జల శక్తి మంత్రిత్వ శాఖ

రేపు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం :

ఉత్తమ జిల్లాలకు స్వచ్ఛతా పురస్కారాలు

Posted On: 18 NOV 2020 5:59PM by PIB Hyderabad

https://sbm.gov.in/sbmreport/images/logoSBM.png

జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం రేపు (నవంబర్ 19న) ప్రపంచ టాయిలెట్ దినోత్సవం జరపబోతున్నది. స్వచ్ఛత దిశగా అడుగులేస్తూ సురక్షితమైన పారిశుద్ధ్యం, పట్ల అవగాహన కల్పించటంలో విజయవంతమైన జిల్లాలు/రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ  స్వచ్ఛ భారత్ మిషన్- గ్రామీణ్ కింద ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

కేంద్ర జల శక్తి శాఖామంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ తో బాటు సహాయ మంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా ఈ సందర్భంగా జిల్లాలు/రాష్ట్రాలను స్వచ్ఛతా పురస్కారాలతో సత్కరించబోతున్నారు. ఇప్పుడున్న కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ వేదికల ద్వారా అనుసంధానం అవుతూ ఈ కార్యక్రమం జరుపుతున్నారు. 

2014-19 మధ్య సాధించిన మొదటి దశ పురోగతిని సుస్థిరం చేస్తూ ఈ ఏడాది ఆరంభంలో రెండో దశ కింద  స్వచ్ఛ భారత్ మిషన్- గ్రామీణ్ ను చేపట్టారు. ఈ రెండో దశలో  ఘన, ద్రవ రూప వ్యర్థాల నిర్వహణ మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సాముదాయక పారిశుద్ధ్య  భవన నిర్మాణాల మీద దృష్టి పెట్టి ప్రచారోద్యమం నిర్వహించారు. అందులో స్వచ్ఛ సుందర సాముదాయక మరుగుదొడ్లకు,  సాముదాయక మరుగుదొడ్ల పథకానికి ప్రాధాన్యమిచ్చారు. 

 

*****


(Release ID: 1673887) Visitor Counter : 122