి ని ప్రారంభించారు కూడా.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రైతు ఎంతగా కష్టించి పని చేసినప్పటికీ ధాన్యానికి, కాయగూరలకు, పండ్ల కు తగిన నిలవ సదుపాయం ఏదీ లేనటువంటి పక్షం లో, అటువంటప్పుడు రైతు భారీ నష్టాల బారి న పడటం తప్పదు అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఆధునిక నిలవ కేంద్రాలను, శీతలీకరణ నిలవ సదుపాయాలను అభివృద్ధిపరచడానికి, కొత్త ఫూడ్ ప్రాసెసింగ్ వెంచర్ లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావలసిందంటూ వ్యాపార జగతి కి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రైతులకు ఉపయోగపడుతుందని, నిజమైన అర్థం లో దేశాని కి సేవ చేసినట్లు కూడా అవుతుందని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలలో రైతులకు అందుబాటు లో ఉన్న ఆధునిక సదుపాయాల వంటివి భారతదేశం లోని రైతులకు కూడా అందుబాటులోకి రావాలని, ఈ విషయం లో ఇకమీదట ఎంత మాత్రం జాప్యం చేయడానికి వీలు లేదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ ముఖచిత్రం శరవేగంగా మారుతున్న తరుణం లో భారతదేశం లోని పరిస్థితి ఆమోదయోగ్యం కాదని, సదుపాయాలు, ఆధునిక పద్ధతుల లోటు కారణంగా రైతు నిస్సహాయునిగా మారుతున్న కారణం గా ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిపోయిందని ఆయన అన్నారు.
వ్యవసాయ చట్టాలపై ఇటీవల జరిగిన చర్చలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ వ్యావసాయిక సంస్కరణ చట్టాలకు సంబంధించిన సంప్రదింపులు గడచిన 20- 22 సంవత్సరాలుగా సాగుతూ వచ్చాయని, ఈ చట్టాలను రాత్రికి రాత్రి తీసుకు రాలేదని ఉద్ఘాటించారు. వ్యవసాయ రంగం లో మెరుగుదల కోసం దేశం లోని రైతులు, రైతుల సంఘాలు, వ్యావసాయిక నిపుణులు, వ్యవసాయ సంబంధిత ఆర్థికవేత్తలు, వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు, మన దేశం లోని ప్రగతిశీల కర్షకులు కూడా నిరంతర ప్రతిపదిక న పట్టు పడుతూ వచ్చారని ఆయన అన్నారు. ఈ సంస్కరణలను పార్టీ వాగ్ధాన పత్రాలలో ప్రస్తావించినప్పటికీ కూడా, వాటిని సిసలైన నిజాయితీ తో అమలుపరచడం జరగడం లేదని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రస్తుతం చోటుచేసుకొన్న వ్యావసాయిక సంస్కరణలు ఇంతకు ముందు చర్చ లో ఉన్న వాటి కన్నా భిన్నమైనవి కాదు అని ఆయన అన్నారు.
స్వామినాథన్ సంఘం నివేదిక ను మునుపటి ప్రభుత్వాలు 8 సంవత్సరాల కాలానికి పైగా అమలు చేయనే లేదని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వ్యవసాయదారుల ఆందోళన సైతం ఈ వ్యక్తుల చైతన్యాన్ని జాగృతం చేయలేకపోయిందన్నారు. వీరు, వారి ప్రభుత్వం రైతు పట్ల ఎక్కువ కాలాన్ని వెచ్చించకుండా చూశారు అని ఆయన అన్నారు. రైతులను రాజకీయాల కోసం ప్రతిపక్షం ఉపయోగించుకొంటోందని ఆయన విమర్శించారు. తన ప్రభుత్వం రైతుల పట్ల అంకిత భావం తో ఉందని, రైతులను అన్నదాత గా భావిస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు వారు పెట్టిన ఖర్చు కు ఒకటిన్నర రెట్ల కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్పి) ని ఇస్తూ, స్వామినాథన్ సంఘం నివేదిక లోని సిఫారసులను అమలుచేసిందని శ్రీ మోదీ అన్నారు.
రుణమాఫీ ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, బ్యాంకు కు వెళ్ళని, రుణాన్ని తీసుకోని చిన్న రైతు కు రుణ మాఫీ అందలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ కిసాన్ పథకం లో ప్రతి ఏటా రైతులు సుమారుగా 75 వేల కోట్ల రూపాయలను నేరు గా వారి బ్యాంకు ఖాతాల లో అందుకొంటారని ఆయన చెప్పారు. ఎలాంటి దారి మళ్ళింపు గానీ, ఏ ఒక్కరికీ ఎలాంటి రుసుములకు గాని తావు లేదని ఆయన అన్నారు. వేపపూత ను పూసినందువల్ల, అవినీతి పై చర్యలు తీసుకొన్నందువల్ల యూరియా లభ్యత ఏ విధంగా మెరుగుపడిందో కూడా ఆయన వివరించారు.
ఇదివరకటి ప్రభుత్వాలు రైతుల ను గురించి పట్టించుకొన్నట్లయితే గనక, దేశం లోని దాదాపు 100 పెద్ద నీటిపారుదల పథకాలు దశాబ్దాల తరబడి డోలాయమాన స్థితి లో ఉండేవి కాదు అంటూ ప్రధాన మంత్రి విమర్శించారు. ప్రస్తుతం మా ప్రభుత్వం ఈ సేద్యపు నీటి పథకాలను ఉద్యమం తరహా లో పూర్తి చేయడానికి వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది అని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క చేను కు నీరు అందేటట్లుగా చూడటానికి ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన అన్నారు. ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రైతులకు తోడు, తేనెటీగల పెంపకాన్ని, పశుపోషణ ను, చేపల పెంపకాన్ని ప్రభుత్వం సమాన స్థాయి లో ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు.
చేపల పెంపకాన్ని వ్యాప్తి లోకి తీసుకురావడానికి నీలి విప్లవం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. కొద్దికాలం క్రితం ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రయత్నాల కారణంగా దేశం లో చేపల ఉత్పత్తి తాలూకు మునుపటి రికార్డులు అన్నీ బద్దలు అయ్యాయని ఆయన చెప్పారు.
ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన వ్యావసాయిక సంస్కరణల లో అపనమ్మకం ఏర్పడటానికి ఎలాంటి కారణం లేదని, అబద్ధాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికే గనక కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్పి) ని తీసివేయాలనే ఉద్దేశ్యం ఉన్న పక్షం లో, స్వామినాథన్ సంఘం నివేదిక ను ఎందుకు అమలుపరుస్తుందో ఆలోచించండి అని ప్రజలను ఆయన కోరారు.
రైతు కు సౌకర్యం గా ఉండటానికే విత్తనాలు చల్లడాని కన్నా ముందుగానే ఎమ్ఎస్‌పి ని ప్రకటించడం జరిగింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. కరోనా మహమ్మారి తో పోరాడే కాలం లో సైతం ఎమ్ఎస్‌పి ఆధారిత సేకరణ యథాప్రకారం జరిగిందని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఎమ్ఎస్‌పి ని ఇంతకుముందు మాదిరిగానే ఇవ్వడం కొనసాగుతుంది అంటూ రైతులకు ఆయన హామీ ని ఇచ్చారు. ప్రభుత్వం ఎమ్ఎస్‌పి ని పెంచడం ఒక్కటే కాకుండా, ఎమ్ఎస్‌పి ప్రాతిపదిక న చాలా ఎక్కువ గా సేకరణ కూడా చేపట్టిందని ఆయన నొక్కి చెప్పారు.
దేశం పప్పు ధాన్యాల సంక్షోభాన్ని ఎదుర్కొన్న కాలం అంటూ ఒకటి ఉండిందని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. పప్పు ధాన్యాలను- దేశం లో చెలరేగే పెద్ద కేక ల నడుమ- విదేశాల నుంచి తెప్పించే వారు అని ఆయన అన్నారు. ఈ విధానాన్ని తన ప్రభుత్వం 2014 వ సంవత్సరం లో మార్చిందని, 2014 వ సంవత్సరాని కన్నా ముందు అయిదేళ్ళ కాలం లో ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించడం జరుగగా, దానితో పోలిస్తే రైతుల వద్ద నుంచి ఎమ్ఎస్‌పి కి 112 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పప్పు ధాన్యాల రైతులు కూడా ఎక్కువ డబ్బు ను అందుకొంటున్నారని, పప్పు ధాన్యాల ధరలు కూడా దిగివచ్చాయని, మరి ఈ పరిణామాలు పేదలకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని కలిగించాయని ఆయన అన్నారు.
మండీ లో గాని, లేదా బయట గాని విక్రయించడానికి కొత్త చట్టం రైతులకు స్వేచ్ఛ ను ఇచ్చిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. రైతు అతడి ఉత్పత్తి ని ఎక్కువ లాభం వచ్చే చోటు లో అమ్ముకోవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త చట్టం వచ్చాక ఏ ఒక్క మండీ ని కూడా మూసివేయలేదు అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎపిఎమ్‌సి లను నవీకరించడానికి 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని ఆయన వివరించారు.
కాంట్రాక్టు వ్యవసాయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది మన దేశం లో సంవత్సరాల నాటి నుంచి సాగుతూ వస్తోందని వివరించారు. కాంట్రాక్టు సేద్యం లో కేవలం పంటలు లేదా ఉత్పత్తి లావాదేవీలు ఉంటాయి తప్ప భూమి రైతు వద్దే ఉండిపోతుందని, ఒప్పందానికి భూమి తో ఎలాంటి ప్రమేయం ఉండదు అని ఆయన అన్నారు. చివరకు ఏదైనా ప్రాకృతిక విపత్తు వాటిల్లినా గానీ రైతు పూర్తి డబ్బు ను పొందుతాడన్నారు. కొత్త చట్టం రైతు కు అనుకోని లాభాల లో ఒక వాటా అందేందుకు పూచీ పడిందని చెప్పారు.
ఈ ప్రయత్నాలన్నిటి తరువాత సైతం భయానికి లోనవుతున్న రైతుల ఆందోళనలను కూడా తీర్చుతాం అంటూ ప్రధాన మంత్రి మాట ఇచ్చారు. ప్రతి ఒక్క అంశం పైనా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధం గా ఉంది అని ఆయన అన్నారు. ఈ అంశం పై వివరణాత్మకం గా మరోసారి తాను ఆదరణీయ అటల్ గారి జయంతి అయిన డిసెంబరు 25వ తేదీ న మాట్లాడతానని ప్రధాన మంత్రి తెలిపారు. ఆ రోజు న ‘పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’ తాలూకు మరొక కిస్తీ ని కోట్ల కొద్దీ రైతుల బ్యాంకు ఖాతాల కు ఏకకాలం లో బదలాయించడం జరుగుతుంది.
****
(Release ID: 1681812)
Visitor Counter : 306
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam