రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఓఆర్‌ఓపీ అమలు చారిత్రక నిర్ణయానికి ఐదేళ్లు; 20,60,220 మంది రక్షణ శాఖ పింఛనుదారులు/కుటుంబ పింఛనుదారులకు రూ.42,740 కోట్లకు పైగా చెల్లింపులు

Posted On: 06 NOV 2020 3:45PM by PIB Hyderabad

సరిగ్గా ఐదేళ్ల క్రితం, "వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌" (ఓఆర్‌ఓపీ) అమలుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, దాని అమలుకు 07.11.2015న ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా భారీ భారమైనా, విశ్రాంత భద్రత బలగాల సంక్షేమానికి కట్టుబడి 01.07.2014 నుంచే ప్రయోజనాలు వర్తింపజేసింది. 30.06.2014 వరకు ఉద్యోగ విరమణ చేసిన భద్రత బలగాల సిబ్బందిని ఈ ప్రయోజనాల పరిధిలోకి కేంద్రం తెచ్చింది. ఈ తరహా పింఛను పరిమాణం, సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకుని, నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఓఆర్‌ఓపీ అమలు ఉత్తర్వులు జారీ చేసింది.

    ఓఆర్‌ఓపీ కోసం రక్షణ శాఖ విశ్రాంత ఉద్యోగులు 45 ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా, 2015కు ముందు వరకు అమల్లోకి రాలేదు.

    ఓఆర్‌ఓపీ ప్రకారం; ఉద్యోగ విరమణ తేదీతో సంబంధం లేకుండా, ఒకే ర్యాంకులో, ఒకే కాలానుభవంతో ఉద్యోగ విరమణ చేసినవారందరికీ ఏకతరహా పింఛను అందుతుంది. ఆ విధంగా; ప్రస్తుతం, గతంలో ఉద్యోగ విరమణ చేసినవారి పింఛను శాతాల మధ్య ఉన్న అంతరాన్ని ఓఆర్‌ఓపీ క్రమంగా తగ్గిస్తోంది. 

    ఓఆర్‌ఓపీ అమల్లో భాగంగా, 20,60,220 మంది భద్రత బలగాల పింఛనుదారులు/కుటుంబ పింఛనుదారులకు ఎరియర్స్‌ కింద రూ.10,795.4 కోట్లను కేంద్రం చెల్లించింది. ఓఆర్‌ఓపీ కింద ఏటా చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.7,123.38 కోట్లు. 01.07.2014 నుంచి ఈ ఆరేళ్లలో జరిపిన చెల్లింపులు దాదాపు రూ.42,740.28 కోట్లు.

    7వ వేతన సంఘం సిఫారసు కింద, 2.57 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకారం కూడా ఓఆర్‌ఓపీ లబ్ధిదారులు ప్రయోజనం పొందారు.

ఓఆర్‌ఓపీ ఎరియర్స్‌ కింద, 11.10.2019 వరకు వరకు విడుదల చేసిన మొత్తం రాష్ట్రాలవారీగా: 

***(Release ID: 1670702) Visitor Counter : 195