చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

గౌహతి హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ మేధి, జస్టిస్‌ నాని తగియా, జస్టిస్‌ మనీష్‌ చౌధురి నియామకం

నాడు పోస్టు చేయడమైనది: 06 NOV 2020 1:29PM by PIB Hyderabad

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 217, క్లాజ్‌ (I) ద్వారా సంక్రమించిన అధికారం ప్రకారం, గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ మేధి, జస్టిస్‌ నాని తగియా, జస్టిస్‌ మనీష్‌ చౌధురిని అదే న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఈ నియామకాలపై, చట్ట&న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ విభాగం రెండు ప్రకటనలు 'కె-13018/02/2020-యూఎస్ 11‌', 'కె-13018/03/2020-యూఎస్ 11' ను గురువారం విడుదల చేసింది. 

***


(రిలీజ్ ఐడి: 1670603) సందర్శకుల సూచీ సంఖ్య : : 159
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Tamil