పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఇంధనంగా ఎల్ ఎన్‌జికి గల లాభాల గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రచారోద్యమాన్ని ప్రారంభించాలని పిలుపిచ్చిన ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
06 NOV 2020 2:24PM by PIB Hyderabad
ద్రవీకృత సహజవాయువు (ఎల్ ఎన్‌జి) రంగంలో వివిధ భాగస్వాములంతా కూడా ఈ ఇంధనం వల్ల కలిగే లబ్ధి గురించి ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు పని చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం పిలుపిచ్చారు. రవాణా ఇంధనంగా ఎల్ ఎన్‌జి అనే అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రసంగిస్తూ, ఎల్ ఎన్‌జి భవిష్యత్ ఇంధనం అని, ఇతర ఇంధనాల కన్నా ఖర్చు ప్రయోజనం, ఇతర లాభాలను నిర్ధిష్ట రూపంలో, దూకుడుతో సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఎల్ ఎన్‌జి తక్కువ ఖరీదు అన్న ఈ సందేశం ప్రజలను సరైన రీతిలో చేరితే, అది భారీ సంఖ్యలో వినియోగదారులను ఆకర్షిస్తుందని అన్నారు.
ఎల్ ఎన్‌జి సమృద్ధిగా అందుబాటులో ఉందని, దాని వృద్ధికి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని, ప్రధాన్ చెప్పారు. ఎంపిక చేసిన ఇంధనంగా ఎల్ ఎన్‌జి అన్న అంశాన్ని ప్రోత్సహించే అవకాశాన్ని త్వరితగతిన అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఎల్ ఎన్‌జి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి, ఆర్ధికంగా కలిగే లాభాలు, అనుకూలత వంటివాటిని పట్టి చూపాలన్నారు.
దేశాన్ని వాయువు ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా దేశాన్ని నడిపించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, వాయువుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు - అడంగులు, పైప్ లైన్లు, స్టేషన్లు, సిజిడి నెట్ వర్్క, వంటివాటిలో భారీ పెట్టుబడులు పెడుతోందని, ఎల్ ఎన్ జి ఇందులో ముఖ్య భాగమని మంత్రి చెప్పారు. భారత్‌ను వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పరివర్తన చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను సాధించడం పై దృష్టిపెట్టి, ఈ పరివర్తనకు అవసరమైన మద్దతును అందిస్తున్నామని చెప్పారు.
సబ్సిడీ ఆధారిత నమూనా నుంచి బయిటకు వచ్చి, భారీ స్థాయి కార్యకలాపాల ద్వారా ఎల్ ఎన్‌జి వాణిజ్య సాధ్యతపై దృష్టి పెట్టాలని మంత్రి పరిశ్రమకు ఉద్బోధించారు. ఎల్ ఎన్‌జిని జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడమన్న అంశంపై మాట్లాడుతూ, అది చాలా నిజమైన డిమాండ్ అని, త్వరలోనే దీనిపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశముందని చెప్పారు. భారత్‌లో ఎల్ ఎన్‌జి మార్కెట్లను విస్తరించేందుకు ఎల్ ఎన్‌జి రంగానికి సంబంధించిన నిర్దిష్ట అవసరాలను గుర్తించవలసిందిగా ఆయన పరిశ్రమను కోరారు. వాయువు విలువ ఆధార లంకెలోని వాహనాల యజమానులకు, వాహన ఉత్పత్తిదారులు, వాటాదారులను సృష్టించడమే కాక, మంచి వాతావరణాన్ని సృష్టించడం సాధ్యమవుతుందని చెప్పారు.
ఈ వెబినార్‌లో పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ కూడా ప్రసంగించారు. ఎల్ ఎన్‌జి వినియోగం విషయంలో ప్రపంచంలోనే భారీ మార్పు వచ్చిందని, ఈ ఇంధనం అత్యధిక వత్తిడిలో, తక్కువ ఉష్ణోగ్రతలో సుదూర ప్రాంతాలకు రవాణా చేయవచ్చని, తద్వారా పైప్ లైన్లు వేయాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. గెయిల్ (GAIL), పేలుడు పదార్ధాల కంట్రోలర్, ఎస్ ఐఎఎంకు చెందిన సీనియర్ అధికారులు, ఆటోమొబబైల్ కంపెనీల ప్రతినిధులు, ఇతర భాగస్వాములు కూడా వెబినార్ లోతమ అభిప్రాయాలను వెల్లడించారు.
***
(Release ID: 1670654)
Visitor Counter : 135