మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చైతన్యం, బలమైన సందేశంతో భారత్‌లో నిర్మించిన షార్ట్ ఫిల్మ్‌లు కరోనా మహమ్మారి సమయంలో ముఖ్య పాత్ర పోషించాయిః ముక్తార్ అబ్బాస్ నక్వీ
కొత్త ఢిల్లీలో అంతర్జాతీయ కరోనా వైరస్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ముక్తార్ అబ్బాస్ నక్వీ
Posted On:
14 DEC 2020 2:55PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి సమయంలో భారత దేశ ప్రభుత్వం, సమాజం, సినిమా, మీడియా రంగాలు సాహసంతో, నిబద్ధతతో, జాగరూకతతో ప్రశంసనీయ పాత్ర పోషించాయని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో చైతన్యాన్ని, బలమైన సందేశాన్ని ఇచ్చే షార్్ట ఫిల్మ్‌లు ప్రముఖ పాత్ర పోషించాయన్నారు.
దేశ రాజధాని కొత్త ఢిల్లీలో సోమవారం నాడు అంతర్జాతీయ కరోనా వైరస్ షార్్ట ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రసంగిస్తూ, కరోనా మహమ్మారితో ఎదురయ్యే సవాళ్ళ గురించి ప్రజల్లో చైతన్యం తేవడంలో షార్్ట ఫిల్మ్స్ కీలక పాత్ర పోషించాయని నక్వీ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్, సినీ రంగ ప్రముఖులు, వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, జర్నలిస్టులు, మేధావులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ కరోనా వైరస్ షార్్ట ఫిల్మ్ ఫెస్టివల్‌లో 108 దేశాలకు చెందిన 2800 సినిమాలు పాలుపంచుకుంటున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా కరోనా మహమ్మారి సమయంలో జీవవితాలు, జాగ్రత్త చర్యలు, నివారణ అని ఇతివృత్తం ఆధారంగా నిర్మితమయ్యాయి.
కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌లను దీర్ఘకాలం వాయిదావేశారని నక్వి అన్నారు. సంక్షోభ సమయంలో షార్ట్ ఫిల్మ్‌లు ప్రజలకు వినోదాన్ని పంచడమే కాక, కరోనా వల్ల ఎదురయ్యే సవాళ్ళ గురించి ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చాయి. వివిధ ఛానెళ్ళు, అది వార్తా ఛానెల్ అయినా, వినోద ఛానెల్ అయినా, క్రీడ లేక వ్యాపార ఛానెల్ అయినా, అన్నీ కూడా కరోనా మహమ్మారి గురించి ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చే విషయంలో అన్నీ ప్రశంసనీయ పాత్రను పోషించాయన్నారు.
దేశంలో సంక్షోభం ఎదురైన సమయంలో జాతి ప్రయోజనాలను, మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, సమాజం, సినిమా, మీడియా రంగాలు అన్నీ కూడా తమ తమ బాధ్యతను పూర్తి నిజాయితీతో పోషించాయని నక్వీ కొనియాడారు.
కరోనా మహమ్మారి వంటి సంక్షోభాన్ని ప్రపంచం అనేక శతాబ్దాల తర్వాత ఎదుర్కొంటోంది. ఇటువంటి సవాలును అనేక తరాలు చూడలేదు. అయినప్పటికీ పరిణితి చెందిన సమాజం పాత్ర పోషించేందుకు చేయని ప్రయత్నం లేదని, ముఖ్యంగా భారతదేశంలో ప్రభుత్వం, సినిమా, మీడియా రంగాలు - ఈ నాలుగు వర్గాలన్నీ కూడా సమస్య పరిష్కారంలో భాగమయ్యాయన్నారు.
పని సంస్కృతిలో, పాలనా తీరు, నిబద్ధతలో సమాజం, సినిమా, మీడియాలో గత 10 నెలలుగా సానుకూల విప్లవాత్మక మార్పులు వచ్చాయని నక్వీ చెప్పారు. కేవలం నిబంధనల ద్వారా మాత్రమే సంస్కరణలు చోటు చేసుకోవని, అవి దృఢ నిశ్చయం కారణంగా చోటు చేసుకుంటాయి. నేడు, కరోనా సంక్షోభ సమయంలో ప్రతి వర్గం కూడా పని సంస్కృతి, జీవనశైలిలో తీవ్ర మార్పులకు సాక్షిగా ఉంది.
భారతీయ సమాజం మంచి, సమాజానికి ప్రభావవంతమైన సందేశంతో కూడిన వినోదాత్మక సినిమాలంటే ఇష్టపడుతుందని, ముఖ్యంగా పెద్ద తెర మీద ఈ సినిమాలు చూడాలనుకుంటుందని నక్వీ అన్నారు. సినిమాలు, మీడియా మన జీవితంలో అవిభాజ్యమైన భాగం కావడమేకాక, సమాజాన్ని ప్రభావితం చేసే బలం వాటికుంటుందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఈ విషయం షార్ట్ ఫిల్మ్్స రుజువు చేశాయన్నారు.
అంతర్జాతీయ కరోనా వైరస్ షార్్ట ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ, కరోనా వైరస్ మీద తీసిన షార్ట్ ఫిల్మ్్సను గౌరవించేందుకు ఫిల్్మ ఫెస్టివల్‌ను నిర్వహించాలన్న భావన అద్భుతమైందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. కేవలం ఒకే అంశం మీద 108 దేశాల నుంచి 2,800 సినిమాలు రావడం అనేది ప్రజల గొప్ప ప్రతిభకు చిహ్నమన్నారు. ఈ ఫెస్టివల్ నిర్వాహకులను మంత్రి అభినందించారు.
***
(Release ID: 1680665)
Visitor Counter : 168