ప్రధాన మంత్రి కార్యాలయం
మూడు నగరాల్లో కొనసాగుతున్న వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియలను సమీక్షించిన - ప్రధానమంత్రి
Posted On:
28 NOV 2020 7:17PM by PIB Hyderabad
వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియలపై విస్తృతమైన సమీక్ష నిర్వహించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు మూడు నగరాల్లో పర్యటించారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కు, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలను ఆయన సందర్శించారు.
టీకా అభివృద్ధి ప్రయాణంలో ఈ క్లిష్టమైన దశలో తమ ధైర్యాన్ని పెంచడానికీ, ప్రయత్నాలను వేగవంతం చేయడానికీ, ప్రధానమంత్రి తమను ముఖాముఖిగా కలుసుకున్నందుకు, శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశంలో, స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ, ఇంత వేగంగా పురోగమిస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం చేపట్టిన మొత్తం ప్రక్రియలో భారతదేశం విజ్ఞానశాస్త్రంలోని మంచి సూత్రాలను ఎలా అనుసరిస్తోందనే విషయంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ, టీకా పంపిణీ ప్రక్రియను మెరుగ్గా నిర్వహించడానికి తగిన సూచనలు చేయవలసిందిగా శాస్త్రవేత్తలను కోరారు.
టీకాలను మంచి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ప్రపంచ మంచిగా కూడా భారతదేశం పరిగణిస్తుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. వైరస్ కు వ్యతిరేకంగా సమిష్టి పోరాటంలో మన పొరుగు దేశాలతో సహా ఇతర దేశాలకు కూడా సహాయం చేయడం భారతదేశం యొక్క విధి అని ఆయన చెప్పారు.
దేశం తన నియంత్రణ ప్రక్రియను ఎలా మెరుగుపరుస్తుందనే దానిపై వారి స్వేచ్ఛాయుతమైన మరియు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు. కోవిడ్-19 తో పోరాడటానికి వీలుగా వివిధ కొత్త మరియు పునర్నిర్మించిన ఔషధాలను ఎలా అభివృద్ధి చేస్తున్నారనే దానిపై శాస్త్రవేత్తలు ఒక అవలోకనాన్ని కూడా సమర్పించారు.
అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించిన అనంతరం, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న డి.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించాను. ఈ ప్రయత్నం వెనుక పనిచేస్తున్న బృందం కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయాణంలో వారికి మద్దతుగా భారత ప్రభుత్వం వారితో పాటు కలిసి చురుకుగా పనిచేస్తోంది." అని పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సదుపాయాన్ని సందర్శించిన అనంతరం, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ వద్ద, వారి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి అక్కడ శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు. వారి బృందం వేగవంతమైన పురోగతిని సాధించేందుకు ఐ.సి.ఎం.ఆర్. తో కలిసి పనిచేస్తోంది." అని పేర్కొన్నారు.
పూణేలోని సీరం సంస్థను సందర్శించిన అనంతరం, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలోని శాస్త్రవేత్తల బృందంతో మంచి సంభాషణ జరిగింది. టీకా తయారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి వారు పాటిస్తున్న ప్రణాళికల వివరాలనూ, దానిపై వారు ఇప్పటివరకు సాధించిన పురోగతి వివరాలనూ శాస్త్రవేత్తలు తెలియజేశారు. వారి తయారీ సదుపాయాలను కూడా పరిశీలించాను.” అని పేర్కొన్నారు.
*****
(Release ID: 1676871)
Visitor Counter : 242
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam