ప్రధాన మంత్రి కార్యాలయం

నివార్ తుఫాను నేప‌థ్యంలో ఉత్ప‌న్న‌మైన స్థితిపై త‌మిళ నాడు, పుదుచ్చేరీ ల ముఖ్య‌మంత్రుల‌ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 24 NOV 2020 11:10AM by PIB Hyderabad

నివార్ తుఫాను ఫలితంగా తలెత్తిన స్థితి పై తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ. కె. పళనిస్వామి తో, పుదుచ్చేరీ ముఖ్య‌మంత్రి శ్రీ వి. నారాయ‌ణ‌సామి తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.  

‘‘నివార్ తుఫాను ఫలితంగా త‌లెత్తిన స్థితి పై త‌మిళ‌ నాడు ముఖ్య‌మంత్రి శ్రీ @EPSTamilNadu తోను, పుదుచ్చేరీ ముఖ్య‌మంత్రి శ్రీ @VNarayanasami తోను మాట్లాడాను. కేంద్రం త‌ర‌ఫు నుంచి సాధ్య‌మైన అన్ని విధాలుగా సాయపడతామంటూ హామీని ఇచ్చాను.  ప్ర‌భావిత ప్రాంతాల‌లో నివ‌సించే వారు భద్రంగా, క్షేమంగా ఉండాల‌ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ట్విట‌ర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

*** 


(Release ID: 1675236) Visitor Counter : 178