రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

'ఇ20' ఇంధనం వినియోగంపై ప్రజాభిప్రాయం కోరిన రవాణా శాఖ


Posted On: 18 DEC 2020 4:51PM by PIB Hyderabad

వాహనాల కోసం దేశంలో 'ఇ20' ఇంధనం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరుతూ, కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ముసాయిదా ప్రకటన జీఎస్‌ఆర్‌ 757(ఇ)ను విడుదల చేసింది. ఇ20 ఇంధనం అంటే గ్యాసోలిన్‌, 20 శాతం ఇథనాల్‌తో కూడిన మిశ్రమం. దీంతోపాటు ఈ ఇంధనం ఉద్గార ప్రమాణాల అనుసరణపైనా సూచనలు ఆహ్వానించింది. ఇ20 ఇంధనాన్ని వినియోగించుకునే వాహనాల వృద్ధికి ఈ ముసాయిదా ప్రకటన తోడ్పడుతుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌, హైడ్రోకార్బన్ల వంటి ఉద్గారాలకు కళ్లెం పడుతుంది. ఇంధన దిగుమతి వ్యయం తగ్గి, విదేశీ మారకద్రవ్యం మిగలడంతోపాటు, ఇంధన భద్రత మరింత పెరుగుతుంది.

ఇథనాల్, గ్యాసోలిన్ మిశ్రమంలోని ఇథనాల్ శాతానికి సరిపోయే వాహనాలను తయారీదారులే నిర్వచిస్తారు. ఈ వివరం స్పష్టంగా కనిపించేలా వాహనంపై స్టిక్కర్‌ అతికిస్తారు.

 

****



(Release ID: 1681789) Visitor Counter : 234