శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వైభవ్ సదస్సు : స్వదేశీ, విదేశీ భారతీయ శాస్త్రవేత్తలు / విద్యావేత్తల ప్రత్యేక సమావేశం విజయవంతంగా ముగిసింది
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానానికి చెందిన నూతన మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఈ సదస్సు సహకార అవకాశాలను కల్పించింది
సార్వత్రిక అభివృద్ధికోసం ఎదురౌతున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ భారతీయ పరిశోధకుల నైపుణ్యం / జ్ఞానాన్ని పెంచడానికి సమగ్ర రోడ్ మ్యాప్ ను ప్రతిపాదించిన -వైభవ్ సదస్సు
Posted On:
01 NOV 2020 3:17PM by PIB Hyderabad
2020 అక్టోబర్, 2వ తేదీ, గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించిన, స్వదేశీ, విదేశీ భారతీయ పరిశోధకులు, విద్యావేత్తల అంతర్జాతీయ ఆన్-లైన్ సమావేశం - "విశ్వ భారతీయ వైజ్ఞానిక (వైభవ్) సదస్సు" నిన్న ముగిసింది. ఆన్ఈ లైన్ లో జరిగిన ఈ సదస్సు కోసం సుమారు 2,600 మంది విదేశీ భారతీయులు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా నెలరోజులపాటు నిర్వహించిన వెబినార్ల పరంపరలో, సుమారు 3,200 మంది ప్యానలిస్టులతో పాటు భారతదేశం మరియు విదేశాల నుండి సుమారు 22,500 మంది విద్యావేత్తలు మరియు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అక్టోబర్, 3వ తేదీన ప్రారంభమైన ఈ చర్చలు, 2020 అక్టోబర్, 31వ తేదీన సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి రోజున ముగిశాయి. అక్టోబర్ 3 నుండి 25 వరకు ప్రముఖ సంస్థలు, వివిధ అంశాలపై దాదాపు 722 గంటల సేపు చర్చలు నిర్వహించాయి. ఈ చర్చల ద్వారా వెల్లడైన అభిప్రాయాలను నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ మరియు భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్, ఆధ్వర్యంలోని సలహా మండలి, 2020 అక్టోబర్, 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమీక్షించింది. ఈ సలహా మండలిలో - సి.ఎస్.ఐ.ఆర్; డి.ఎస్.టి; డి.ఆర్.డి.ఓ; ఐ.సి.ఏ.ఆర్; డి.ఓ.ఎస్; డి.ఏ.ఈ; డి.బి.టి; ఆరోగ్యం; ఫార్మా; ఎమ్.ఈ.ఏ; ఎమ్.ఓ.ఈ.ఎస్; ఎమ్.ఈ.ఐ.టి.వై; ఎమ్.ఓ.ఈ; ఐ.సి.ఎం.ఆర్. వంటి వివిధ శాస్త్ర, సాంకేతిక విభాగాలు మరియు ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు వ్యక్తం చేసిన కీలక అభిప్రాయాలను ప్రముఖ సంస్థలు స్వీకరించాయి.
వైభవ్ మరియు ఆత్మ నిర్భర్ భారత్:
ఆత్మ నిర్భర్ భారత్ వైపు ఒక ముఖ్యమైన మార్గంగా పరిశోధన సామర్థ్యాన్ని స్థాపించడంలో వైభవ్ విజయవంతమయ్యింది. దేశంలో సమకాలీన పరిశోధనలను ప్రతి ప్రాంతంలో భాగస్వామ్య ప్రయోజనం కోసం సమం చేయడానికి ఇది మార్గాన్ని సుగమం చేసింది. ప్రపంచ సౌభాగ్యం కోసం భారతదేశ శాస్త్ర, సాంకేతిక సామర్ధ్యానికి సజావుగా దోహదపడటానికి దేశీయ, విదేశీ భారతీయులు పరిశోధన మరియు విద్యా సామర్థ్యాల యొక్క సమగ్ర దృక్పథాన్ని ఇచ్చారు. ఈ వైభవ్ సదస్సు, సైబర్ స్పేస్ లో ఇంటరాక్టివ్ మరియు సులభమైన యంత్రాంగాన్ని సృష్టించింది. అదేవిధంగా, సహకారం మరియు నాయకత్వ అభివృద్ధిని ప్రోత్సహించింది. విద్యాసంస్థలకు మాత్రమే కాకుండా, పరిశోధనా ఫలితాలను ఉపయోగించుకునే ప్రభుత్వ నిధులతో నిర్వహించే పరిశోధన, అభివృద్ధి సంస్థలు మరియు పరిశ్రమలకు కూడా శాస్త్ర, పరిశోధనల రంగంలో ఇది ఒక గొప్ప ప్రయత్నం.
వైభావ్ : విస్తృతమైన చర్చలవేదిక :
అనేక ప్రాంతాలు మరియు విషయాల నిర్మాణాత్మక చట్రం పరిధిలో వైభవ్ సదస్సులో చర్చలు జరిగాయి. విద్యా మరియు శాస్త్రీయ సమావేశాల చరిత్రలో ఈ సదస్సు చాలా విభాగాల్లో ప్రధమ స్థానాలను సాధించింది.
ఈ సదస్సులో కీలక ముఖ్యాంశాలు :
- 18 ప్రదేశాలు (ప్రాంతాలు)
- 80 అంశాలు (విషయాలు)
- 230 ముఖా ముఖీ చర్చా సమావేశాలు
- 23 రోజుల పాటు ముఖాముఖీ చర్చలు
- 3,169 మంది నిపుణులు
- 22,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు
- 722 గంటల పాటు అధికారిక చర్చలు
ఈ ప్యానెలిస్టులలో, 45 శాతం మంది విదేశీ భారతీయులు మరియు 55 శాతం మంది స్వదేశీ భారతీయ విద్యావేత్తలు మరియు శాస్త్రవేత్తలు ఉన్నారు. అదనంగా, అధికారిక ప్యానెల్ సమావేశానికి ముందు సుమారు 200 గంటల సన్నాహక మరియు అభ్యాస చర్చలు జరిగాయి. ఈ సదస్సులో మొత్తం 71 దేశాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. దేశంలో ఇది ఒక రకమైన చొరవ, ఇక్కడ అనేక రకాలైన అంశాలపై శాస్త్రీయ చర్చలు జరిగాయి. పాల్గొనడం, ప్రాంతాల కవరేజ్, చర్చల తీవ్రత, చర్చలకు ఎన్ని గంటలు గడిపారు, దేశాల సంఖ్య మరియు పాల్గొనేవారి నాణ్యత పరంగా, ఈ సదస్సు చరిత్రను సృష్టించింది.
"ఆదర్శవంతమైన పరిశోధనా పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, సంప్రదాయాన్ని ఆధునికతతో విలీనం చేసి శ్రేయస్సును సృష్టించడం", కోసం ఈ సదస్సు ఉద్దేశించబడింది. ఈ సదస్సులో - గణన శాస్త్రాలు; ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్; క్వాంటం టెక్నాలజీస్; ఫోటోనిక్స్; ఏరోస్పేస్ టెక్నాలజీస్; ఆరోగ్య మరియు వైద్య శాస్త్రాలు; ఫార్మా మరియు బయోటెక్నాలజీ; వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు ఆహార భద్రత; మెటీరియల్ & ప్రాసెసింగ్ టెక్నాలజీస్; ఆధునిక తయారీ; భూ విజ్ఞాన శాస్త్రాలు; విద్యుత్తు; పర్యావరణ శాస్త్రాలు; యాజమాన్యం, సామాజిక శాస్త్రాలు; మొదలైన అంశాలపై చర్చలు జరిగాయి.
వైభవ్ : అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కొత్త సహకారాలు -
బయో రెమెడియేషన్, అర్బన్ ధాతువు రీసైక్లింగ్ మరియు మెటల్ ఆర్గానిక్స్ వంటి గతంలో ప్రాముఖ్యత నివ్వని కొన్ని భాగస్వామ్య అంశాలను ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. భవిష్యత్ విద్యుత్ గ్రిడ్లు, ఇంటరాక్టివ్, అయితే ఐలాండ్ చేయగల మైక్రోగ్రిడ్లు మరియు సంబంధిత సాంకేతికతలు భారతదేశంలో విద్యుదీకరణకు మరియు స్థితిస్థాపకతను కొనసాగించడానికి కీలకం. సైబర్ స్పేస్ లోని ఒక టైమ్-జోన్ లో , ఒకే చిప్ లో అసెంబ్లీ ప్యాకేజింగ్ వివిధ కార్యాచరణ యొక్క ప్రాముఖ్యతను ఒక సెషన్ చర్చిస్తుండగా, చిక్కుకున్న అయాన్లు మరియు అణు గడియారానికి సంబంధించి మరొక టైమ్-జోన్ లో సాంకేతిక ఆలోచనలు ప్రతిపాదించబడుతున్నాయి. వీటిలో - పొర స్థాయి ప్యాకేజింగ్; ఎమ్.ఈ.ఎం.ఎస్. కోసం 3-డి సమైక్యత; సిలికాన్ ప్లాట్‌ఫారమ్ పై 2-డి పదార్థాల యొక్క భిన్న సమైక్యత; పూర్తి మిషన్ మోడ్ ఇంజిన్ సైకిల్ విశ్లేషణ; ఫ్యాన్ యొక్క ఏరో ఎలాస్టిక్ విశ్లేషణ; హాట్ టర్బైన్ బ్లేడ్ శీతలీకరణ సాంకేతికత; మూలకాల శుద్దీకరణ కోసం పొర విభజన; డిటెక్టర్ అప్లికేషన్ కోసం జి.ఈ. శుద్దీకరణ; వంటివి కొన్ని ఉన్నాయి. టి.హెచ్.జెడ్. మరియు మిడ్ ఐ.ఆర్. పౌనఃపున్యాల కోసం అధిక మోతాదు గల జి.ఈ. కొన్ని భాగస్వామ్య ప్రాంతాలను గుర్తించడం జరిగింది.
వైభవ్ – ప్రతిస్పందన మరియు భవిష్యత్తు :
ఒక బృందం సభ్యుడు ఈ వైభవ్ సదస్సును ‘క్షేత్ర స్థాయి శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తలను ప్రోత్సహించేది' గా వర్ణించగా, ఇది ‘ఆడంబరమైన పేర్లు లేని చారిత్రాత్మకమైన ఒక గొప్ప చర్య ’, అని ఒక నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ సదస్సు సందర్భంగా, దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపక్వత దశకు తీసుకెళ్ళడానికి, దేశీయ పరిశోధకులు తమ అంతర్జాతీయ భాగస్వాములతో చర్చిస్తున్నారు. పరిశోధన సహకారం మరియు వాణిజ్యీకరణను ప్రారంభించడానికి "పరిశోధనా మద్దతు, భవిష్యత్ సాంకేతిక మార్గాలను గుర్తించడానికి పరిశ్రమలకు నియంత్రణ అవసరాన్నీ, విద్యా-పరిశ్రమ సహకారాన్నీ ప్రోత్సహించడానికి ఈ సదస్సు దోహదపడుతుందని" ఒక ప్యానెల్ అభిప్రాయపడింది.
సార్వత్రిక అభివృద్ధికి ఎదురౌతున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ భారతీయ పరిశోధకుల నైపుణ్యం / జ్ఞానాన్ని పెంచడానికి ఈ సదస్సు ఒక సమగ్ర రోడ్ మ్యాప్ ను ప్రతిపాదించింది. ఈ సదస్సు రూపొందించిన పత్రాలు మరియు సిఫార్సులను తదుపరి సూచనల కోసం అధికారికంగా సలహా మండలికి సమర్పించడం జరుగుతుంది. భారతదేశం మరియు విదేశాలలో విద్యావేత్తలు, శాస్త్రవేత్తలతో పరిశోధన యొక్క కొత్త మార్గాలు, పరిశోధనా పర్యావరణ వ్యవస్థ యొక్క రంగాల బలోపేతం, సహకార అవకాశాలు మరియు సహకార సాధనాలపై ఈ సదస్సు తనదైన ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. భారతదేశం మరియు ప్రపంచం కోసం అంతర్జాతీయ ప్రతిస్పందనల ద్వారా దేశంలో జ్ఞానం మరియు ఆవిష్కరణల యొక్క విస్తృత పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ఈ సదస్సు లక్ష్యం.
*****
(Release ID: 1669411)
Visitor Counter : 276