రక్షణ మంత్రిత్వ శాఖ
కెన్యా రక్షణ దళాధిపతి -భారత్‌లో వారం పర్యటన ఆఫ్రికా బయిట పర్యటిస్తున్న తొలి దేశం
Posted On:
02 NOV 2020 4:00PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు నవంబర్ 02- 06 వరకు కెన్యా రక్షణ దళాల అధిపతి జనరల్ రాబర్్ట కిబోచీ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది మేలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆఫ్రికా బయిట పర్యటిస్తున్న భారత్ తొలి దేశం కావడం విశేషం. ఆయన వారం రోజుల పర్యటనలో భాగంగా ఆయన రక్షణ మంత్రిని, జాతీయ భద్రతా సలహాదారును, త్రివిధ దళాధిపతులను, విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులను న్యూఢిల్లీలో కలువనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆగ్రా, మహువా, బెంగళూరు సందర్శించనున్నారు. అయితే, రక్షణదళాధిపతి భారత్‌లో పర్యటించడం ఇది తొలిసారి కాదు. ఆయన మహువాలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో, యువ అధికారిగా 1984-87 వరకు సిగ్నల్ ఆఫీసర్స్ డిగ్రీ, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ కోర్సు చదివారు.
3. భారత్, కెన్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత లోతైన సంబంధాలు కలిగి ఉండే అవకాశం కలిగి ఉన్న సమయంలో ఆయన పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016లో, రాష్ట్రపతి 2017లో కెన్యాలో పర్యటించిన తర్వాత, సంబంధాలు నానాటికీ బలోపేతం అయ్యాయి. రక్షణ సహకారంలో సామర్ధ్యం, సామర్ధ్య నిర్మాణం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, వైద్య ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీలో ఉన్నాయి.
4. భారత్, కెన్యాలు పరిణితి చెందిన ప్రజాస్వామ్యాలు కావడమే కాక వృత్తి నిపుణులత కలిగిన సాయుధ దళాలను కలిగి ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఇరు దేశాల మధ్య ఆలోచనలలో ఏకరూపత కనిపిస్తుంది. ఇరు దేశాల మధ్య సాయుధ దళాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటనతో మరింత పటిష్ఠం కానున్నాయి. రక్షణదళాల అధిపతి నవంబర్ 7వ తేదీన తిరిగి వెళ్ళనున్నారు.
***
(Release ID: 1669496)
Visitor Counter : 245