ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్ ‌హెచ్‌-19 లోని వారాణసీ- ప్రయాగ్ రాజ్‌ సెక్షన్ ను ఆరు దోవలు కలిగిందిగా విస్తరించగా, ఆ పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

దశాబ్దాల తరబడి జరిగిన మోసం రైతులను భయావహులను చేసింది కానీ ఇప్పుడు ఎలాంటి మోసానికీ తావు లేదు, గంగాజలమంత పవిత్రమైన ఉద్దేశ్యాలతో పని చేయడం జరుగుతోంది: ప్రధాన మంత్రి

కొత్త వ్యవసాయ సంస్కరణ లతో రైతుల కు కొత్త ఐచ్ఛికాలు లభిస్తాయి, అంతేకాక నూతన చట్ట సంరక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది; దాంతోపాటు ఒకవేళ ఎవరైనా పాత వ్యవస్థ నే ఎంచుకోవాలని అనుకొంటే గనక పాత వ్యవస్థ కూడా అమలులో ఉంటుంది: ప్రధాన మంత్రి

ప్రభుత్వం ఎమ్ఎస్‌పి ని, మండీ వ్యవస్థ ను.. రెంటినీ మరింత బలపరచింది: ప్రధాన మంత్రి

Posted On: 30 NOV 2020 4:24PM by PIB Hyderabad

ఎన్ హెచ్‌-19 లో ని వారాణసీ- ప్రయాగ్ రాజ్ సెక్షన్ ను ఆరు దోవలు కలిగివుండేది గా విస్తరించగా, ఆ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లో ప్రారంభించారు.  

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కాశీ లో సంధానాన్ని మెరుగుపరచడం కోసం, నగర సౌందర్యీకరణ కోసం గతం లో చేపట్టిన పనుల ఫలితాలను ఇవాళ చూడవచ్చన్నారు.  వారాణసీ లో, పరిసర ప్రాంతాల్లో రాక పోక ల రద్దీ సమస్య ను తగ్గించడానికి కొత్త నేశనల్ హైవే, ఫ్లైఓవర్, రహదారుల విత్తరణ కై అనేక పనులను చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. 

ఈ ప్రాంతం లో ఆధునిక సంధాన వ్యవస్థ ను విస్తరిస్తే, మన రైతులు కూడా పెద్ద స్థాయి లో ప్రయోజనం పొందుతారు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  గత కొన్నేళ్లు గా గ్రామాల్లో ఆధునిక రహదారులతో పాటు శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాల కల్పన కు ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు.  ఈ పనుల కోసం ఒక లక్ష కోట్ల రూపాయలతో ఒక నిధి ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 

ప్రభుత్వ ప్రయత్నాలు, ఆధునిక మౌలిక సదుపాయాల నుంచి రైతులు ఎలా లబ్ధి పొందుతున్నారనే విషయమై ప్రధాన మంత్రి ఒక ఉదాహరణ ను చెప్తూ,  ‘‘రైతుల ఆదాయాన్ని పెంచడానికి రెండు సంవత్సరాల క్రితం చందౌలీ లో నల్ల బియ్యాన్ని ప్రారంభించడం జరిగింది.  గత సంవత్సరం లో, ఒక రైతు కమిటీ ని ఏర్పాటు చేసి, ఖరీఫ్ సీజన్ లో పండించడానికి 400 మంది రైతులకు ఈ బియ్యం తాలూకు విత్తనాలను ఇచ్చారు.  సాధారణ బియ్యం కిలో కు 35 రూపాయల నుండి 40 రూపాయలకు అమ్ముడవుతుంటే, ఈ నల్ల బియ్యాన్ని కిలో కు 300 రూపాయల వరకు ధర కు విక్రయించడమైంది.  మొట్టమొదటి సారిగా ఈ బియ్యాన్ని ఆస్ట్రేలియా కు ఎగుమతి చేయడమైంది- అది కూడా కిలో కు సుమారు 800 రూపాయల ధర కు’’ అని వివరించారు.  

భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ పెద్ద మార్కెట్లను చేరుకోకుండా, అధిక ధరలను అందుకోకుండా రైతులను ఎందుకు మోసం చేయాలి అని ఆయన ప్రశ్నించారు.  కొత్త వ్యవసాయ సంస్కరణ లు రైతులకు కొత్త ఎంపికలతో పాటు చట్టపరమైన కొత్త రక్షణ ను అందిస్తాయని, దాంతో పాటే పాత వ్యవస్థ ను కూడా అమలుపరచడం జరుగుతుందని, ఒకవేళ ఎవరైనా ఆ పాత వ్యవస్థ ను ఎంచుకోవాలి అని అనుకొంటే అలాగే ఎంచుకోవచ్చు అని ఆయన చెప్పారు.  మొదట మండీల కు వెలుపల చట్టవిరుద్ధంగా లావాదేవీలు జరిగేవి, అయితే ఇప్పుడు చిన్న రైతులు సైతం ఈ చట్టవిరుద్ధ లావాదేవీలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యల కోసం అడుగు ముందుకు వేయవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు. 

ప్రభుత్వం విధానాలను, చట్టాలను, నిబంధనలను ఖరారు చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.  ఆయన ప్రతిపక్షాలను విమర్శిస్తూ, ఇంతకుముందు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం జరిగేది; కానీ ఇప్పుడు భయపడ్డ కారణంగా విమర్శించడం జరుగుతోంది అన్నారు.  సమాజం లో జరగనటువంటి దాని పైన, ఇక ముందు జరగని దాని మీద అసత్యాలను, భ్రమలను వ్యాపింపచేయడం జరుగుతోంది అని ఆయన అన్నారు.  వీరు రైతులను దశాబ్దాల పాటు నిరంతరం వంచన చేసిన వారు అని ఆయన అన్నారు.

ఒక సంప్రదాయం గా ప్రకటించే కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) వ్యవస్థ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఎమ్ఎస్ పి లో ప్రతి సారీ మామూలు వృద్ధి ని అమలుపరచడం జరిగేది, కానీ కనీస మద్దతు ధర కు కొనుగోళ్లు చాలా తక్కువ గా ఉండేవన్నారు.  ఈ సంప్రదాయం సంవత్సరాలుగా ఏర్పడింది.  రైతుల పేరు తో రుణ మాఫీ తాలూకు పెద్ద పెద్ద ప్యాకేజీలను ప్రకటించడం జరిగేది, కానీ ఈ మినహాయింపు, ఈ ఉపశమనం చిన్న రైతుల, సన్నకారు రైతుల దగ్గరకు చేరేది కాదు.  రైతుల పేరుతోనే పెద్ద పెద్ద పథకాలను ప్రారంభించడం జరిగేది, అయితే అదే ప్రభుత్వం తన ద్వారా విడుదల చేసిన ఒక రూపాయి లో కేవలం 15 పైసలే రైతుల దగ్గరకు చేరేవని భావించేది.  ఇలాగ పథకాల పేరు తో మోసం చేయడం జరిగేది అని ఆయన అన్నారు. 

చరిత్ర అంతా పూర్తి మోసం తో నిండి ఉన్నప్పుడు రెండు విషయాలు స్వాభావికం అయిపోతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  వాటిలో ఒకటోది, దశాబ్దాల చరిత లో వెనుకటి ప్రభుత్వాలు వాగ్దానాల పేరిట రైతులను కేవలం మోసం చేశాయి అనేదయితే, రెండోదేమో చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి, అబద్ధాన్ని ప్రచారం లోకి తీసుకురావడమనేది వారికి అనివార్యమైపోయేది.. ఇలాగ ఇదివరకు జరుగుతూ వచ్చింది.   ఎప్పుడయితే మీరు ఈ ప్రభుత్వ ట్రాక్ రికార్డు ను చూస్తారో, అప్పుడు సత్యం తనంతట తాను ముందుకు వచ్చేస్తుంది అని ఆయన అన్నారు.  ప్రభుత్వం యూరియా నల్లబజారు విక్రయాలను ఆపేందుకు వాగ్దానం చేసింది, మరి దానిని చేతలలో చూపించింది, రైతులకు తగినంత గా యూరియా ను అందుబాటు లోకి వచ్చేటట్టుగా చూసింది అని ఆయన చెప్పారు.  ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ను ఆమోదిస్తూ ఒకటిన్నర రెట్లు అధికం గా కనీస మద్దతు ధర ను ఖరారు చేసేందుకు హామీ ని ఇచ్చింది, దీనిని కూడా నెరవేర్చి చూపించింది అని ఆయన అన్నారు.  ఈ వాగ్దానం ఒక్క కాగితాలలోనే పూర్తి కాలేదు, ఇది రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుకొంది అని ఆయన చెప్పారు.    

2014 వ సంవత్సరం కంటే ముందటి ఐదేళ్ళ లో రైతుల నుంచి 6.5 కోట్ల రూపాయల విలువైన పప్పు ధాన్యాలను సేకరించడమైందని ప్రధాన మంత్రి అన్నారు.  ఆ తరువాత 5 సంవత్సరాల కాలంలో, 49,000 కోట్ల రూపాయల విలువైన పప్పు లను రైతుల వద్ద నుంచి సేకరించడం జరిగింది, అంటే దాదాపు గా 75 రెట్లు ఎక్కువగా.  2014 కంటే ముందటి ఐదేళ్ళ లో, 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. కాగా, ఆ తరువాతి 5 సంవత్సరాల కాలం లో మేము 5 లక్షల కోట్ల రూపాయల ధాన్యాన్ని రైతుల నుంచి ఎమ్ఎస్ పి పైన కొనుగోలు చేశాము, ఇది సుమారుగా రెండున్నర రెట్లు అధికం.  ఈ డబ్బు కూడా రైతులకు అందింది.  2014 కంటే ముందటి అయిదు సంవత్సరాలలో 1.5 లక్షల రూపాయల విలువైన గోధుమలను కొనుగోలు చేయడమైంది, మరి ఆ తరువాతి 5 సంవత్సరాలలో 3 లక్షల రూపాయల గోధుమ కొనుగోళ్లు జరిగాయి, అంటే ఇది దాదాపుగా 2 రెట్లు అధికం.  ప్రభుత్వం ఉద్దేశ్యం ఒకవేళ ఎమ్ఎస్ పి , మండీ వ్యవస్థ ను ఆపివేయాలనేదే అయితే ఇంత ఎక్కువ మొత్తాన్ని ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది అని ఆయన అన్నారు.  ప్రభుత్వం మండీలను ఆధునీకరించడానికి కోట్ల కొద్దీ రూపాయలు ఖర్చు చేస్తోంది అని ఆయన నొక్కి చెప్పారు.

ప్రతిపక్షాలను గురించి ప్రధాన మంత్రి విమర్శిస్తూ,  ‘పిఎమ్ కిసాన్ ససమ్మాన్ నిధి’ పై ప్రశ్నలు వేసే వారే వీరు. ఎన్నికల ను దృష్టి లో పెట్టుకొని ఈ డబ్బు ను ఇస్తున్నారని,  ఎన్నికలయిన తరువాత ఇదే డబ్బును వడ్డీ తో సహా తిరిగి వాపసు తీసేసుకోవడం జరుగుతుందంటూ వదంతులను వ్యాపింపచేసే వారు కూడా వీరే అన్నారు.  ఒక రాష్ట్రం లో ప్రతిపక్ష ప్రభుత్వం ఉందని, దాని రాజకీయ స్వార్థాల కారణం గా ఈ పథకం తాలూకు లాభాన్ని రైతులను అందుకోనీయడం లేదు అన్నారు.  ఈ సహాయాన్ని దేశం లోని 10 కోట్లకు పైగా రైతు కుటుంబాల కు నేరు గా బ్యాంకు ఖాతాలలో జమ చేయడం ద్వారా అందించడం జరుగుతోందని ఆయన చెప్పారు.  ఇప్పటివరకు ఇంచుమించు గా ఒక లక్ష కోట్ల రూపాయలు రైతులకు అందాయని ఆయన అన్నారు.

దశాబ్దాల తరబడి దగా కు గురి అయిన రైతు ఇవాళ కూడా భయభీతుడు అవుతున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు. అయితే ఇప్పుడు అన్ని పనులను గంగాజలం ఎంత శుద్ధంగా ఉందో అంత శుద్ధంగా చేయడం జరుగుతోంది అని ఆయన అన్నారు.  ఎవరైతే వారి స్వార్థాలతో భ్రమలను, వదంతులను వ్యాప్తి చేస్తున్నారో, వారి నిజస్వరూపం దేశం ఎదుటకు వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.  ఎప్పుడైతే రైతులు వారి ఈ అబద్ధాన్ని గ్రహిస్తారో అప్పుడు వారు మరేదో అంశాన్ని పట్టుకు వేలాడుతారు, దానిని గురించిన అసత్యాన్ని ప్రచారం లోకి తీసుకు రావడం మొదలుపెడతారు అన్నారు.  ఏ తరహా కు చెందిన అనుమానం గాని లేదా భయం గాని ఉన్న రైతులకు, రైతు కుటుంబాలకు ప్రభుత్వం నిరంతరం జవాబు ఇస్తోంది అని ఆయన చెప్పారు.  ఏ రైతులకు కొత్త వ్యవసాయ సంస్కరణల విషయంలో ఏ కాస్త అనుమానం ఈ రోజు న ఉన్నప్పటికీ వారు భవిష్యత్తు లో ఇవే వ్యవసాయ సంస్కరణల తో ప్రయోజనాన్ని పొందుతారని, వారి ఆదాయం లో వృద్ధి చోటు చేసుకోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.


***



(Release ID: 1677246) Visitor Counter : 202