శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్ర, సాంకేతిక శాఖ స్వర్ణోత్సవం సందర్భంగా స్పెషల్ పోస్టల్ కవర్ విడుదల
ఆవిష్కరించిన మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, సంజయ్ ధోత్రే
ప్రధానమంత్రి పేర్కొన్న “శాస్త్రీయ సామాజిక బాధ్యత”ను
ప్రధానంగా ప్రస్తావించన డాక్టర్ హర్షవర్ధన్
అన్ని విజ్ఞాన శాస్త్ర రంగాల్లో మన శాస్త్రవేత్తలు తమ ప్రతిభా పాటవాలను
అంతర్జాతీయంగా కూడా రుజువు చేసుకున్నారన్న హర్షవర్ధన్
ప్రజలకు మరింత క్రియాశీలక సేవలకోసం తపాలా శాఖతో సన్నిహితంగా పనిచేయాలని శాస్త్ర, సాంకేతి శాఖకు సంజయ్ ధోత్రే పిలుపు
భారతదేశం అభివృద్ధిలో సింహభాగం
శాస్త్రవేత్తల సేవల ఫలితమేనన్న సంజయ్ ధోత్రే
Posted On:
02 NOV 2020 5:07PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డి.ఎస్.టి.) స్వర్ణోత్సవాలకు గుర్తింపుగా తపాలా శాఖ రూపొందించిన స్పెషల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, భూగోళ శాస్త్రాల అధ్యయన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్,.. తపాలా, విద్యా, ఎలక్ట్రానిక్స్, ఐ.టి. శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే స్పెషల్ కవర్ ను ఆవిష్కరించారు. తపాలా శాఖ డైరెక్టర్ జనరల్ వినీత్ కమార్ పాండే,.. శాస్త్ర, సాంకేతిక శాఖ, తపాలా శాఖల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్పెషల్ కవర్ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు డాక్టర్ హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు. “విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అంతర్జాతీయంగా అన్ని స్థాయిల్లోనూ మన శాస్త్రవేత్తలు తమ ప్రతిభాపాటవాలను రుజువు చేసుకున్నారు. కృత్రిమ మేధస్సు, నానో టెక్నాలజీ, డాటా అనాలిసిస్, ఖగోళ భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అటామిక్ క్లాక్ తో పాటు మరెన్నో రంగాల్లో మన శాస్త్రవేత్తలు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. పలు విజ్ఞాన శాస్త్ర రంగాల్లో మన దేశం 80కిపైగా దేశాలతో అంతర్జాతీయ సహకార సంబంధాలను కుదుర్చుకుందన్నారు. సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రిగా తాను గత ఆరేళ్లుగా దేశంలోని ప్రతి పరిశోధనా కేంద్రాన్ని సందర్శించానని, ప్రస్తుత కోవిడ్ సంక్షోభంతో సహా అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా,.. కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు మన శాస్త్రవేత్తలు నిర్విరామంగా పనిచేస్తూ ఉండటం, ఇది ఎంతో గర్వకారణమని అన్నారు.
“విజ్ఞాన శాస్త్ర సంబంధమైన ప్రతి పరిశోధనా, ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించ గలిగేలా శాస్త్రీయమైన సామాజిక బాధ్యతతో మెలగాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు” నకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. “శాస్త్ర సాంకేతిక శాఖ స్వర్ణోత్సవం సందర్బంగా చారిత్రాత్మకమైన స్పెషల్ కవర్ రూపొందించినందుకు” తపాలా, విద్యా, ఎలక్ట్రానిక్స్, ఐ.టి. శాఖ మంత్రి సంజయ్ ధోత్రేకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం మరింత క్రియాశీలకమైన ప్రయోజనాలు, సేవలు అందించేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ, తపాలా శాఖతో మరింత సహకారంతో, సమన్వయంతో పనిచేయాలన్నారు. “ప్రజలకు ఎంతో విశ్వాసపాత్రమైన మిత్రుడు ”గా తపాలా శాఖను అభివర్ణించారు. తన కుటుంబ సభ్యలకు లేఖలు రాయడం, వారినుంచి తిరిగి లేఖలను అందుకోవడం తనకు ఎంతో ఇష్టమైన అనుభవాలంటూ ఆయన గత స్మృతులను నెమరువేసుకున్నారు.
మరో మంత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ,..శాస్త్రసాంకేతిక శాఖ విజయాలను అభినందించారు. “శాస్త్ర సాంకేతిక శాఖ సాధించి విజయాలను ప్రశంసిస్తూ ఒక స్పెషల్ కవర్ రూపొందించడం తమకు గర్వకారణంగా తపాలా శాఖ భావిస్తోంద”ని అన్నారు. “భారతదేశ అభివృద్ధిలో సింహభాగం మన శాస్త్రవేత్తల కృషిఫలితమే. తపాలా శాఖ ప్రమేయంతో రూపొందిన స్పెషల్ కవర్ తో మన శాస్త్రవేత్తల కృషిని ప్రతి ఒక్కరూ అభినందించేందుకు వీలవుతుంది. జాతి పురోగమనంలో, పేదలకు ప్రయోజనాల కల్పనలో శాస్త్రవేత్తల పాత్రను అందరూ అభినందించేందుకు వీలు కలుగుతుంది.” అని అన్నారు. “అతి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేశంలోని ప్రజలందరినీ అనుసంధానం చేసే ఎంతో విశ్వాసపాత్రమైన భారత ప్రభుత్వ సంస్థగా తపాళాశాఖకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.” అని ధోత్రే అన్నారు. ప్రజలకు మరింత హితకారిగా, వేగంగా సేవలందించే సంస్థగా తపాలాశాఖను తీర్చిదిద్దేందుకు, శాస్త్ర సాంకేతిక శాఖ, తపాలా శాఖ పరస్పరం మరింత సన్నిహితంగా పనిచేయాలన్నారు.
శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, భారతీయ శాస్త్రవేత్తల వ్యవస్థకు శాస్త్ర సాంకేతిక శాఖ అందిస్తున్న మద్దతు,.. విజ్ఞాన శాస్త్ర రంగంలో భారత్ అంతర్జాతీయ స్థాయి విజయాల సాధనకు దోహదపడుతోందన్నారు. విజ్ఞాన శాస్త్ర సంబంధమైన ప్రచురణల్లో ప్రపంచంలో భారత్ 3వ ర్యాంకు సాధించడం, సృజనాత్మక సూచికలో పురోగమించడం వంటివి ఇందుకు నిదర్శనాలన్నారు. గత యాబై ఏళ్లుగా శాస్త్రవేత్తలు సాగించిన కృషితోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, తాజాగా రూపొందించిన స్పెషల్ పోస్టల్ కవర్ లో ఈ అంశాలనే స్మరించుకుంటున్నామని అన్నారు. తపాలా శాఖకు సాంకేతిక పరిజ్ఞానపరమైన పరిష్కారాలను సాధించిపెట్టేందుకుగాను ఆ శాఖతో కలసి పనిచేసేందుకు తాము కుతూహలంతో ఉన్నామని అన్నారు.
శాస్త్ర, సాంకేతిక శాఖ ఏర్పడి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2020, మే 3నుంచి,.. 2021, మే3వ తేదీవరకూ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. స్వర్ణోత్సవ సంవత్సరంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కొత్త పరిశోధనాంశాలను ప్రోత్సహించడం, దేశంలో జరిగే శాస్త్ర సాంకేకిత కార్యకలాపాల నిర్వహణకు, సమన్వయానికి కేంద్రసంస్థగా వ్యవహరించడం తదితర లక్ష్యాలతో 1971వ సంవత్సరంలో శాస్త్ర, సాంకేతిక శాఖ ఏర్పాటైంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు నిర్దిష్ట విధానాల రూపకల్పన, మంత్రివర్గానికి సంబంధించిన శాస్త్ర వ్యవహారాల సలహా సంఘం కార్యకలాపాలను పర్యవేక్షణ, దేశ అభివృద్ధి, భద్రత అంశాలకు సంబంధించిన కార్యకలాపాలకు ప్రోత్సాహం, శాస్త్ర పరిశోధనా సంస్థలకు, శాస్త్రవేత్తల సంఘాలకు మద్దతు, సహాయ గ్రాంటు అందించడం వంటి ప్రధాన బాధ్యతలను నిర్వర్తించడమే లక్ష్యంగా శాస్త్ర, సాంకేతిక శాఖను రూపొందించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యున్నత స్థాయిలో మౌలికమైన పరిశోధనలు నిర్వహించడం మొదలుకొని,.. తగిన నైపుణ్యాల రూపల్పనతో సామాన్య ప్రజలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వరకూ విస్తృతమైన అనేక కార్యకలాపాల శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహిస్తూ వస్తోంది.
*****
(Release ID: 1669534)
Visitor Counter : 313