విద్యుత్తు మంత్రిత్వ శాఖ

లుహ్రీ మొదటి దశ 210 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి రూ.1810 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం

Posted On: 04 NOV 2020 3:35PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ .1810.56 కోట్లు పెట్టుబడితో 210 మెగావాట్ల లుహ్రి స్టేజ్ -1 జల విద్యుత్ ప్రాజెక్టుకు  ఆమోదం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ సట్లజ్ నదిపై ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏటా 758.20 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 

ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ క్రియాశీల సహకారంతో బిల్డ్-ఓన్-ఆపరేట్-మెయింటైన్ (బూమ్) ప్రాతిపదికన సట్లజ్ జల్ విద్యా నిగమ్ లిమిటెడ్ (ఎస్జెవిఎన్ఎల్) అమలు చేస్తోంది. దీనిని 7 నవంబర్ 2019 న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ సందర్బంగా ప్రభుత్వం ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు రూ.66.19 కోట్లు విద్యుత్ సుంకాన్ని తగ్గించడంలో మౌలిక సదుపాయాలను అందించనున్నది. 

లుహ్రి స్టేజ్ -1 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 62 నెలల వ్యవధిలో ప్రారంభం అవుతుంది. ప్రాజెక్ట్ నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్ గ్రిడ్ స్థిరత్వాన్ని అందించడంలో సహాయపడుతుంది, విద్యుత్ సరఫరా స్థితిని మెరుగుపరుస్తుంది. గ్రిడ్‌కు విలువైన పునరుత్పాదక శక్తిని జోడించడంతో పాటు, ఈ ప్రాజెక్ట్ పర్యావరణం నుండి ఏటా 6.1 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించటానికి దారితీస్తుంది, తద్వారా గాలి నాణ్యత మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాలు 2000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా 40 సంవత్సరాల ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ సమయంలో రూ. 1140 కోట్ల ఉచిత విద్యుత్ రూపంలో లుహ్రి స్టేజ్ -1 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ లబ్ది పొందుతుంది. ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాలకు పదేళ్లపాటు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు. పునరుత్పాదక శక్తి, విద్యుత్ ప్రసారం మరియు ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి రంగాలలో జెజెవిఎన్ ప్రవేశించింది. 2023 నాటికి 5000 మెగావాట్ల, 2030 నాటికి 12000 మెగావాట్ల, 2040 నాటికి 25000 మెగావాట్ల అన్ని వనరుల నుండి మొత్తం వ్యవస్థాపిత సామర్థ్యం అంతర్గత వృద్ధి లక్ష్యాలకు ఇది అవకాశం కలిపిస్తుంది. 

*****(Release ID: 1670089) Visitor Counter : 214