ప్రధాన మంత్రి కార్యాలయం

ల‌క్ష‌ద్వీప్‌ పరిపాలకుడు శ్రీ దినేశ్వర్ శర్మ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 04 DEC 2020 4:32PM by PIB Hyderabad

ల‌క్ష‌ద్వీప్‌ పరిపాలకుడు శ్రీ దినేశ్వ‌ర్ శ‌ర్మ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘ల‌క్ష‌ద్వీప్ ప‌రిపాల‌కుడు శ్రీ దినేశ్వ‌ర్ శ‌ర్మ గారు భార‌త‌దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌ కు, భ‌ద్ర‌త యంత్రాంగానికి చిర‌కాలం గుర్తుండిపోయే తోడ్పాటు ను అందించారు.  ఆయ‌న త‌న పోలీసు వృత్తి జీవ‌నం లో అనేక ఉగ్ర‌వాద వ్య‌తిరేక కార్య‌క‌లాపాల లోను, తిరుగుబాటు దారుల నిరోధ‌ కార్య‌క‌లాపాల‌ లోను పాలుపంచుకొన్నారు.  ఆయ‌న మ‌ర‌ణం తో ఖిన్నుడిన‌య్యాను.  ఆయ‌న కుటుంబానికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***
 


(Release ID: 1678349) Visitor Counter : 100