ప్రధాన మంత్రి కార్యాలయం

విద్యావాచస్పతి బన్నంజే గోవిందచార్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 13 DEC 2020 5:13PM by PIB Hyderabad

విద్యావాచస్పతి బన్నంజే గోవిందచార్య మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "విద్యావాచస్పతి బన్నంజే గోవిందచార్య గారు సాహిత్యానికి చేసిన గొప్ప కృషి చిరస్మరణీయం. సంస్కృత, కన్నడ భాషల పట్ల ఆయనకున్న అభిరుచి ప్రశంసనీయం. ఆయన రచనలు భావి తరాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆయన అస్తమయం నన్నెంతో బాధకు గురిచేసింది.  వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అని పేర్కొన్నారు.

*****


(रिलीज़ आईडी: 1680445) आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam