మంత్రిమండలి
చికిత్స ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారం అంశంపై భారతదేశానికి, యునైటెడ్ కింగ్ డమ్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
04 NOV 2020 3:33PM by PIB Hyderabad
చికిత్స ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారం అంశంపై భారతదేశానికి చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) కు, యునైటెడ్ కింగ్ డమ్ మెడిసిన్స్ ఎండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ స్ రెగ్యులేటరీ ఏజెన్సీ కి (యుకె ఎమ్‌హెచ్‌ఆర్ఎ) మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ రెండు సంస్థలు అంటే, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) కు, యునైటెడ్ కింగ్ డమ్ మెడిసిన్స్ ఎండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ స్ రెగ్యులేటరీ ఏజెన్సీ కి (యుకెఎమ్‌హెచ్‌ఆర్ఎ) మధ్య- చికిత్స ఉత్పత్తుల నియంత్రణ కు సంబంధించిన అంశాలలో వాటి అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా- ఫలప్రద సహకారానికి, సంబంధిత సమాచారాన్ని ఒక పక్షానికి రెండో పక్షం ఇచ్చి పుచ్చుకొనేందుకు ఉద్దేశించిన ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటుచేసేందుకు ఈ ఎమ్ఒయు సాయపడనుంది.
ఈ రెండు నియంత్రణాధికార సంస్థల మధ్య సహకారం ప్రధానంగా ఈ కింద ప్రస్తావించిన రంగాల్లో చోటుచేసుకోనుంది:
ఎ) ఫార్మా రంగంలో నిఘా (ఫార్మాకోవిజిలెన్స్) సహా సురక్ష కు సంబంధించిన సమాచారాన్ని- మరీ ముఖ్యంగా రెండో పక్షానికి బాగా కావలసిన సమాచారాన్ని- అవతలి పక్షం అందజేయడం; దీనిలో- మందులకు, చికిత్స ఉపకరణాలకు సంబంధించిన సురక్ష పరమైన అంశాలు కూడా భాగంగా ఉంటాయి.
బి) భారతదేశం, యునైటెడ్ కింగ్ డమ్ లు ఏర్పాటు చేసే విజ్ఞానశాస్త్ర సమావేశాలు, అభ్యాస ప్రధాన సమ్మేళనాలు, సదస్సులు, చర్చా సభల లో ఇరు పక్షాలు పాలుపంచుకోవడం.
సి) మంచి ప్రయోగశాల అభ్యాసాలు (జిఎల్‌పి), మంచి రోగచికిత్స సంబంధిత అభ్యాసాలు (జిసిపి), మంచి తయారీపరమైన అభ్యాసాలు (జిఎమ్ పి), మంచి పంపిణీ సంబంధమైన అభ్యాసాలు (జిడిపి), మంచి ఫార్మాకోవిజిలెన్స్ అభ్యాసాలు (జిపివిపి).. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, సహకరించుకోవడం.
డి) రెండు పక్షాలకు అంగీకారం కుదిరిన రంగాల్లో సామర్ధ్య నిర్మాణం.
ఇ) ఉభయ పక్షాల నియంత్రణ సంబంధిత ఫ్రేమ్ వర్క్, ప్రక్రియలు, అవసరాల వంటి అంశాల్లో అవగాహనను పెంపొందించుకోవడం; రాబోయే కాలంలో నియంత్రణ సంబంధ కార్యక్రమాలను పటిష్టపర్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం.
ఎఫ్) మందులు, చికిత్స ఉపకరణాల విషయంలో చట్టాల, నియమ నిబంధనల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం.
జి) లైసెన్స్ లేని ఎగుమతులు, దిగుమతుల పై నియంత్రణ కు దోహదపడే సమాచారాన్ని ఒక పక్షానికి రెండో పక్షం ఇచ్చి పుచ్చుకోవడం.
హెచ్) అంతర్జాతీయ వేదికలపై సమన్వయంతో పనిచేయడం.
ఈ అవగాహనపూర్వక ఒప్పందం రెండు పక్షాల మధ్య నియంత్రణ పరమైన అంశాల్లో మెరుగైన అవగాహనకు దోహదపడనుంది. అంతేకాక చికిత్స ఉత్పత్తుల నియంత్రణ రంగం లో, అంతర్జాతీయ వేదికల లో చక్కని సమన్వయాన్ని ఏర్పరచడంలో కూడా తోడ్పడుతుంది.
***
(Release ID: 1670125)
Visitor Counter : 257
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam