గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

13వ పట్టణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలపై సదస్సును ప్రారంభించనున్న హర్దీప్ ఎస్ పూరీ

ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్న దానిష్ అర్కిటిక్ట్ , పట్టణ ప్రాంతాల నిపుణుడు ప్రొఫెసర్ జాన్ గెహెల్

పట్టణ ప్రాంతాలపై కోవిడ్ -19 ప్రభావం, ప్రజలకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చే అంశంపై దృష్టి

Posted On: 03 NOV 2020 1:55PM by PIB Hyderabad

పట్టణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు అనే అంశంపై 2020 నవంబర్ 9వ తేదీన కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ 13వ సదస్సును నిర్వహించనున్నది. ఈ ఏడాది ఈ సదస్సు వీడియో కాన్ఫరెన్స్ వెబినార్ ద్వారా ఆన్ లైన్ లో జరగనున్నది. కొవిడ్ -19 రూపంలో ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రజలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండేవిధంగా సౌకర్యవంతం రవాణా సౌకర్యాలను కల్పించే అంశంపై ఈ సదస్సు దృష్టి సారించనున్నది. కేంద్ర గృహ, పట్టాన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరీ ప్రారంభించనున్న సదస్సులో గెహెల్ ఆర్కిటెక్ట్స్ వ్యవస్థాపకుడు, పట్టణ ప్రాంతాల నిపుణుడు అయిన జాన్ గెహెల్ కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు.

రవాణా శాఖ మంత్రి జిన్ బాప్టిస్ట్ డిజెబారి, జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (BMZ) అనుబంధ తూర్పు మరియు తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, పౌర సమాజం, చర్చిల డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్లాడియా వార్నింగ్ కూడా సదస్సులో ప్రసంగించనున్నారు. ప్లీనరీ సదస్సుకు గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సరః. దుర్గా శంకర్ అధ్యక్షత వహిస్తారు.

ఇంతవరకు సదస్సులో చర్చిండానికి 12 అంశాలను గుర్తించారు. సదస్సువల్ల రాష్ట్రాల ప్రభుత్వాలు, పట్టణ ప్రాంతాల సంస్థలు ఈ అంశాలతో కలసి పనిచేస్తున్న వారికీ ప్రయోజనం కలుగుతుంది.

 

 

 క్రమ సంఖ్య

సంవత్సరం

అంశం

వేదిక

  1.  

2008

పట్టణ ప్రాంతాల రవాణా

ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ

  1.  

2009

సుస్థిర పట్టణ రవాణా ఇండియా హాబీటాట్ సెంటర్

సుస్థిర పట్టణ రవాణా ఇండియా హాబీటాట్ సెంటర్ న్యూఢిల్లీ

  1.  

2010

సుస్థిర నగరాలు హోటల్ గ్రాండ్

సుస్థిర నగరాలు హోటల్ గ్రాండ్ న్యూఢిల్లీ

  1.  

2011

సుస్థిర రవాణా మాణిక్ షా సెంటర్

సుస్థిర రవాణా మాణిక్ షా సెంటర్ న్యూఢిల్లీ

  1.  

2012

స్మార్ట్ సిటీస్

మాణిక్ షా సెంటర్ న్యూఢిల్లీ

  1.  

2013

రవాణాతో నగరాల్లో మార్పులు మాణిక్ షా సెంటర్

 మాణిక్ షా సెంటర్ న్యూఢిల్లీ

  1.  

2014

సుస్థిర నగరాలకు సుస్థిర రవాణా

మాణిక్ షా సెంటర్ న్యూఢిల్లీ

  1.  

2015

జీవనశైలికి అనుగుణ రవాణా

మాణిక్ షా సెంటర్ న్యూఢిల్లీ

  1.  

2016

నగరాల సుస్థిరతకు రవాణా ప్రణాళిక

మహాత్మా మందిర్ గుజరాత్

  1.  

2017

సమగ్ర రవాణా ప్రణాళిక

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తెలంగాణ

  1.  

2018

హరిత పట్టణ రవాణా

చిట్నావిస్ సెంటర్, నాగపూర్, మహారాష్ట్ర

  1.  

2019

నివాసయోగ్య నగరాలు

ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ , లక్నో

భారతదేశంలో పట్టణ రవాణా అనే అంశంపై 12వ సదస్సును 2019 నవంబర్ 15 నుంచి 20 వరకు ఇండియా ప్రతిష్ఠాన్, లక్నో లో నిర్వహించడం జరిగింది. " అందరికీ అందుబాటులో జీవనయోగ్యమైన నగరాలు " అనే అంశంపై సదస్సును నిర్వహించారు. సదస్సును, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ

​మంత్రిశ్రీ హారదీప్ సింగ్ పూరీ , ​ ఉత్తరప్రదేశ్ గృహ పట్టణ ప్రణాళికా శాఖ సహాయ మంత్రి శ్రీ. గిరీష్ చంద్ర యాదవ్ లతో కలసి ప్రారంభించారు. సదస్సును నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక మరియు రవాణా సౌకర్యాలను ఇన్స్టిట్యూట్ ఆర్బన్ ట్రాన్స్పోర్ట్ కల్పించింది. 10 విదేశాలకు చెందిన పది మంది ప్రతినిధులతో పాటు సదస్సుకు అంతర్జాతీయ సంస్థలు, రవాణా రంగ నిపుణులు, పరిశోధకులు,30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులతో కలసి 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పట్టనీకరణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పట్టణ ప్రాంతాల ఆర్ధిక వ్యవస్థలో రవాణా రంగం కీలకంగా ఉంటుంది. అయితే, రవాణా రంగంలో ఇటీవల చోటుచేసుకొంటున్న మార్పులతో సొంత వాహనాలకు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత పెరుగుతున్నది. వేగంగా సులభంగా ప్రయాణించడానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మార్పులు దేశంలో ప్రజల రవాణా అవసరాలలో సమగ్ర మార్పులను తీసుకుని రానున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2006 జాతీయ రవాణా విధానాన్ని సిద్ధం చేసింది. ప్రజలకు సురక్షితంగా, అందుబాటులో ఉండే శీఘ్ర, సుస్థిర రవాణా వ్యవస్థకు రూపకల్పన చేయడానికి దీనిలో అవకాశం కల్పించారు. పట్టణాలలో నివసిస్తున్న ప్రజల విద్య, ఉపాధి ఇతర రవాణా అవసరాలను తీర్చే విధంగా రవాణా విధానానికి రూపకల్పన చేయడం జరిగింది.

రవాణా రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను చర్చించి వాటి నుంచి ప్రయోజనం పొందడానికి అవసరమైన సమాచారాన్ని రాష్ట్రాలు, ​నిపుణులకు అందించాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా ఇటువంటి సదస్సులను నిర్వహిస్తున్నది. రవాణా రంగంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ఒక వేదిక మీద తమ అనుభవాలను వివరించి చర్చించడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తున్నది.

***


(Release ID: 1669875) Visitor Counter : 216