ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 30వ తేదీన వారణాసి పర్యటనలో భాగంగా, ఎన్.హెచ్-19 లోని వారణాసినవంబర్ 30వ తేదీన వారణాసి పర్యటనలో భాగంగా, ఎన్.హెచ్-19 లోని వారణాసి - ప్రయాగ్ రాజ్ విభాగానికి చెందిన ఆరు లైన్ల వెడల్పు రహదారి ప్రాజెక్టును ప్రారంభించనున్న - ప్రధానమంత్రి - ప్రయాగ్ రాజ్ విభాగానికి చెందిన ఆరు లైన్ల వెడల్పు రహదారి ప్రాజెక్టును ప్రారంభించనున్న - ప్రధానమంత్రి
దేవ్ దీపావళిని వీక్షించడంతో పాటు, శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయ కారిడార్ ప్రాజెక్టు ప్రదేశాన్ని కూడా సందర్శించనున్న - ప్రధానమంత్రి
Posted On:
28 NOV 2020 8:38PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 నవంబర్, 30వ తేదీన వారణాసిలో పర్యటించనున్నారు. జాతీయ రహదారి - 19 లోని హండియా (ప్రయాగ్ రాజ్) - రాజతలాబ్ (వారణాసి) విభాగానికి చెందిన ఆరు లైన్ల వెడల్పు ప్రాజెక్టును ప్రధానమంత్రి ఈ సందర్భంగా దేశానికి అంకితం చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా, దేవ్ దీపావళి ఉత్సవాన్ని ప్రధానమంత్రి వీక్షిస్తారు. కాశీ విశ్వనాథ్ దేవాలయ కారిడార్ ప్రాజెక్టు ప్రదేశాన్ని, సారనాథ్ పురావస్తు ప్రదేశాన్ని కూడా ఆయన సందర్శిస్తారు.
మొత్తం 2,447 కోట్ల రూపాయల వ్యయంతో, కొత్తగా ఆరు లైన్లతో వెడల్పు చేసిన ఎన్.హెచ్-19 కు చెందిన 73 కిలోమీటర్ల పొడవైన రహదారి ప్రయాగ్ రాజ్ మరియు వారణాసి మధ్య ప్రయాణ సమయాన్ని ఒక గంట తగ్గిస్తుంది.
వారణాసిలో, ప్రతీ ఏడాదీ కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే, దేవ్ దీపావళి ఉత్సవం, దీపాలతో, ఉత్సాహంగా జరుపుకునే ప్రపంచ ప్రఖ్యాతి పండువగా పేరుగాంచింది. వారణాసిలోని రాజ్ ఘాట్‌లో దియా వెలిగించి ప్రధానమంత్రి, ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. అనంతరం, గంగా నదికి ఇరువైపులా ప్రజలు దాదాపు 11 లక్షల దీపాలను వెలిగిస్తారు.
నిర్మాణంలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయ కారిడార్ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించడానికి ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. సారనాథ్ పురావస్తు ప్రదేశంలో, ఈ నెల ఆరంభంలో, తాను ప్రారంభించిన, "లైట్ అండ్ సౌండ్ షో" ను కూడా ప్రధానమంత్రి, ఈ పర్యటనలో భాగంగా వీక్షించనున్నారు.
*****
(Release ID: 1676956)
Visitor Counter : 218
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam