సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కార్గిల్ -లెహ్‌లో ఉపాధి కల్పనద్వారా చిరునవ్వుల పూయిస్తున్న ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్
Posted On:
02 NOV 2020 3:51PM by PIB Hyderabad
ఈ ప్రాంతంలో ఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) కల్పిస్తున్న స్థిరమైన ఉపాధి అవకాశాల వల్ల కార్గిల్ లెహ్‌లలో ఉత్పత్తి కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
2017-18 సంవత్సరం నుంచి కెవిఐసి సుమారు వెయ్యి చిన్న మధ్యతరహా తయారీ యూనిట్లను ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పిఎంఇజిపి) కింది కార్గిల్ , లెహ్ లలో ఏ ర్పాటు చేసింది. ఇది పట్టుమని మూడున్నర సంవత్సరాలలో 8200 మందికిపైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఈ యూనిట్లకు మద్దతునిచ్చేందుకు
2017-18 నుంచి 32.35 కోట్ల రూపాయల మార్జిన్ మనీని విడుదల చేశారు.
సిమెంట్ బ్లాకుల తయారీ నుంచి ఐరన్, స్టీలు వస్తువులు, ఆటోమొబైల్ రిపేర్ వర్క్‌షాపులు, టెయిలరింగ్ యూనిట్లు, చెక్క ఫఱ్నీచర్ తయారీ యూనిట్లు, కార్వింగ్ యూనిట్లు , సైబర్ కేఫ్‌లు, బ్యూటీ పార్లర్లు, బంగారు ఆభరణాల తయారీ వంటివి కెవిఐసి మంద్దతు పొందినయూనిట్లలో ఉన్నాయి. వీటివల్ల స్థానికులు గౌరవప్రదమైన రీతిలో జీవనోపాధి పొందగలుగుతున్నారు. 2020-21 తొలి ఆరు నెలల కాలంలో కోవిడ్ లాక్‌డౌన్ కారణం ఉన్నప్పటికీ, కెవిఐసి స్థానికులు కార్గిల్‌లో 26 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, లెహ్‌లోని 24 ప్రాజెక్టులు నెలకొల్పడానికి సహాయం చేసింది. దీనివల్ల ఈ రెండు ప్రాంతాలలో 350 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
పిఎంఇజిపి పథకానికి ప్రధానంగా కెవిఐసి నోడల్ అమలు ఏజెన్సీ. 2017-18 నుంచి 2020-21 వరకు (సెప్టెంబర్ 30) నాటికి కెవిఐసి కార్గిల్‌లో 802 ప్రాజెక్టులు ఏర్పాటు చేయగా లెహ్‌లో 191 ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. దీనిద్వారా 6781 ఉద్యోగాలు కార్గిల్‌లో, 1421 ఉద్యోగాలు లెహ్‌లో వచ్చాయి. కెవిఐసి 26.67 కోట్ల రూపాయల మార్జిన్ మనీని కార్గిల్ లోని ఈ ప్రాజెక్టులకు పంపిణీ చేసింది. లెహ్‌లోని ప్రాజెక్టులకు 5.68 కోట్లు పంపిణీ చేసింది.
లెహ్-లద్దాక్ ప్రాంతం సంవత్సరంలో ఆరునెలలు మాత్రమే చేరుకోవడానికి వీలుగా ఉంటుందని, పర్యావరణపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కల్పన ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందని కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా అన్నారు.
కార్గిల్, లెహ్‌లో వివిధ తయారీ కార్యకలాపాలు చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అంటూ శ్రీ సక్సేనా, లెహ్, కార్గిల్‌లు సంవత్సరంలో ఆరునెలల పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు లేకుండా ఉంటాయని. అయితే , ఈ ఉత్పాదక సంస్థలు ఏడాది పొడవునా ఈ ప్రాంతానికి స్థానికంగా ఉత్పత్తులు అందుబాటులో ఉండేట్టు చేస్తాయని ఆయన అన్నారు.
కార్గిల్ లెహ్‌లలోని లబ్ధిదారులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ, తాము ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, స్వయంగా తాము ఉత్పాదక యూనిట్లను నెలకొల్పినందువల్ల ఇది తమకు ఉపాధి లభించేట్టు చేయడమే కాక, ఈ ప్రాంతంలోని ఎంతోమంది యువతకు తాము ఉపాధి కల్పించగలుగుతున్నామని వార అన్నారు.
కార్గిల్‌లోని మింజి గ్రామానికి చెందిన మహ్మద్ బకీర్ సిమెంట్ బ్లాకుల తయారీ యూనిట్‌ను ప్రాథమికంగా 10 లక్షల రూపాయల రుణంతో ప్రారంభించాడు. అది ఇప్పుడు ఏటా 52 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. అతను తన యూనిట్‌లో 8 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అలాగే ఇస్మాయిల్ నసిరి ఐర్‌న్, స్టీలు వస్తువుల ఉ త్పత్తిలో నిమగ్నమై ఉన్నారు. కార్గిల్‌లోని పొయెన్ గ్రామంలో 25 లక్షల రూపాయల వ్యయంతో యూనిట్‌ను నెలకొల్పారు. ఇతను 10 మందిని ఉద్యోగంలో పెట్టుకున్నారు. దీనిటర్నోవర్ రూ 76 లక్షల రూపాయలు.
ఈ ఉపాధి అవకాశాల కారణంగా స్థానిక మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడానికి సానుకూలంగా ముందుకు వస్తున్నారు. కెవిఐసి ఎంతో మంది మహిళా వ్యాపారవేత్తలకు సహాయం అందిస్తోంది. వీరు విజయవంతంగా కటింగ్, టైలరింగ్ యూనిట్లు, బ్యూటీ పార్లర్లు ఈ జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నారు.
కార్గిల్‌లోని బారూలో ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యుయర్ కటింగ్ టైలరింగ్ కార్యకలాపాలను చేపట్టారు. ఈమె మరో ముగ్గురు మహిళలకు తమ యూనిట్‌లొ ఉపాధి కల్పించారు. హమీదా వార్షిక టర్నోవర్ సుమారు 12 లక్షల రూపాయలకు చేరుకుంది.
లెహ్-లడక్ ప్రాంత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పక తప్పదు. 2019లో జమ్ము కాశ్మీర్ నుంచి విభజన అనంతరం స్థానిక ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరిగింది.
కార్గిల్, లెహ్‌లో 2017-18 నుంచి 2020-21 (సెప్టెంబర్ 30) వరకు ప్రాజెక్టుల సంఖ్య, ఉపాధి
|
క్రమసంఖ్య
|
సంవత్సరం
|
ప్రాజెక్టుల సంఖ్య |
పంపిణీ చేసిన మార్జిన్ మనీ
రూ.లక్షలలో
|
కల్పించిన ఉపాధి
|
01
|
2017-18
|
172
|
417.12
|
1099
|
02
|
2018-19
|
462
|
1491.63
|
4252
|
03
|
2019-20
|
309
|
1122.94
|
2501
|
04
|
2020-20
(upto 30.09.2020)
|
50
|
204.00
|
350
|
|
మొత్తం |
993
|
3235.69
|
8202
|
*****
|
(Release ID: 1669617)
Visitor Counter : 221