హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ నిఘా, నియంత్రణ, అప్రమత్తత మీద హోంశాఖ మార్గదర్శకాలు

కోవిడ్ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం

ప్రామాణిక విధానాల అమలు, గుంపుల నిరోధం మీద దృష్టిపెట్టాలని సూచన

Posted On: 25 NOV 2020 4:03PM by PIB Hyderabad

కోవిడ్ కట్టడి దిశలో అనుసరించాల్సిన మార్గదర్శకాలతో హోం మంత్రిత్వశాఖ తాజా ఆదేశాలు జారీచేసింది. నిఘా, నియంత్రణ, అప్రమత్తత కోసం ఈ మార్గదర్శకాలు 2020 డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉంటాయి.  

ఈ మార్గదర్శకాలు ప్రధానంగా ఇప్పటివరకు చేపట్టిన కోవిడ్ నియంత్రణ చర్యల ఫలితాలు అదే విధంగా కొనసాగేట్టు చూడటానికి ఉద్దేశించినవి. ఈ మధ్య కాలంలో కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పండుగల సీజన్ లో అలసత్వం కారణంగా మళ్లీ విజృంభిస్తున్నట్టు తెలిసి ఈ మార్గదర్శకాలను జారీచేసింది.  ఇప్పుడు శీతాకాలం కూడా రావటం, మళ్లీ పండుగల సీజన్ వస్తుండటం కారణంగా  పూర్తిగా ఈ మహమ్మారి నుంచి బైటపడటానికి జాగ్రత్తలు అవసరమని హోం మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. హోంమంత్రిత్వశాఖ, వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ, స్థానిక అధికారులు, పోలీసులు జారీ చెసిన నియంత్రణ వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేయటం, నిఘా పెంచటం, మార్గదర్శకాలను, ప్రామాణిక నిర్వహణా నియమాలను పాటించటం ద్వారా ఎదుర్కోవాలని కోరింది.  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా  కోవిడ్ నియంత్రణకు మరికొన్ని ఆంక్షలు విధించవచ్చునని కూడా కేంద్రం తెలియజేసింది.   

నిఘా, నియంత్రణ

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలి అక్కడి జిల్లా ఆధికారుల చేత కంటెయిన్మెంట్ జోన్ల పరిధులు కచ్చితంగా గుర్తించేట్టు చూడాలి.  ఈ విషయంలో ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించాలి.  ఆయా రాష్ట్రాలలో జిల్లా కలెక్టర్లు కంటెయిన్మెంట్ జోన్ల వివరాలను వెబ్ సైట్ లో ప్రదర్శించాలి. ఆ జాబితాను కేంద్ర  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కూడా పంపాలి.  

కంటెయిన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర కార్యకలాపాలు మాత్రమే అనుమతించాలి. 

 

కంటెయిన్మెంట్ జోన్ల పరిధిలో ఆంక్షలు కచ్చితంగా అమలు చేయాలి. ఈ జోన్ల నుమ్చి ప్రజలు బైటికి వెళ్ళటం లేదా లోపలికి రావటాన్ని పూర్తిగా నియంత్రించాలి. నిత్యావసరాలు, వైద్య అవసరాలకు మాత్రమే అనుమతించాలి. 

నిఘా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్ళి పరిశీలించేలా చూడాల.

అవసరాన్ని బట్టి నిర్థారణ పరీక్షలు జరపాలి  

పాజిటివ్ గా తేలిన వ్యక్తులు ఎవరెవరికి దగ్గరగా వెళ్లాలో ఆ జాబితా కచ్చితంగా తయారు చేయాలి. అదే సమయంలో ఆచూకీ కనిపెట్టటం, గుర్తించినవారిని క్వారంటైన్ లో ఉంచటం, 14 రోజులపాటు వరుసగా వారిని పర్యవేక్షించటం తప్పనిసరి.  సోకే అవకాశమున్నవారిలో కనీసం 80 శాతం మందిని 72 గంటలలోగా ఆచూకీ పట్టుకోవాలి.  

వెంటనే ఐసొలేషన్ కు తరలించటం, లేదా ఆస్పత్రికి తరలించటం జరిగిపోవాలి. ఇళ్ళలో కచ్చితంగా ఐసొళేషన్ మార్గదర్శకాలు పాటించాలి. 

అవసరమైన మేరకు చికిత్సాపద్ధతులు కచ్చితంగా పాటించేట్టు చూడాలి. 

 శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారికి  ఆరోగ్య కేంద్రాలలో లేదా మొబైల్ సేవల ద్వారా లేదా బఫర్ జోన్లలో ఉన్న జ్వర చికిత్సాకేంద్రాల ద్వారా  చికిత్స అందేట్టు చూడాలి.

కోవిడ్ నియంత్రణకు అవసరమైన ప్రవర్తన గురించి స్థానిక ప్రజలలో తగినంత అవగాహన కలిగించాలి.

కంటెయిన్మెంట్ చర్యలను కఠినంగా అమలు చేయటంలో స్థానిక జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆ అధికారులను బాధ్యులను చేయాలి.

కోవిడ్ నియంత్రణా ప్రవర్తన

కోవిడ్ నియంత్రణకు తగిన ప్రవర్తన అమలు చేయటానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. అందులో భాగంగా మాస్కులు ధరించటాన్ని, చేతుల పరిశుభ్రతను కచ్చితంగా అమలు చేయాలి. అవసరమనిపించినప్పుడు పాలనాపరమైన చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించిన వ్యక్తులకు  జరిమానా విధించటాన్ని కూడా పరిశీలించవచ్చు..

రద్దీ ప్రదేశాలలో ముఖ్యంగా మార్కెట్లు, వారాంతపు సంతలలో, ప్రజారవాణా కేంద్రాలలో భౌతిక దూరం పాటించటానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడిగా ప్రామాణిక ఆచరణావిధానాలను జారీ చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిని తప్పనిసరిగా పాటించాలి.  

కోవిడ్ 19 నిర్వహణకు సంబంధించిన జాతీయ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా యధావిధిగా కొనసాగుతాయి. ప్పుడే కోవిడ్ నియంత్రణకు తగిన  ప్రవర్తన  అమలు సాధ్యమవుతుంది. 

 నిర్ణీత ప్రామాణిక ఆచరణ విధానాలకు కట్టుబడి ఉండటం

కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఆమోదం ఉంది. అయితే, దిగువ పేర్కొన్న అంశాలకు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతి ఉంటుంది:

హోం మంత్రిత్వశాఖ అనుమతి మేరకు అంతర్జాతీయ ప్రయాణానికి ఆమోదం

50% సామర్థ్యం వరకు సినిమా థియేటర్లకు అనుమతి 

ఈత కొలనులు కేవలం క్రీడాకారులకు మాత్రమే అనుమతి

వ్యాపారులకోసం మాత్రమే ఎగ్జిబిషన్ హాల్స్ (బి2బి)

గరిష్ఠ పరిమితి 200 కు లోబడి హాల్ సామర్థ్యంలో 50% మాత్రమే అనుమతిస్తూ సామాజిక, మతపరమైన, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి: బహిరంగ ప్రదేశాలైతే ఆ ప్రాంగణం వైశాల్యాన్ని బట్టి అనుమతి   

అయితే, పరిస్థితిని అంచనావేసిన మీదట అక్కడి  రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంతం హాళ్లలో  గరిష్ఠ పరిమితిని 100 మందికి, లేదా అంతకంటే తక్కువకు కుదించవచ్చు.

అందరి సమాచారం నిమిత్తం ఈ మార్గదర్శకాలకు  గతంలో సందర్భానుసారం జారీచేసిన 19 ప్రామాణిక ఆచరణ విధానాలను, అనుమతించిన కార్యకలాపాలను జోడించటమైనది. సంబంధిత అధికారులు  వీటిని కచ్చితంగా అమలు చేయాలి.

స్థానిక ఆంక్షలు

స్థానిక పరిస్థితిని అంచనా వేసిన మీదట రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం  రాత్రిపూట కర్ఫ్యూ లాంటి  కొన్ని ఆంక్షలు విధించవచ్చు.  అయితే,  కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల స్థానికంగా లాక్ డౌన్ మాత్రం విధించకూడదు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమపరిధిలోని కార్యాలయాలలో భౌతిక దూరం పాటించే నిబంధనలు అమలు చేయాలి. వారం వారం పాజిటివ్ ల శాతం 10 శాతాన్ని మించి ఉంటున్నట్టు తేలిన నగరాలలో కార్యాలయాల సమయాలను విడి విడిగా మార్చి అమలు చేయటం తదితర చర్యల అమలును పరిశీలించాలి.కే సమయంలో హాజరయ్యే ఉద్యోగుల సంఖ్య కనీస స్థాయిలో ఉండేట్టు చూసుకోవటం ద్వాతా భౌతిక దూరాన్ని అమలు చేయాలి.

రాష్ట్రం లోపల, అంతర్రాష్ట్ర కదలికలపై ఆంక్షలు లేవు

రాష్ట్రం లోపలగాని, రాష్ట్రాల మధ్య గాని వ్యక్తుల రాకపోకలకు, సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విదేశీ సరకు రవాణాకు న్కూడా ఈ సడలింపు అమలులో ఉంటుంది.  ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు గాని, ఈ-పాస్ లు గాని అవసరం లేదు. 

వ్యాధిబారిన పడే అవకాశమున్నవారి రక్షణ 

వ్యాధి బారిన పడే అవకాశమున్నవారు- అంటే 65 ఏళ్ల వయసు పైబడినవారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇళ్ళలోనే ఉండిపోవటం మంచిది. మరీ ముఖ్యమైన పనులు, ఆరోగ్య అవసరాలకు మాత్రమే ఇళ్లు వదలాలి. 

ఆరోగ్య సేతు వాడకం

ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వాడకాన్ని ఎప్పటిలాగే ప్రోత్సహించటం కొనసాగుతుంది.    

****



(Release ID: 1675690) Visitor Counter : 263