ప్రధాన మంత్రి కార్యాలయం

అహ‌మ‌దాబాద్ లో గోదాములో మంట‌ల కార‌ణంగా ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌డం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 04 NOV 2020 5:23PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అహ‌మ‌దాబాద్ లోని ఒక గోదాములో అగ్నిప్ర‌మాదం చెల‌రేగి, ప్రాణన‌ష్టం వాటిల్లినందుకు బాధ‌ను వ్య‌క్తం చేశారు.

‘‘అహ‌మ‌దాబాద్ లోని ఒక గోదాములో మంట‌లు చెలరేగి ప్రాణ‌న‌ష్టం జ‌రిగింద‌ని తెలిసి నేను ఎంతో బాధ‌ప‌డ్డాను.  ఆప్తుల‌ను కోల్పోయిన కుటుంబ‌ స‌భ్యుల‌కు ఇదే నా సంతాపం.  ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌ వారు త్వరగా కోలుకోవాల‌ని నేను ప్రార్థిస్తున్నాను.  బాధితుల‌కు అధికారులు చేత‌నైన అన్ని ర‌కాలుగాను సాయాన్ని అందిస్తున్నారు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

***
 


(Release ID: 1670131)