ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో తగ్గుదలబాటలోనే చికిత్సలో ఉన్న కేసులు; 3.6 లక్షలకు దిగువన

15 రోజులుగా కొత్తకేసులకంటే కోలుకుంటున్నవారు అధికం

వారం రోజులుగా రోజువారీ మరణాలు 500 లోపు

Posted On: 12 DEC 2020 12:26PM by PIB Hyderabad

భారత దేశంలో చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 3.6 లక్షలకంటే తగ్గి 3,59,819 కి చేరింది.  కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు  ఎక్కువగా ఉంటూ వస్తుండటం వల్లనే ఇది సాధ్యమైంది. భారత్ లో నమొదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇప్పుడు చికిత్సలో ఉన్నది 3.66% మాత్రమే. గడిచిన 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య  33,494 కాగా ఇది చికిత్సలో ఉన్నవారి సంఖ్యను 3,930 మేర తగ్గించగలిగింది.

 

WhatsApp Image 2020-12-12 at 10.05.34 AM.jpeg

గత వారం రోజుల పరిస్థితి చూస్తే, కరోనా బాగా వ్యాపించిన ఆరు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు బాగా తగ్గుతూ ఉన్నాయి. గత 15 రోజులలో కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసులకంటే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటలలో 30,006 కొత్త కేసులు వచ్చాయి.  అదే సమయంలో 33,494 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.   

 

కోలుకుంటున్నవారు ఎక్కువవుతుండటంతో కోలుకున్నవారి శాతం కూడా బాగా పెరిగి  94.89% కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య  93,24,328 కు చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా ప్రస్తుతం 89,64,509 గా ఉంది. కోలుకున్న కోవిడ్ కేసులలో 74.46% పది రాష్ట్రాల్లోనే గుర్తించారు. అందులో కేరళలో అత్యధికంగా 4,748 మంది కోలుకోగా, పశ్చిమ బెంగాల్ లో 2,873 మంది, మహారాష్ట్రలో  2,774 మంది ఈ మహమ్మారి బారినుంచి బైటపడ్దారు.

 

WhatsApp Image 2020-12-12 at 10.03.04 AM.jpeg

కొత్తగా నమోదైన కేసులలో 74.16% కేవలం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. ఇందులో అత్యధికంగా కేరళలో  నిన్న 4,642 కేసులు రాగా మహారాష్ట్రలో 4,268 , పశ్చిమ బెంగాల్ లో 2,753 కేసులు వచ్చాయి.

WhatsApp Image 2020-12-12 at 10.01.11 AM.jpeg

గడిచిన 24 గంటలలో 442 మంది చనిపోయారు. వాటిలో  78.05% మరణాలు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే సంభవించాయి.  మహారాష్ట్రలో అత్యధికంగా 87 మరణాలు నమోదు కాగా ఆ తరువాత స్థానాల్లో ఉన్న ఢిల్లీలో 60 మంది, పశ్చిమ బెంగాల్ లో 50 మంది మరణించారు.   

WhatsApp Image 2020-12-12 at 9.58.18 AM.jpeg

చాలా రోజులుగా రోజువారీ మారణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.  7 రోజులుగా రోజుకు 500 లోపు మరణాలు నమోదవుతున్నాయి.   

WhatsApp Image 2020-12-12 at 9.59.33 AM.jpeg

 

WhatsApp Image 2020-12-12 at 10.07.46 AM.jpeg

****

 


(Release ID: 1680216) Visitor Counter : 120