ఆర్థిక మంత్రిత్వ శాఖ

అక్టోబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,05,155 కోట్లు


Posted On: 01 NOV 2020 11:09AM by PIB Hyderabad

 

గ‌త అక్టోబర్ నెలలో రూ.1,05,155 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు న‌మోదయ్యాయి. దీనిలో సీజీఎస్‌టీ వ‌సూళ్లు రూ.19,193 కోట్లుగాను, ఎస్‌జీఎస్‌టీ వ‌సూళ్లు రూ. 25,411 కోట్లుగాను, ఐజీఎస్‌టీ ప‌న్ను వ‌సూళ్లు రూ.52,540 కోట్లుగాను (వస్తువుల‌ దిగుమతుల‌పై సేకరించిన రూ.23375 కోట్లు రూపాయలతో సహా..) నిలిచాయి. సెస్ రూపంలో వ‌సూలైన ఆదాయం రూ.8,011 కోట్లుగా (వస్తువుల‌ దిగుమతిపై సేకరించిన రూ.932 కోట్లతో సహా) న‌మోదు అయింది. అక్టోబర్ నెలాఖ‌రు నాటికి స‌ద‌రు మొత్తం నెలలో దాఖలు చేసిన జీఎస్‌టీఆర్-3 బీ రిటర్న్స్ 80 లక్షలుగా న‌మోదైంది. సాధార‌ణ ప‌రిష్కారాల రూపంలో ఐజీఎస్‌టీ నుంచి రూ.25091 కోట్ల సీజీఎస్‌టీని మ‌రియు రూ.19.427 కోట్ల ఎస్‌జీఎస్‌టీని ప్ర‌భుత్వం సెటిల్‌మెంట్ చేసింది. 2020 అక్టోబర్ నెలలో సాధారణ పరిష్కారం తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదించిన మొత్తం ఆదాయం సీజీఎస్‌టీ రూ.44,285 కోట్లుగాను మరియు ఎస్‌జీఎస్‌టీ రూ.44,839 కోట్లుగాను నిలిచింది. గత ఏడాది అక్టోబ‌రు నెల‌లో వ‌సూళ్ల‌యిన జీఎస్‌టీ ఆదాయం కంటే.. ఈ ఏడాది అక్టోబ‌రుల నెల‌లో వ‌సూళ్ల‌యిన జీఎస్‌టీ ఆదాయం 10 శాతం ఎక్కువ. గ‌త అక్టోబ‌రు మాసంలో వస్తువుల దిగుమతి నుండి వచ్చే ఆదాయం 09 శాతం, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ల‌భించే ఆదాయం(సేవల దిగుమతితో సహా) 11 శాతం అధికంగా న‌మోద‌యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఇది అధికం కావ‌డం విశేషం. జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలతో పోలిస్తే జీఎస్‌టీ ఆదాయంలో పెరుగుదల వరుసగా -14 శాతం, -8 శాతం, 5 శాతంగా నిలిచింది. ఇది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఆదాయంలో పెరుగుద‌ల‌ పథాన్ని స్పష్టంగా తెలియ‌‌బ‌రుస్తోంది.

ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయంలో పోకడలను ఈ చార్ట్ చూపిస్తుంది

గ‌తేడాది అక్టోబ‌రు (2019) మాసంతో పోలిస్తే  ఈ ఏడాది అక్టోబ‌రులో (2020) 

ప్ర‌తి రాష్ట్రంలో జీఎస్టీ వ‌సూళ్ల వివ‌రాలు మ‌రియు మొత్తం సంవ‌త్స‌ర వ‌సూళ్లు ఈ కింది ప‌ట్టిక‌లో చూడొచ్చు.

ప‌ట్టికః రాష్ట్రాల వారీగా జీఎస్టీ సేకరణ ఏప్రిల్ 2020 [1]

 

రాష్ట్రం

అక్టోబ‌రు

-2019

అక్టోబ‌రు

-2020

వృద్ధి

జ‌మ్మూ మ‌రియు కాశ్మీర్‌

313

377

21%

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌

669

691

3%

పంజాబ్‌

1,189

1,376

16%

ఛండీగ‌ఢ్‌

157

152

-3%

ఉత్త‌రాఖండ్‌

1,153

1,272

10%

హ‌ర్యానా

4,578

5,433

19%

ఢిల్లీ

3,484

3,211

-8%

రాజ‌స్థాన్‌

2,425

2,966

22%

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌

5,103

5,471

7%

బీహార్‌

940

1,010

7%

సిక్కిం

186

177

-5%

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌

41

98

138%

నాగా‌లాండ్‌

25

30

20%

మ‌ణిపూర్‌

43

43

0%

మిజోరాం

18

32

72%

త్రిపుర‌

54

57

5%

మేఘాల‌య‌

113

117

4%

అస్సాం

888

1,017

14%

ప‌శ్చిమ బెంగాల్‌

3,263

3,738

15%

జార్ఖండ్‌

1,437

1,771

23%

ఒడిషా

1,994

2,419

21%

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌

1,570

1,974

26%

మ‌ధ్య ప్ర‌దేశ్‌

2,053

2,403

17%

గుజ‌రాత్‌

5,888

6,787

15%

డామ‌న్ మరియు డ‌య్యు

83

7

-91%

దాద్రాన‌గ‌ర్ హ‌వేలీ

130

283

118%

మ‌హారాష్ట్ర

15,109

15,799

5%

క‌ర్ణాట‌క‌

6,675

6,998

5%

గోవా

311

310

0%

ల‌క్ష‌ద్వీప్‌

2

1

-55%

కేర‌ళా

1,549

1,665

7%

తమిళ‌నాడు

6,109

6,901

13%

పుదిచ్చె‌రి

146

161

10%

అండ‌మాన్ మ‌రియు నికోబార్ దీవులు

32

19

-42%

తెలంగాణ‌

3,230

3,383

5%

ఆంధ్ర‌‌ప్ర‌దేశ్‌

1,975

2,480

26%

ల‌ద్దాఖ్‌

0

15

 

ఇత‌ర ప్రాంతాలు

127

91

-28%

కేంద్ర ప‌రిధిలో..

(సెంట్ర‌ల్ జ్యురిస్డిక్ష‌న్‌)

మొత్తం

97

114

17%

మొత్తం

73,159

80,848

11%

*****

 

 


(Release ID: 1669315) Visitor Counter : 357