ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో వరుసగా 37వరోజు కొత్త కేసులకంటే కోలుకున్నవారే అధికం
తగ్గుదలబాటలో రోజువారీ పాజిటివ్ కే సులు, మరణాలు
Posted On:
09 NOV 2020 11:00AM by PIB Hyderabad
వరుసగా రెండో రోజు కూడా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 50 వేల లోపే ఉన్నాయి. గడిచిన 24 గంటలలో 45,903 మంది కోవిడ్ పాజిటివ్ గా నమోదయ్యారు. కోవిడ్ ను గుర్తెరిగి అనుసరించాల్సిన ప్రవర్తనగురించి ప్రజలలో చైతన్యం తెచ్చే ’జన్ ఆందోళన్’ తగిన ఫలితాలనిస్తున్నట్టు రుజువు చేస్తూ రోజువారీ కొత్త కేసులు తగ్గుదలబాటలో సాగుతున్నాయి. అదే విధంగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్న ధోరణి వరుసగా 37వ రోజు కూడా కొనసాగింది. గడిచిన 24 గంటలలో 48,405 మంది కోలుకున్నారు.
చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది. భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 5.09 లక్షలు. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో5.95% మాత్రమే. ప్రస్తుతం కోవిడ్ చికిత్సపొందుతూ ఉన్న వారు దేశవ్యాప్తంగా 5,09,673 మంది ఉన్నారు.
కోలుకుంటున్నవారి సంఖ్య పెరగటంతోబాటు కోలుకుంటున్న శాతం కూడా ఎక్కువైంది. కొత్తకేసులకంటే ఎక్కువమంది కోలుకోవటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం కోలుకున్నశాతం 92.65% కాగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 79,17,373. కోలుకున్నవారికీ, ఇంకా చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 74,07,700 గా నమోదైంది.
కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నకొద్దీ భారత్ లో మొత్తం కోవిడ్ కేసుల ఎదుగుదల కూడా మందగించింది. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పరీక్షల పెంపు పట్ల పట్టుదలతో ఉండటం, రాష్ట్రాలు అందుకు అనుగుణంగా సహకరిస్తూ ఉండటం వలన పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మొత్తం పరీక్షలలో పాజిటివిటీ ఈరోజు 7.19% కి తగ్గింది.
కొత్తగా కోలుకున్నవారిలో 79% మంది కేవలం 10 రాష్టాలలోనే కేంద్రీకృతమైనట్టు వెల్లడైంది. కేరళలో అత్యధికంగా ఒకేరోజు 8232 మంది కొలుకున్నారు. 6853 మంది కోలుకున్న మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.
కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 79% మంది 10రాష్ట్రాలలో నమోదుకాగా, ఢిల్లీలో నిన్న అత్యధికంగా 7745 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తరువాత 5585 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోను, 5585 కేసులతో కేరళ మూడో స్థానంలోను ఉన్నాయి.
గత 24 గంటలలో 490 మంది కోవిడ్ కారణంగా మరణించారు. అయితే, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 500 కంటే తక్కువ మరణాలు వరుసగా నమోదవుతున్నాయి.
ఈ 490 మరణాలలో దాదాపు 81% మరణాలు 10 రాష్ట్రాలలోనే సంభవించాయి. గత 24 గంటలలో నమోదైన మరణాలలో నాలుగో వంతుకు పైగా (25.51%) కేవలం మహారాష్ట్రలోనే (125 మరణాలు) నమోదయ్యాయి. ఢిల్లీలో 77 మంది, పశ్చిమ బెంగాల్ లో 59 మంది మరణించారు.
****
(Release ID: 1671369)
Visitor Counter : 227
Read this release in:
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam