మంత్రిమండలి

ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికమ్ అభివృద్ధి సంబంధిత ప్రణాళికలోభాగంగా అరుణాచల్ ప్రదేశ్‌లో, అసమ్ లో రెండు జిల్లాలలో మొబైల్ కవరేజీని అందించడంకోసం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ స్కీమ్‌ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 09 DEC 2020 3:44PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతంలో సమగ్ర టెలికమ్ అభివృద్ధి ప్రణాళిక (సిటిడిపి) లో భాగం గా అరుణాచల్ ప్రదేశ్ లో, అసమ్ లో కర్బీ ఆంగ్ లోంగ్, దీమా హాసావో జిల్లాలలో మొబైల్ కవరేజీని అందించడానికి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్) పథకాన్ని అమలుచేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు సహా దాదాపుగా రూ. 2,029 కోట్ల అంచనా ఖర్చు తో మొబైల్ సౌకర్యం లేనటువంటి 2,374 గ్రామాలకు (ఇటువంటి గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్ లో 1,683, అసమ్ లో రెండు జిల్లాలకు చెందిన 691 ఉన్నాయి) మొబైల్ కవరేజీ ని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు.

ఈ ప్రాజెక్టు కు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఈ ప్రాజెక్టు ను 2022 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొబైల్ కవరేజీ పరిధిలో లేనటువంటి గ్రామాలలో 4-జి మొబైల్ సర్వీసుల అందజేతకు సంబంధించిన పనులను వర్తమాన యుఎస్ఒఎఫ్ ప్రక్రియ లో భాగంగా బహిరంగ స్పర్థాత్మక వేలం ద్వారా అప్పగించడం జరుగుతుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో , అసమ్ లోని ప్రస్తుతం మొబైల్ కవరేజీ అందుబాటులో లేని సుదూర ప్రాంతాలకు మొబైల్ సేవలను అందించడం వల్ల స్వయం సంవృద్ధికి తోడ్పడే డిజిటల్ కనెక్టివిటి వృద్ధి చెందడం, విద్యార్జనకు మార్గం సుగమం కావడం, సమాచార సేవల విస్తృతి, నైపుణ్యాల ఉన్నతీకరణ, విపత్తు వేళల్లో నిర్వహణ, - గవర్నెన్స్ కార్యక్రమాలకు ప్రోత్సాహం, -కామర్స్ సేవలకు అండదండలు, విద్యా సంస్థలకు కావలసిన మద్దతు లభించడం... వీటికి అదనంగా ఉద్యోగ అవకాశాలు అందిరావడానికి కూడాను సౌలభ్యం ఏర్పడుతుంది. అంతేకాక డిజిటల్ ఇండియా దార్శనికత ను సాకారం చేయడం, దేశీయ తయారీని ప్రోత్సహించడంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలను నెరవేర్చడంలోనూ ఇది సహాయకారి అవుతుంది.

 

****(Release ID: 1679452) Visitor Counter : 14